October Month
-
వచ్చే నెలలో బ్యాంకులకు వరుస సెలవులు
సెప్టెంబర్ నెల ముగింపునకు వచ్చేసింది. కొత్త నెల త్వరలో ప్రారంభం కానుంది. రానున్న అక్టోబర్ నెలలో పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు చాలా రోజులు సెలవులు ఉండబోతున్నాయి. శారదీయ నవరాత్రి నుండి దసరా, దీపావళి వరకు సెలవుల కారణంగా బ్యాంకులు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు.బ్యాంకులు ప్రతిఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని మీద బ్యాంకులకు వెళ్లాల్సిన వస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో బ్యాంకుల్లో పని ఉన్నవారు సెలవులకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే నెలలో ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయి.. ఏయే రోజుల్లో బ్యాంకులు మూసిఉంటాయి అన్న సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం..సెలవుల జాబితా ఇదే.. » అక్టోబర్ 1- అసెంబ్లీ ఎన్నికల కారణంగా జమ్మూలో బ్యాంకుల మూత» అక్టోబర్ 2- గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు» అక్టోబర్ 3 - నవరాత్రి స్థాపన కారణంగా జైపూర్‌లో సెలవు» అక్టోబర్ 6- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు.» అక్టోబర్ 10- దుర్గాపూజ, దసరా, మహాసప్తమి కారణంగా త్రిపుర, అస్సాం, నాగాలాండ్, పశ్చమ బెంగాల్లో బ్యాంకుల మూత» అక్టోబర్ 11- దసరా, మహా అష్టమి, మహానవమి, ఆయుధ పూజ, దుర్గా అష్టమి, దుర్గాపూజ కారణంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలో సెలవు» అక్టోబర్ 12- దసరా, విజయదశమి, దుర్గాపూజ కారణంగా దాదాపు దేశవ్యాప్తంగా సెలవు» అక్టోబర్ 13- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల మూత» అక్టోబర్ 14- దుర్గాపూజ లేదా దాసైన్ కారణంగా గాంగ్టక్లో సెలవు» అక్టోబర్ 16- లక్ష్మీ పూజ సందర్భంగా అగర్తల, కోల్‌కతాలో బ్యాంకుల మూత» అక్టోబర్ 17- మహర్షి వాల్మీకి జయంతి, కాంతి బిహు సందర్భంగా బెంగళూరు, గౌహతిలో సెలవు» అక్టోబర్ 20- ఆదివారం దేశవ్యాప్తంగా హాలిడే» అక్టోబర్ 26- నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు» అక్టోబర్ 27- ఆదివారం దేశవ్యాప్త హాలిడే» అక్టోబర్ 31- దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవుఅక్టోబర్లో పండుగల సీజన్ కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆయా రోజుల్లో పని చేయవు. బ్యాంకులు అందుబాటులో లేనప్పటికీ చాలా పనులను ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి భారీ పెట్టుబడులు - సిప్ రూపంలో రూ.17 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అక్టోబర్‌లోనూ ఇన్వెస్టర్ల ఆదరణ చూరగొన్నాయి. నికరంగా రూ.20,000 కోట్లను ఆకర్షించాయి. సెప్టెంబర్‌లో వచ్చిన రూ.14,091 కోట్లతో పోలిస్తే 40 శాతానికి పైగా పెరిగాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నెలవారీగా వచ్చే పెట్టుబడులు రూ.16,928 కోట్ల మైలురాయిని చేరాయి. సిప్ రూపంలో ఒక నెలలో వచ్చిన గరిష్ట స్థాయి పెట్టుబడులు ఇవే కావడం గమనించొచ్చు. అక్టోబర్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గురువారం విడుదల చేసింది. అక్టోబర్ నెలలో నాలుగు కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు నిధుల సమీకరణ కోసం మార్కెట్లోకి రాగా, ఇవి రూ.2,996 కోట్లను సమీకరించాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.4,495 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. గత కొన్ని నెలలుగా స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తుండడం గమనించొచ్చు. థీమ్యాటిక్ ఫండ్స్ రూ. 3,896 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వరుసగా ఐదు నెలల పాటు పెట్టుబడులను కోల్పోయిన లార్జ్‌క్యాప్ పథకాల దశ మారింది. ఇవి నికరంగా రూ.724 కోట్లను రాబట్టాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి నికరంగా రూ.42,634 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో డెట్ విభాగం నుంచి నికరంగా రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లడం గమనార్హం. డెట్‌లో లిక్విడ్ ఫండ్స్ రూ.32,694 కోట్లను ఆకర్షించాయి. గిల్ట్ ఫండ్స్‌లోకి రూ.2,000 కోట్లు వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లోకి రూ.841 కోట్లు వచ్చాయి. అన్ని విభాగాల్లోకి కలిపి అక్టోబర్‌లో రూ.80,528 కోట్లు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్ చివరికి ఉన్న రూ. 46.58 లక్షల కోట్ల నుంచి రూ. 46.71 లక్షల కోట్లకు పెరిగాయి. -
దేశీ విమాన ప్రయాణాకిల్లో 10% వృద్ధి
న్యూఢిల్లీ: భారతీయ విమానయాన సంస్థలు అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. సెప్టెంబర్‌లో నమోదైన 1.04 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 27 శాతం ఎగిసి 89.85 లక్షల నుండి 1.14 కోట్లకు చేరింది. కరోనా మహమ్మారి కాలంలో దాదాపుగా నిల్చిపోయిన విమాన ప్రయాణాలు కొంతకాలంగా తిరిగి ప్రారంభమవుతుండటంతో .. విమానయాన పరిశ్రమ క్రమంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. డేటాలోని మరిన్ని కీలకాంశాలు.. ► దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో మార్కెట్ వాటా సెప్టెంబర్‌లో 58 శాతంగా ఉండగా అక్టోబర్‌లో 56.7 శాతానికి తగ్గింది. ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 0.9 శాతం నుండి 1.4 శాతానికి పెరిగింది. స్పైస్‌జెట్ వాటా 7.3 శాతంగా, గో ఫస్ట్ వాటా 7 శాతంగా ఉంది. ► ఎయిరిండియా మార్కెట్ వాటా 9.1 శాతంగా ఉండగా, ఎయిర్‌ఏషియాది 7.6 శాతానికి చేరింది. విస్తార వాటా 9.6 శాతం నుండి 9.2 శాతానికి దిగి తగ్గింది. ► సమయ పాలనలో (ఓటీపీ) ఎయిరిండియా (90.8 శాతం) అగ్రస్థానంలో ఉండగా విస్తారా (89.1 శాతం), ఎయిర్ఏషియా ఇండియా (89.1 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడూ టాటా గ్రూప్ కంపెనీలే కావడం గమనార్హం. ► ఇండిగో ఓటీపీ 87.5 శాతంగా ఉండగా, అలయన్స్ ఎయిర్ (74.5%), స్పైస్‌జెట్ (68.9%), గో ఫస్ట్ (60.7%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి ఓటీపీని లెక్కించారు. ► 2022 జనవరి–అక్టోబర్ మధ్య కాలంలో దేశీ విమానయాన సంస్థలు 9.88 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 6.21 కోట్లతో పోలిస్తే ఎయిర్ ట్రాఫిక్ 59 శాతం పెరిగింది. -
అక్టోబర్‌లో బ్యాంకు సెలవుల లిస్ట్.. ఏకంగా 21 రోజులు
సాక్షి, ముంబై: పండుగల సమీపిస్తున్న నేపథ్యంలో అక్టోబరు నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకులు పనిచేయవు. రెండు,నాలుగు శనివారాలు, ఆదివారాలు సహా మొత్తం 21 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబరు నెలలో బ్యాంకులకు సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులతో అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ప్రాంతీయ రాష్ట్రసెలవులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. సో కస్టమర్లు తమ సమీప బ్యాంకును సందర్శించే ముందు సెలవుల లిస్ట్‌ను చెక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 2022 నెలలో బ్యాంక్ సెలవుల లిస్ట్ అక్టోబరు 1, 2022- బ్యాంకు ఖాతాల అర్ధ వార్షిక ముగింపు (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 2, 2022- గాంధీ జయంతి, ఆదివారం అక్టోబర్ 3, 2022- దుర్గా పూజ (అగర్తలా, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ) అక్టోబర్ 4, 2022- దుర్గాపూజ/దసరా/ఆయుధ పూజ/శ్రీమంత శంకరదేవ (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్ , తిరువనంతపురం) అక్టోబర్ 5, 2022- దుర్గాపూజ/దసరా/శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం అక్టోబర్ 6, 2022- దుర్గాపూజ (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 7, 2022- దుర్గా పూజ (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 8, 2022- రెండో శనివారం. మిలాద్-ఉల్-నబీ (భోపాల్, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం) అక్టోబర్ 9, 2022- ఆదివారం అక్టోబర్ 13, 2022- కర్వా చౌత్ (సిమ్లా) అక్టోబర్ 14, 2022- ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ , శ్రీనగర్) అక్టోబర్ 16, 2022- ఆదివారం అక్టోబర్ 18, 2022- కటి బిహు (గౌహతి) అక్టోబర్ 22, 2022- నాల్గవ శనివారం అక్టోబర్ 23, 2022- ఆదివారం అక్టోబర్ 24, 2022- కాళీ పూజ/దీపావళి అక్టోబర్ 25, 2022- లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన్ పూజ (గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్) అక్టోబర్ 26, 2022- గోవర్ధన్ పూజ/భాయ్ దూజ్/దీపావళి/విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్టక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, సిమ్లా, శ్రీనగర్) అక్టోబర్ 27, 2022- భాయ్ దూజ్/లక్ష్మీ పూజ/దీపావళి (గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్ మరియు లక్నో) అక్టోబర్ 30, 2022- ఆదివారం అక్టోబర్ 31, 2022- సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు/సూర్య పష్టి దాలా ఛత్/ఛత్ పూజ (అహ్మదాబాద్, పాట్నా, రాంచీ) 21 రోజుల పాటు బ్యాంకులు మూతపడినా ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి కాబట్టి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ సెలవు రోజుల్లో కస్టమర్లు బ్యాంక్ నుండి డబ్బును భౌతికంగా డిపాజిట్ చేయలేరు లేదా విత్‌డ్రా చేయలేరు. కానీ ఇతర ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చు. -
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో నమోదైన యూపీఐ లావాదేవీలు!
UPI Records: దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) లావాదేవీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అక్టోబర్ నెలలో 4 బిలియన్లకు పైగా యుపీఐ లావాదేవీలు నమోదు అయ్యాయి. పండుగ సీజన్ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తెలిపింది. యుపీఐ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. విలువ పరంగా అక్టోబర్ నెలలో జరిగిన లావాదేవీల విలువ రూ.7.71 ట్రిలియన్లకు సమానం. సెప్టెంబర్ నెలలో రూ.6.5 ట్రిలియన్ విలువైన 3.65 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి. ప్రతి నెల యూపీఐ లావాదేవీల పరిమాణం 15 శాతం జంప్ అయితే, అక్టోబర్ నెలలో లావాదేవీల విలువ 18.5 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే ప్రతి సంవత్స రం లావాదేవీల పరిమాణం రెట్టింపు అవుతూ వస్తున్నాయి. 2016లో ప్రారంభించబడిన యూపీఐ అద్భుతమైన ప్రజాదరణ పొందింది. కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారి తర్వాత యూపీఐ వినియోగం భారీగా పెరిగింది. 2019 అక్టోబర్ నెలలో మొదటిసారి 1 బిలియన్ లావాదేవీలను యూపీఐ దాటింది. అక్టోబర్ 2020లో యూపీఐ మొదటిసారిగా 2 బిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది. ఆ తర్వాత 3 బిలియన్ల లావాదేవీలను చేరుకోవడానికి 10 నెలల సమయం మాత్రమే పట్టింది. ఇక నెలకు 3 బిలియన్ల నుంచి 4 బిలియన్ లావాదేవీలను చేరుకోవడానికి కేవలం 3 నెలలు మాత్రమే పట్టింది. (చదవండి: మార్క్ జుకర్‌బర్గ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఫ్రాన్సెస్ హౌగెన్!) -
అక్టోబర్‌లో ఎగుమతులు జూమ్
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు అక్టోబర్‌లో 42.33 శాతం పెరిగి 35.47 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతులు ఇదే నెల్లో 62.49 శాతం ఎగసి 55.37 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 19.90 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఒక అధికారిక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ఇంజనీరింగ్, పెట్రోలియం రంగాల నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ► మొత్తం ఎగుమతుల్లో 28.19 శాతం వాటా కలిగిన ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు అక్టోబర్‌లో 50.7 శాతం పెరిగి, 9.38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతులు 232 శాతం ఎగసి 5.19 బిలియన్ డాలర్లకు చేరాయి. ► సమీక్షా నెల్లో పసిడి దిగుమతులు దాదాపు రెట్టింపై 5.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో 44.24 శాతం పురోగతి నమోదయ్యింది. విలువలో 4.22 బిలియన్ డాలర్లకు చేరింది. ► మొత్తం ఎగుమతుల్లో 3.5 శాతం వాటా కలిగిన టెక్స్టైల్స్ పరిశ్రమ నుంచి 1.25 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. గత ఏడాది అక్టోబర్‌తో పోల్చితే ఇది 6.4 శాతం అధికం. ► ఎలక్ట్రానిక్ గూడ్స్ విలువ 966 మిలియన్ డాలర్ల నుంచి (2020 అక్టోబర్) 1.34 బిలియన్ డాలర్లకు చేరాయి. ► దిగుమతుల విషయానికి వస్తే, పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తులు 140.5 శాతం పెరిగి 14.43 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ 23% పెరిగి 6.81 బిలియన్ డాలర్లకు ఎగశాయి. మిషనరీ, ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్ విభాగం 42% పురోగతితో 3.54 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఎగుమతులు 55% పెరిగి 232.58 బిలియన్ డాలర్లుగా నమోదయితే, దిగుమతుల విలువ 79 శాతం పెరిగి 331.29 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య వాణిజ్యలోటు 98.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. సేవలు ఇలా... కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశం నుంచి సేవల ఎగుమతుల విలువ సెప్టెంబర్‌లో 22 శాతం ఎగసి 20.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 25 శాతం పెరిగి 12.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
అలర్ట్: అక్టోబర్‌లో ఎన్నిరోజులు బ్యాంక్ సెలవులో తెలుసా?
Bank Holidays October 2021: ఆర్బీఐ వచ్చే నెలలో దేశం మొత్తం 14 రోజులు బ్యాంక్ హాలిడేస్ ప్రకటించింది. వాటిలో రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 14 సెలవుల్ని ఆర్బీఐ ప్రకటించింది.అయితే దేశంలో ఆయా ప్రాంతాల వారీగా మొత్తం 21 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవులు ఇలా ఉన్నాయి. 1.అక్టోబర్ 1 - హాఫ్ ఎర్లీ క్లోజింగ్ బ్యాంక్ అకౌంట్స్ (గాంగ్టక్ సిక్కిం) 2. అక్టోబర్ 2 - మహత్మా గాంధీ జయంతి (అన్నీ రాష్ట్రాలకు ) 3. అక్టోబర్ 3- ఆదివారం 4. అక్టోబర్ 6 - మహాలయ అమావాస్యే (అగర్తలా, బెంగళూరు, కోల్‌కతా) 5) అక్టోబర్ 7 - లైనింగ్‌థౌ సనామహి (ఇంఫాల్) 6) అక్టోబర్ 9 - 2 వ శనివారం 7) అక్టోబర్ 10 - ఆదివారం 8) అక్టోబర్ 12 - దుర్గా పూజ (మహా సప్తమి) / (అగర్తలా, కోల్‌కతా) 9) అక్టోబర్ 13 - దుర్గా పూజ (మహా అష్టమి) / (అగర్తలా, భువనేశ్వర్, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ) 10) అక్టోబర్ 14 - దుర్గా పూజ / దసరా (మహా నవమి) / ఆయుధ పూజ (అగర్తల, బెంగళూరు, చెన్నై, గాంగ్టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, తిరువనంతపురం) 11) అక్టోబర్ 15 - దుర్గా పూజ / దసరా / దసరా (విజయ దశమి) / (ఇంఫాల్,సిమ్లాలో మినహా అన్ని బ్యాంకులు) 12) అక్టోబర్ 16 - దుర్గా పూజ (దాసైన్) / (గాంగ్టక్) 13) అక్టోబర్ 17 - ఆదివారం 14) అక్టోబర్ 18 - కాటి బిహు (గౌహతి) 15) అక్టోబర్ 19- మిలాద్ ఉన్ నబీ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు)/బరవఫత్/(అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి , లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, రాయపూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం) 16) అక్టోబర్ 20-మహర్షి వాల్మీకి పుట్టినరోజు/లక్ష్మీ పూజ/ఐడి-ఇ-మిలాద్ (అగర్తలా, బెంగళూరు, చండీగఢ్, కోల్‌కతా, సిమ్లా) 17) అక్టోబర్ 22-ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ, శ్రీనగర్) తరువాత శుక్రవారం 18) అక్టోబర్ 23 - 4 వ శనివారం 19) అక్టోబర్ 24 - ఆదివారం 20) అక్టోబర్ 26 - ప్రవేశ దినం (జమ్మూ, శ్రీనగర్) 21) అక్టోబర్ 31 - ఆదివారం -
అత్యధికంగా క్యాన్సర్ బారిన పడుతుంది వారే!
గ్రామీణ మహిళల కంటే పట్టణాల్లో ఉండే వారే అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు గురయ్యే వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే తొలి దశలో గుర్తిస్తుండగా, 70 శాతం మంది, 2, 3 దశల్లో ఆస్పత్రులకు వస్తున్నారు. మరో 20 శాతం మంది నాలుగో దశలో చికిత్సకోసం వస్తున్నారు. వ్యాధి లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు క్యాన్సర్ నిపుణులు చెబుతున్నారు. వ్యాధిపై విస్తృతమైన అవగాహన కలగించేందుకు అక్టోబర్ మాసాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. వీరికి వ్యాధి సోకే అవకాశం.. ►సాధారణంగా వయస్సు 40 ఏళ్లు దాటిన వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ►లేటు వయస్సులో బిడ్డలు పుట్టిన వారికి, పిల్లలు పుట్టాక పాలు ఇవ్వని వారికి ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ►కుటుంబంలో అంతకు ముందు ఎవరికైనా ఉన్నా, ఎక్కువ ఒత్తిళ్లకు గురయ్యే వారికి, పన్నెండేళ్లలోపు రజస్వల కావడం, నెలసరి ఆగడం, 55 ఏళ్ల వరకు నెలసరి ఉండటం వంటివి కారణాలుగా చెబుతున్నారు. ►ధూమపానం, ఆల్కాహాల్ సేవించే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ►ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావంతో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చు.. రొమ్ము క్యాన్సర్ ఎవరికి వారే గుర్తించవచ్చు. పీరియడ్ వచ్చిన వారం రోజుల తర్వాత స్నానం చేస్తున్న సమయంలో రొమ్ములో గింజంత సైజులో కణుతులు ఏమైనా వచ్చాయా, రొమ్ముపై చర్మం రంగు మారిందా, చంకల్లో గడ్డలు లాంటివి వచ్చాయా అనే విషయాలను మహిళలు చెక్ చేసుకోవాలి. రొమ్ము భాగంలో నొప్పిగా ఉన్నా, చిన్న చిన్న లక్షణాలు కనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. మమ్మోగ్రామ్‌తో నిర్ధారణ.. ►రొమ్ము క్యాన్సర్‌ను మమోగ్రామ్ అనే స్కానింగ్ ద్వారా నిర్ధారిస్తారు. ఇప్పుడు 3డీ మమ్మోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది. ►దీని ద్వారా వ్యాధి సూక్ష్మదశలో ఉన్నప్పుడే గుర్తించే అవకాశం ఉంది. ►రొమ్ము భాగంలో పౌడర్లా ఏదైనా చల్లినట్లు ఉన్నా కనిపెట్టేస్తుంది. ►ఏడాదికోసారి మమ్మోగ్రామ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ముందు చూపే మందు.. రొమ్ము క్యాన్సర్‌కు ముందు చూపే మందు. తొలిదశలోనే గుర్తించి వెంటనే ఆస్పత్రికి వెళ్తే అత్యాధునిక పరికరాలతో వ్యాధిని నిర్ధారించి చికిత్స పొందవచ్చు. సెల్ఫ్ చెక్ చేసుకునే విధానాలపై మహిళలకు అవగాహన ఉండాలి. రోజు వారీ వ్యాయామం చేస్తూ, బరువు పెరగకుండా చూసుకోవడం, కొవ్వు, నూనె ఉన్న పదార్థాలు తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఏవైరావు, క్యాన్సర్ వైద్య నిపుణుడు -
కార్ల విక్రయాలకు పండుగ కళ..
రికార్డ్ అమ్మకాలు సాధించిన మారుతీ, హ్యుందాయ్ న్యూఢిల్లీ: పండుగ కళతో అక్టోబర్ నెల వాహన విక్రయాలు కళకళలాడాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌లు తమ తమ కంపెనీల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలను గత నెలలో సాధించాయి. హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ విక్రయాలు జోరుగా సాగాయి. వివరాలు.., కొత్త మోడళ్లు, కొత్త వేరియంట్లతో మంచి అమ్మకాలు సాధించామని మారుతీ సుజుకీ తెలిపింది. పండుగ సీజన్ సందర్భంగా అమ్మకాలు బావుంటాయనే ఉద్దేశంతో తమ నెట్‌వర్క్‌ను సిద్ధం చేశామని, తమ కంపెనీ చరిత్రలోనే అత్యధిక దేశీయ అమ్మకాలు సాధించామని కంపెనీ ఈడీ(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. అక్టోబర్‌లో అత్యధిక దేశీయ అమ్మకాలు సాధించామని హ్యుందాయ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. గ్రాండ్ ఐ10 కూడా రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించిందని వివరించారు. వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడిందని, రానున్న నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రీమియం బ్రాండ్స్ క్రెటా, ఇలీట్ ఐ20/యాక్టివ్ కార్లకు మంచి స్పందన లభిస్తోందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక అమ్మకాలను గత నెలలో సాధించామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన టీయూవీ300 ఎస్‌యూవీకి మంచి స్పందన లభిస్తోందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా తెలిపారు. వడ్డీరేట్లు తగ్గడం, ఇంధన ధరలు కూడా తక్కువ స్థాయిల్లోనే కొనసాగడం కలసివచ్చాయని వివరించారు.రానున్న నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.