![UPI Registers Over USD 100 Billion Transactions By Value In October - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/2/upi%20pAYMENTS.jpg.webp?itok=03zUmy-l)
UPI Records: దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) లావాదేవీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అక్టోబర్ నెలలో 4 బిలియన్లకు పైగా యుపీఐ లావాదేవీలు నమోదు అయ్యాయి. పండుగ సీజన్ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) తెలిపింది. యుపీఐ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. విలువ పరంగా అక్టోబర్ నెలలో జరిగిన లావాదేవీల విలువ రూ.7.71 ట్రిలియన్లకు సమానం. సెప్టెంబర్ నెలలో రూ.6.5 ట్రిలియన్ విలువైన 3.65 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి.
ప్రతి నెల యూపీఐ లావాదేవీల పరిమాణం 15 శాతం జంప్ అయితే, అక్టోబర్ నెలలో లావాదేవీల విలువ 18.5 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే ప్రతి సంవత్స రం లావాదేవీల పరిమాణం రెట్టింపు అవుతూ వస్తున్నాయి. 2016లో ప్రారంభించబడిన యూపీఐ అద్భుతమైన ప్రజాదరణ పొందింది. కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారి తర్వాత యూపీఐ వినియోగం భారీగా పెరిగింది. 2019 అక్టోబర్ నెలలో మొదటిసారి 1 బిలియన్ లావాదేవీలను యూపీఐ దాటింది. అక్టోబర్ 2020లో యూపీఐ మొదటిసారిగా 2 బిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది. ఆ తర్వాత 3 బిలియన్ల లావాదేవీలను చేరుకోవడానికి 10 నెలల సమయం మాత్రమే పట్టింది. ఇక నెలకు 3 బిలియన్ల నుంచి 4 బిలియన్ లావాదేవీలను చేరుకోవడానికి కేవలం 3 నెలలు మాత్రమే పట్టింది.
(చదవండి: మార్క్ జుకర్‌బర్గ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఫ్రాన్సెస్ హౌగెన్!)
Comments
Please login to add a commentAdd a comment