సెప్టెంబర్ నెల ముగింపునకు వచ్చేసింది. కొత్త నెల త్వరలో ప్రారంభం కానుంది. రానున్న అక్టోబర్ నెలలో పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు చాలా రోజులు సెలవులు ఉండబోతున్నాయి. శారదీయ నవరాత్రి నుండి దసరా, దీపావళి వరకు సెలవుల కారణంగా బ్యాంకులు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు.
బ్యాంకులు ప్రతిఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని మీద బ్యాంకులకు వెళ్లాల్సిన వస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో బ్యాంకుల్లో పని ఉన్నవారు సెలవులకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే నెలలో ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయి.. ఏయే రోజుల్లో బ్యాంకులు మూసిఉంటాయి అన్న సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం..
సెలవుల జాబితా ఇదే..
» అక్టోబర్ 1- అసెంబ్లీ ఎన్నికల కారణంగా జమ్మూలో బ్యాంకుల మూత
» అక్టోబర్ 2- గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు
» అక్టోబర్ 3 - నవరాత్రి స్థాపన కారణంగా జైపూర్‌లో సెలవు
» అక్టోబర్ 6- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు.
» అక్టోబర్ 10- దుర్గాపూజ, దసరా, మహాసప్తమి కారణంగా త్రిపుర, అస్సాం, నాగాలాండ్, పశ్చమ బెంగాల్‌లో బ్యాంకుల మూత
» అక్టోబర్ 11- దసరా, మహా అష్టమి, మహానవమి, ఆయుధ పూజ, దుర్గా అష్టమి, దుర్గాపూజ కారణంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలో సెలవు
» అక్టోబర్ 12- దసరా, విజయదశమి, దుర్గాపూజ కారణంగా దాదాపు దేశవ్యాప్తంగా సెలవు
» అక్టోబర్ 13- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల మూత
» అక్టోబర్ 14- దుర్గాపూజ లేదా దాసైన్ కారణంగా గాంగ్‌టక్‌లో సెలవు
» అక్టోబర్ 16- లక్ష్మీ పూజ సందర్భంగా అగర్తల, కోల్‌కతాలో బ్యాంకుల మూత
» అక్టోబర్ 17- మహర్షి వాల్మీకి జయంతి, కాంతి బిహు సందర్భంగా బెంగళూరు, గౌహతిలో సెలవు
» అక్టోబర్ 20- ఆదివారం దేశవ్యాప్తంగా హాలిడే
» అక్టోబర్ 26- నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు
» అక్టోబర్ 27- ఆదివారం దేశవ్యాప్త హాలిడే
» అక్టోబర్ 31- దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు
అక్టోబర్‌లో పండుగల సీజన్ కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆయా రోజుల్లో పని చేయవు. బ్యాంకులు అందుబాటులో లేనప్పటికీ చాలా పనులను ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment