సాక్షి, బెంగళూరు: ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రకంపనలుకొనసాగుతుండగానే బెంగళూరు నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా జర్మనీ సాఫ్ట్‌వేర్ గ్రూప్ కుచెందిన భారత సంస్థ ‘సాప్’ ఉద్యోగులకు ప్రాణాంతక స్వైన్ ఫ్లూ కారక హెచ్1ఎన్1 వైరస్ సోకడంతో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా తన కార్యాలయాలన్ని మూసివేయడంతో పాటు, ఉద్యోగులకు ఇంటినుంచే సదుపాయాన్ని కల్పించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, హెచ్1ఎన్1 లక్షణాలలో జ్వరం, చలి, గొంతు నొప్పిలాంటివి సాధారణ జలుబు లక్షణాలుగా పైకి కనిపించినప్పటికీ, ఈ వైరల్ న్యుమోనియా ఆరోగ్యకరమైన యువకులను కబళించే తీవ్రత ఉన్న కారణంగా ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.బెంగళూరులో సాప్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు హెచ్1ఎన్1 వైరస్ ఫలితం పాజిటివ్ వచ్చింది. దీంతో శానిటైజేషన్ కోసం భారత్‌లోని తన కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సాప్ ప్రకటించింది. బెంగళూరు, గుర్గావ్, ముంబై ఆఫీసులలో సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపింది. అలాగే తదుపరి నోటీసు వచ్చేంతవరకు తమ ఉద్యోగులందరూ ఇంటి నుండే పని చేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment