కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని ప్రభావంతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకూ సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే నటీనటులకు కరోనా ప్రభావంతో కాస్త విరామం దొరికింది. దీంతో ఇంటి పట్టునే ఉండి తమకు ఇష్టమైన పని చేస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇంట్లో ఉండి తన సృజనాత్మకతను బయపెట్టారు. సల్మాన్‌కి బొమ్మలు గీయడం వచ్చు. ఓ బొమ్మ గీస్తూ, ఆ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు సల్మాన్. డ్రాయింగ్ ప్యాడ్, స్కెచ్‌లు, వాటర్ కలర్స్‌తో కాలక్షేపం చేశారు. కేవలం రెండు నిమిషాల్లోనే చక్కని బొమ్మ వేశారట. ఆ బొమ్మలో ఇద్దరు వ్యక్తుల తలలు, ముఖాలు పాక్షికంగా కప్పబడి ఉన్నాయి. వారి కళ్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ స్కెచ్ చూసిన ఆయన అభిమానులు ‘వావ్.. భాయ్’ అని అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment