
ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌ల మూసివేత!
పెట్రోల్ బంక్‌ల బంద్ కార్యక్రమం చేపట్టాలని ఏపీ పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ నిర్ణయించింది
గుంటూరు: ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరోసారి పెట్రోల్ బంక్‌ల బంద్ కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ నిర్ణయించింది. శనివారం గుంటూరులో సమావేశమైన అసోసియేషన్ సభ్యులు.. అక్టోబర్ 19, 26 తేదీల్లో సాయంత్రంపూట, నవంబర్ 6న పూర్తిగా పెట్రోల్ బంక్‌లు మూసివేయాలని నిర్ణయించారు. అలాగే.. నెలలో ప్రతి ఆదివారంతో పాటు 2, 4వ శనివారాలు కూడా పెట్రోల్ బంకులు మూసేయాలని సమావేశంలో తీర్మానం చేశారు.