ముంబై: ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు వారాంతంలో స్వల్ప నష్టాలతో ముగిసాయి. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 53 పాయింట్లు క్షీణించి 28,077 వద్ద నిఫ్టీ 6 పాయింట్లు తగ్గి 8,693 వద్ద స్థిరపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టార్ లాభాల మద్దుతుతో నష్టాలనుంచి కోలుకున్నాయి. అలాగే ఐటీ, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ స్వల్పంగా లాభపడ్డాయి. మెటల్స్ సూచీ నీరసించింది. సెప్టెంబర్ క్వార్టర్ లో లాభాలను ఆర్జింఇన రిలయన్స్ ఇండస్ట్రీస్ , 2.5శాతం నష్టాలతో ముగిసింది. యాక్సిస్, హెచ్ డీ ఎఫ్ సీ తీవ్ర అమ్మకాల ఒత్తడిని ఎదుర్కొన్నాయి. హిందాల్కో, అంబుజా, ఏసీసీ, సిప్లా, పవర్‌గ్రిడ్, గ్రాసిమ్, ఇన్‌ఫ్రాటెల్ నష్టపోగా, ఐడియా, టెక్‌మహీంద్రా, టాటా పవర్, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్‌ఇండ్, టీసీఎస్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ లాభపడ్డాయి.
అటు డాలర్ బలహీనత నేపథ్యంలో రూపాయి ఉదయం నష్టాలనుంచి కొద్దిగా కోలుకుంది. ప్రస్తుతతం 0.05 పైసల నష్టంతో 66.86 వద్ద ఉంది. కాగా పసిడి మరింత దిగి వస్తున్నట్టు కనిపిస్తోంది. పది గ్రా పుత్తడి ఎంసీఎక్స్ మార్కెట్ లో 33 రూపాయలు క్షీణించి రూ. 29,877 వద్ద ఉంది.
స్పల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
Published Fri, Oct 21 2016 4:30 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
Advertisement
Advertisement