ముంబై: దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ చెప్పిన సెన్సెక్స్ 111 నష్టంతో, నిఫ్టీ 33 నష్టంతో ముగిశాయి. 8800 మద్దతు స్థాయి కిందికి దిగజారిన నిఫ్టీ8775 వద్ద ముగిసింది. ప్రధానంగా రియల్టీ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. డీఎల్ ఎఫ్, ఇండియా బుల్స్ , హెచ్ డీఎల్ సూచీలు పతన మయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో కొనుగోళ్ల ఒత్తిడి నెలకొంది. ఒన్ జీసీ, కాస్ర్టోల్ ఇండియా లాభపడగా, భారతి ఇన్ ఫ్రా టెల్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఎస్ బ్యాంక్, టాటా స్టీల్, హిందాల్కో, సిప్లా,మారుతి సుజుకి ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను ఆర్జించగా, భారతి ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
అటు డాలర్ తోపోలిస్తే రూపాయి విలువ మరింత బలహీన పడింది. 0.05 పైసల నష్టంతో 67.02 దగ్గరుంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పదిగ్రాముల పసిడి ధర 57 రూపాయల లాభంతో 30,960 వద్ద ఉంది.