పర్మిషన్‌ లేని పాఠశాల మూసివేత | not permited school closurd | Sakshi
Sakshi News home page

పర్మిషన్‌ లేని పాఠశాల మూసివేత

Published Tue, Jul 11 2017 12:00 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

not permited school closurd

పెద్దకడబూరు : మండల పరిధిలోని కంబలదిన్నెలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బీఎన్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలను విద్యాశాఖాధికారులు సోమవారం మూసివేశారు. నెలరోజులుగా అనుమతి లేకుండా స్కూలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సోమవారం ధర్నా చేయడంతో  మేలుకున్న ఎంఈఓ ఖాజామోహిద్దీన్‌ పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డుల కోసం ఆరా తీయగా సిబ్బంది తెలియదని చెప్పడంతో మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులను బయటకు పంపి తాళం వేశారు. ఈ కారణంగా స్కూల్లో చేరిన 124 మంది విద్యార్థులు అయోమయంలో పడ్డారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement