Tollywood Movies Shooting Close From August 1: ఆగస్టు 1నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ నిలిపివేయాలని సినీ అగ్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అవసరమైతే రెండు, మూడు నెలలు చిత్రీకరణ బంద్ చేద్దామని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయాలతో గతకొద్దిరోజులుగా నిర్మాతలందరూ ఈ వ్యవహారంపై చర్చిస్తున్నారు. మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంపైనా నిర్మాతలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ సినిమా చిత్రీకరణ నిలిపివేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రధానంగా కొవిడ్ తర్వాత థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్ సంఖ్య భారీగా తగ్గింది. దీంతో టాలీవుడ్ భారీ నష్టాలను చవిచూసింది. వేసవిలో పెద్ద సినిమాలు సందడి చేయడంతో కాస్త కోలుకున్నట్లు అనిపించినా, తాజాగా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు నుంచి కొద్ది రోజులపాటు షూటింగ్‌లు ఆపేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చివరి దశ షూటింగ్ ఉన్న చిత్రాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, ఆగస్టు 1 నుంచి అన్ని సినిమాల చిత్రీకరణను నిలిపివేయాలని చూస్తున్నారు. నిర్మాణ వ్యయం, ఓటీటీలు తదితర సమస్యలపై చర్చించిన తర్వాతే షూటింగ్‌లకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
చదవండి: బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. వీడియో వైరల్
స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్
ఈ విషయంపై త్వరలోనే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓటీటీలో రిలీజయ్యే సినిమాల విషయంలో సైతం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. జులై 1 నుంచి 50 రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు 10 వారాలకు పొడిగించాలని భావిస్తున్నారట. ఈ విషయాలన్నింటిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
ఆయన మాకు గురువులాంటివారు: పూజా హెగ్డే
Comments
Please login to add a commentAdd a comment