డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజవుతోన్న ఇన్‌స్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఎప్పటినుంచంటే? | The Latest Thriller Movie Rape D Directly Released In OTT From This Date | Sakshi
Sakshi News home page

నేరుగా ఓటీటీకి టాలీవుడ్ క్ర‍్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Mon, Aug 12 2024 6:55 AM | Last Updated on Mon, Aug 12 2024 8:34 AM

The Latest Thriller Movie Rape D Directly Released In OTT From This Date

విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన లేటేస్ట్‌ క్రైమ్ థ్రిల్లర్‌ మూవీ 'రేప్ డీ'. ఈ మూవీకి రవి శర్మ దర్శకత్వం వహించారు. టాలెంట్ కెఫె ప్రొడక్షన్ బ్యానర్‌పై దేవీ మేరేటీ నిర్మించారు. సాధ్వి, ప్రణవి సమర్పణలో వైవీ రమణ మూర్తి, యశ్వంత్ తోట సహ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రానికి.. వికాస్ కురిమెల్ల సంగీతాన్ని సమకూర్చారు.

ఈ చిత్రాన్ని పూర్తిగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్‌లో తెరకెక్కించారు. ఈ మూవీని నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఆగస్ట్ 10 నుంచే రెంటల్ విధానంలో బీసీఐనీట్‌ (BCI neet) అనే యాప్‌లో అందుబాటులో ఉంది.  అయితే ఈ చిత్రం ఆగస్ట్ 24 నుంచి మరో ఓటీటీ సంస్థలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఏ ఓటీటీ అనేది మాత్రం వివరాలు తెలియరాలేదు. ఈ మూవీలో వంశీ ఆలూర్, నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, అమిక్ష పవార్, వశిష్ట చౌదరి, కిరిటీ దామరాజు, అనుపమ స్వాతి కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement