ప్రతివారం థియేటర్లతో పాటు కొత్త చిత్రాలు సందడి చేస్తూంటాయి. అలాగే ఈ వారం కూడా ఓటీటీలో చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల థియేటర్లలో అలరించిన చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ వారం ఓటీటీ ప్రియులను కనువిందు చేసేందుకు సిద్ధమైన చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం: అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహింటారు. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
భయపెడుతున్న మసూద: ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'మసూద'. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మసూద బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీలో సందడి చేస్తున్న థ్యాంక్ గాడ్: సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం'థ్యాంక్ గాడ్'. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఫాంటసీ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈనెల 20 నుంచే అమెజాన్‌ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
మలయాళ హిట్ మూవీ: బసిల్ జోసెఫ్, దర్శనా రాజేంద్రన్, అజు వర్గీస్ నటించిన చిత్రం జయ జయ జయ జయహే . సంగీతం అంకిత్ మేనన్ ఈ చిత్రానికి సంగీతమందించారు. విపిన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈసినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రజానీకం కష్టాలు తెలిపేలా!
ఉచితంగా 'రామ్ సేతు': అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్ అండ్ టాలెంట్ హీరో సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిసెంబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. అయితే ఈ సినిమాను ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment