
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో దర్శనాలను ఆగస్టు 23 వరకు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో త్రినాథరావు తెలిపారు. ఇటీవల దేవస్థానం సిబ్బందిలో 650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఈ నెల 9 నుంచి 14 వరకు ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. ఈ నెల 11న మరో 250 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. రెండ్రోజుల్లో మరో 200 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 23 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. వ్రతాలు, కల్యాణం, చండీ, ఆయుష్య హోమాలు, త్రికాల పూజలన్నీ ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఈ వో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment