- ఐదు నుంచి 11వ తేదీ వరకూ సత్తెన్న కల్యాణ మహోత్సవాలు
- వైశాఖ ఏకాదశి, ఆరో తేదీ రాత్రి 9:30కి దివ్య కల్యాణం
శ్రీకారం చుట్టుకుంది.. పెళ్లి ఉత్సవం..
Published Mon, May 1 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM
అన్నవరం :
సత్యదేవుని వార్షిక కల్యాణ వేడుకలకు పెళ్లిపుస్తకం(శుభలేఖ) శ్రీకారం చుట్టింది. ప్రతీసారి వీఐపీలకు, ఇతర ముఖ్యులకు పంపిణీ చేసే శుభలేఖ రంగుల పుస్తకంలా ఉండేది. అయితే ఈసారి ఆ పుస్తకానికి బదులు డిజిటల్ ప్రింటింగ్‌లో ఆకర్షణీయంగా శుభలేఖ ముద్రించారు. వైశాఖ శుద్ధ దశమి ఈనెల ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకూ స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి ఆరో తేదీ రాత్రి 9:30 గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లకు రత్నగిరి కల్యాణ వేదికపై దివ్యకల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరగనుంది.ఇప్పటికే ఈ శుభలేఖలను ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు దేవస్థానం చైర్మ¯ŒS ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు స్వయంగా అందజేశారు. ఊరూవాడా పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు.
ఏడు రోజుల వేడుక...
సత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలను ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం బడ్జెట్‌లో రూ.40 లక్షలు కేటాయించారు. విద్యుత్ దీపాలంకరణ, ఇతర పనులకు అదనంగా మరో రూ.పది లక్షల వరకూ ఖర్చు చేసే వీలుంది.
కల్యాణమహోత్సవాలు షెడ్యూల్
l మే 5, వైశాఖ శుద్ధ దశమి : స్వామి, అమ్మవార్లను వధూవరులు చేసే కార్యక్రమం
l మే 6, వైశాఖ శుద్ధ ఏకాదశి : శ్రీసత్యదేవుని దివ్య కల్యాణమహోత్సవం. రాత్రి 9 : 30 గంటల నుంచి రత్నగిరిపై వార్షిక కల్యాణవేదిక మీద సత్యదేవుడు, అమ్మవార్లకు దివ్యకల్యాణ మహోత్సవం.
l మే 7, వైశాఖ శుద్ధ ద్వాదశి : నవదంపతులకు అరుంధతీ నక్షత్ర దర్శనం, రావణబ్రహ్మ వాహనంమీద స్వామివారి ఊరేగింపు
l మే 8, వైశాఖ శుద్ధ త్రయోదశి: వేదపండిత సదస్యం
l మే 9, వైశాఖ శుద్ధ చతుర్దశి: వనవిహారోత్సవం, వెండి రథోత్సవం
l మే 10, వైశాఖ పౌర్ణిమ: ఉదయం, శ్రీచక్రస్నానం, మధ్యాహ్నం గౌరీపూజ, నాకబలి, దండియాడింపు.
l మే11, వైశాఖ బహళ పాడ్యమి. శ్రీపుష్పయాగ మహోత్సవం
Advertisement