హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్ లైఫ్ బ్రాంచ్ మూసివేత | HDFC life branch closed in tenali | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్ లైఫ్ బ్రాంచ్ మూసివేత

Published Thu, May 12 2016 8:06 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

HDFC life branch closed in tenali

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ శాఖ మూతపడింది. ఇక్కడి గంగానమ్మపేటలోని ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కార్యాలయం రెండు మూడు రోజులుగా తీయడం లేదని పాలసీదారులు పలువురు తెలిపారు. దీనిపై పాలసీదారులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తెలిసింది. పట్టణంతోపాటు సమీప ప్రాంతాల ప్రజల బీమా అవసరాల కోసం 2008లో ఇక్కడ సంస్థ శాఖను ఆరంభించారు. హెచ్‌డీఎఫ్‌సీ సంస్థకు గల బ్రాండ్ విలువ, స్థానికంగా అందుబాటులో ఉంటుందన్న ఆలోచనతో పాలసీదారులు ఆదరించారు. ఏడేళ్లు కార్యకలాపాలు సాగించిన తర్వాత మూసివేయడంతో పాలసీదారుల్లో అయోమయం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement