ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభాలతో ఆకట్టుకుని 200 పాయింట్లకు పైగా ఎగిసినా చివరికి సెన్సెక్స్ సెన్సెక్స్ 145 పాయింట్ల లాభాలకు, నిఫ్టీ 40 పాయింట్ల లాభాలకు సరిపెట్టుకుంది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ ఎంసీజీ , ఫార్మా సెక్టార్ ల బలహీనత మార్కెట్ ను ప్రభావితం చేసింది. మరోవైపు భారీ ఎత్తున ఏటీఎం కార్డుల సమాచారం లీక్ అయిన వివాదం కొనసాగుతున్నప్పటికీ బ్యాంకింగ్ సెక్టార్ లాభాలను ఆర్జించింది. అటు ప్రయివేట్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ క్యూ2 మెరుగైన ఫలితాలను ప్రకటించాయి. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, ఎస్ బీఐ, ఎల్ అండ్ టీ, టాప్ గెయినర్స్ గా , లుపిన్, హిందుస్తాన్ యూనీ లీ వర్, టాటా మోటార్స్, సన్ ఫార్మ, టాఇన్ఫోసిస్, ఐటీసీ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
అటు రూపాయి 10 పైసల నష్టంతో66.78 వద్ద వుంది. పసిడి ఎంసీఎక్స్ మార్కెట్ లో 57 రూపాయల లాభంతో రూ.29,958 వద్ద ఉంది.