CM Arvind Kejriwal
-
సెంట్రల్ ఢిల్లీలో 144 సెక్షన్ విధింపు
-
సీబీఐ వందసార్లు పిలిచినా వెళ్లి సమాధానం ఇస్తా: కేజ్రీవాల్
-
సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తాం : సీఎం కేజ్రీవల్ ట్వీట్
-
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్
-
కరోనా : స్కూళ్లు, కాలేజీలు, సినిమాలు అన్నీ బంద్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 (కరోనా వైరస్) భయాందోళన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు సినిమాహాళ్లను మూసివేయాలని ఆదేశించింది. అలాగే పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలను కూడా మార్చి 31 వరకు మూసి వేసేందుకు నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రకటన జారీ చేశారు. ప్రధానంగా జన సమూహాలను నిలువరించే చర్యల్లో భాగంగా తాజా ఆదేశాలిచ్చింది. మరోవైపు కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య గురువారం నాటికి 73 కి చేరింది. కేరళలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. Delhi Chief Minister Arvind Kejriwal: All cinema halls to remain shut in Delhi till 31st March. Schools and colleges where exams are not being held will also remain closed. #CoronaVirus pic.twitter.com/pbuB1JNFnW — ANI (@ANI) March 12, 2020 -
మాట వినని అధికారులపై ‘ధిక్కారం’
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్ వేసే యోచనలో ఆప్ నాయకత్వం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అధికారాల పరిధిని పేర్కొంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం.. అధికారుల నియామకాలు, బదిలీలు చేసే అధికారాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అప్పగించింది. అయితే సేవల విభాగం (సర్వీసెస్ డిపార్ట్మెంట్) దీన్ని వ్యతిరేకిస్తోంది. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలు చేసే అధికారం కేంద్ర హోం శాఖకు అప్పగిస్తూ 2016లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేయలేదని చెబుతోంది. దీనిపై ఆప్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేయాలని యోచి స్తోంది. దీనిలో భాగంగా కోర్టు ధిక్కార పిటిషన్ వేయనున్నట్టు ఆప్ అధికార ప్రతినిధి చెప్పారు. అధికారులు సహకరించాలి: కేజ్రీవాల్ న్యాయస్థానం తీర్పును గౌరవించి, ఢిల్లీ అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విజ్ఞప్తి చేశారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం సలహాలు, సూచనల ఆధారంగా ఎల్జీ నడుచు కోవాలని, శాంతిభద్రతలు, పోలీస్, భూవ్యవ హారాలు తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొందని.. దీన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు తమకు సహకరించాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామని అధికారులకు ఆయన ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. ‘ఢిల్లీ అభివృద్ధి కోసం అధికారులు, నాయకులు.. అందరూ కలసి కట్టుగా కృషి చేద్దామని కోరుతున్నాను. ఎల్జీని కూడా కలిసేందుకు సమయం తీసుకోనున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎం సిసోడియా మీడియాతో మాట్లాడుతూ సర్వీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఆదేశాలు పాటించదని చీఫ్ సెక్రటరీ లిఖితపూ ర్వకంగా తెలిపారన్నారు. వారు తమ ఆదేశాలు పాటించ కున్నా, బదిలీ ఫైళ్లు ఇప్పటికీ ఎల్జీకే పంపినా అది కోర్టు ధిక్కారం కిందకి వస్తుంద న్నారు. ఏం చేయాలనే విషయమై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నామన్నారు. ఆప్ వాదన తప్పు: జైట్లీ కేంద్రపాలిత ప్రాంత అధికారులపై పాలనాధికారాలు సుప్రీంకోర్టు తమకే ఇచ్చిందని ఆప్ ప్రభుత్వం వాదించడం పూర్తిగా తప్పని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఐఏఎస్ అధికారులు, దర్యాప్తు బృందాల నియామకం వంటి అంశాల్లో ఢిల్లీ సర్కార్‌కు అధికారాలు లేవని జైట్లీ ఫేస్బుక్ బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమని, పోలీస్, శాంతిభద్రతలు, భూవ్యవహారాలు వంటి అంశాలపై కేంద్రానికే అజమాయిషీ ఉంటుందని, అధికారుల నియామకం, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం లేదన్నారు. ఢిల్లీ రాష్ట్రం కానందున, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే అధికారాలన్నీ ఎన్నికైన కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వానికి ఉంటాయనే వాదన అర్థరహితమని జైట్లీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వానికి పోలీస్ అధికారాలు లేనందున రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను విచారణ నిమిత్తం నియమించలేదని జైట్లీ వివరించారు. -
ఇళ్లు, ఆఫీసుల్లో ధర్నాలేంటి?
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ అధికారంతో ఆప్ ప్రభుత్వం ఈ ధర్నా చేపట్టిందని ప్రశ్నించింది. ధర్నాను ఆపడంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వనప్పటికీ.. ఇతరుల ఇళ్లు, కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం సరికాదని మండిపడింది. కేజ్రీవాల్ నిరసన, ఢిల్లీ ప్రభుత్వంపై ఐఏఎస్‌లు సమ్మె చేయడంపై దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ ఏకే చావ్లా, జస్టిస్ నవీన్ చావ్లాల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ధర్నా చేసే అధికారం ఎవరిచ్చారు. ఎల్జీ కార్యాలయంలో బైఠాయిస్తారా? ఇది ధర్నా అయితే.. కార్యాలయం బయట చేసుకోండి. ఒకరి కార్యాలయం, నివాసంలో ధర్నా చేసే అధికారం మీకు లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం విచారణను జూన్ 22కు వాయిదా వేసింది. ఐఏఎస్ అధికారులు విధుల్లో చేరేలా ఆదేశించడంతోపాటు.. పనులను అడ్డుకుంటున్న వారిపై ఎల్జీ అనిల్ బైజాల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 11 నుంచి ఎల్జీ కార్యాలయంలో కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. నిరసన రాజ్యాంగ హక్కు! ఢిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సుధీర్ నంద్రాజోగ్ వాదిస్తూ.. సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల హోదాలో కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్‌లు నిరసన చేపట్టారన్నారు. ఇది రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. విధులకు దూరంగా ఉంటున్న ఐఏఎస్ అధికారులు రోజూవారి మంత్రుల సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే, ఐఏఎస్ అధికారులు సమ్మె చేయడం లేదని.. కేజ్రీవాల్, అతని మంత్రులు వెంటనే ఎల్జీ కార్యాలయాన్ని ఖాళీ చేసేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వ విపక్ష నేత విజేందర్ గుప్తా కూడా కేజ్రీవాల్ తీరును నిరసిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఈ వివాదంలో జోక్యం చేసుకుని ఐఏఎస్‌లు తిరిగి విధులకు వచ్చేలా ఎల్జీని ఆదేశించాలని ఆయన కోరారు. అలాగైతే చర్చలకు ఓకే.. అధికారులకు రక్షణ కల్పిస్తామంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారులు స్వాగతించారు. ఈ విషయంపై సీఎంతో చర్చించేందుకు సిద్ధమేనని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ రక్షణ, గౌరవాన్ని కాపాడే అంశాలపై నిర్దిష్టమైన చర్యలుంటాయని ఆశిస్తున్నామన్నారు. ఇంతకుముందు లాగే చిత్తశుద్ధితో పనిచేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై ఆప్ ఎమ్మెల్యే ఒకరు సీఎం సమక్షంలోనే దాడికి దిగిన నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు విధులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఆప్ పార్టీ కూడా భద్రతపై సీఎం భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు విధులకు హాజరు కావాలని కోరింది. ఆసుపత్రికి సిసోడియా కేజ్రీకి మద్దతుగా జూన్ 13 నుంచి నిరాహార దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అస్వస్థతకు గురవడంతో ఆయనను ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని కేజ్రీ ట్విట్టర్లో వెల్లడించారు. అనంతరం సిసోడియా ట్వీట్ చేస్తూ.. ‘మా అధికారులతో చర్చలు జరిపేందుకు సంతోషంగా అంగీకరిస్తున్నాం. వీరికి సరైన భద్రత కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఈ బాధ్యత ఎల్జీ చేతుల్లో ఉంది’ అని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ధర్నా చేస్తున్న మంత్రి సత్యేంద్ర జైన్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిసోడియా, జైన్ల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు కేజ్రీవాల్ ఫోన్ చేశారు. దీనిపై ఉద్ధవ్ స్పందిస్తూ.. ‘ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని పనిచేసుకునే పరిస్థితి కల్పించాలి. ప్రతి అడుగులో అడ్డంకిగా మారొద్దు’ అని కేంద్రాన్ని ఉద్దేశించి విమర్శించారు. -
వెర్రి చేష్టలే పరిష్కారాలా?
ఢిల్లీ వాయు కాలుష్యం సమస్యకు పరిష్కారాలు లేకపోలేదు. కాకపోతే, ఇంతవరకు అందరు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయని గుర్తించాలి. ఉదాహరణకు, ఈ సమస్యతో సంబంధం ఉన్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయమని ప్రధానిని కోరండి. వరి గడ్డి చెత్తను కాలబెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని చెల్లించడా నికి డీజెల్ పైన, ట్రక్కులపైన వసూలు చేస్తున్న వందల కోట్ల సెస్‌లో కొంత భాగాన్ని మళ్లించవచ్చు. అంతేగానీ ఢిల్లీ కాలుష్యపు పొగలను తమాషాలతో పరిష్కారం చేయలేరు. మాకు టెడ్డీ అనే లాసా జాతి టిబెటన్ బొచ్చు కుక్క ఉండేది. అదెన్నడూ ఆహారం కోసం వెతుక్కునేది కాదు. అలమారా దిగువ అరల్లోని పుస్తకాలకు తప్ప మరెవరికీ హాని చేసేది కాదు. ఒకరోజు సాయంత్రం ఓ ఎలుక దారి తప్పి మా వంట గదిలోకి చొరబడింది. అది చూసిన వెంటనే టెడ్డీ దాని వెంట పడింది. బెంబేలెత్తిపోయిన ఎలుక వంటగ్యాస్ సిలిండర్‌కు వెనుక ఇరుక్కు పోయింది. మొట్టమొదటిసారిగా తను వేటాడిన జంతువును మా టెడ్డీ కొద్ది సేపు పట్టుకుని చూసింది. ఆ తర్వాత దాన్ని అది వదిలిపెట్టేసింది. భయంతో ఎలుక పరుగు తీసింది. అది దానికి అవమానకరం అని మాకు అనిపించింది. మొదట్లో మా అతిథులకు వినోదం కల్పించడం కోసం మేం ‘ఎలుక’ అని అరిస్తే చాలు... మా ‘వేటగాడు’ పరుగందుకుని తక్షణమే గ్యాస్ సిలిండర్ వెనక్కు వెళ్లేవాడు. ఆ తర్వాత క్రమంగా అది ఓ కథగా మాత్రమే మిగిలి పోయింది. ఎప్పుడు ఎవరు అలాంటి మూర్ఖపు, అమాయకపు స్వాభావిక స్పందనలను కనబర చినా మేం ఇప్పుడు... ఒకసారి ఎలుక కనిపించిందని అక్కడే ప్రతిసారీ వెతక్కు అంటుంటాం. ఆత్మవంచన, పరవంచనే పరిష్కారమా? ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, సరి–బేసి పథకాన్ని మన మీద రుద్ది, మొట్టమొద టిసారిగా వంటింటి ఎలుకను పట్టడానికి కృషి చేసింది. అందులో సైతం అది విజయవంతం కాలేకపోయింది. ఈ పద్ధతి వల్ల ఢిల్లీ గాలి నాణ్యతలో చెప్పు కోదగిన మెరుగుదలేమీ కనబడలేదని గణాంకాలన్నీ తేల్చాయి. అయితేనేం అది రాజకీయంగా విజయవంతమైంది. చాలా మంది ఢిల్లీ పౌరులు, ప్రత్యే కించి సంపన్న పౌరులు (పలు వాహనాల యజమానులు) కనీసం ఈ సమస్య గురించి ఏదో ఒకటి చేస్తున్నారని, అందులో తాము కూడా భాగస్వా ములం అవుతున్నామని నమ్మేట్టు చేస్తోంది. అంతకు ముందు దీపావళి టపాసుల నిషేధపు ప్రహసనాన్ని కూడా ఇలాగే ప్రదర్శించారు. ఈ చర్యల పట్ల మైత్రీ పూర్వకంగా ఉండే టీవీ చానళ్లు వాటికి మద్దతుగా నిలిచాయి. గొప్ప ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం మన వాయు నాణ్యతను మెరుగుపరుస్తు న్నదని ఊపిరి సలపకుండా ప్రశంసించాయి. హైబ్రిడ్ కార్లు, ఇంటిలో వాడే ఎయిర్–ప్యూరిఫయర్ల తయారీదారుల నుంచి ఈ ప్రశంసా కార్యక్రమాన్ని నిర్విరామంగా ప్రసారం చేయడానికి స్పాన్సర్షిప్లను సైతం అది సంపా దించి పెట్టింది. ఆ కార్లను, ప్యూరిఫయర్లను కొనగలిగేది సంపన్న వంతులే. రెండు చలి కాలాల తర్వాత, ఆప్ ప్రభుత్వం వంటింటి ఎలుక వెంటబడి తిరిగి పరుగులు తీస్తూనే ఉంది. మమతా బెనర్జీతో పోటీపడుతూ ఆమ్ ఆద్మీ మన దేశంలోకెల్లా అత్యంత ప్రజాకర్షక పార్టీగా మారింది. అయితే జనాకర్షక నిరంకుశ పార్టీలకు భిన్నంగా ఆ పార్టీలో అభిప్రాయాలలో, వివేకంలో వైవి«ధ్యానికి తావు ఉంది. ఇక దాని బలహీనతకు వస్తే, అది ఈ వారం ఆ పార్టీ పంజాబ్ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా నోటి నుంచి వెలువడింది. గడ్డిని కాలబెట్టే ‘కార్యక్రమాని’కి అధ్యక్షత వహిస్తూ ఆయన... గడ్డిని స్వయంగా కోసి శుభ్రం చేయడానికి ప్రభుత్వం రైతులకు నెలకు రూ. 5,000 చెల్లించే వరకు దీన్ని కొనసాగించాల్సిందేనని బోధించారు. ఇందుకు మీరు నవ్వండి, ఏడ్వండి, కోపగించండి. లేదంటే, మీ అతిశయాన్ని దింగమింగి, ఆ ఇన్హేలర్ను అందుకుని, అందులోంచి వచ్చే ఆ దరిద్రగొట్టు కార్టిసోన్‌ను పీల్చండి. ఢిల్లీ గాలి మాత్రమే కలుషితమై పోయిందా? అనేది మంచి ప్రశ్న. లేదు, దేశమంతటా గాలి కలుషితం అయిపోయిందనేదే సమాధానం. మరి ఢిల్లీ వాయు కాలుష్యం గురించే ఎందుకీ వెర్రి? వాయుకాలుష్యం ఢిల్లీకే పరిమితమా? మంచి ప్రశ్న. ప్రధాని సహా దేశంలోకెల్లా అత్యంత శక్తివంతులైన రాజకీయ వేత్తలు, పర్యావరణ శాఖ కార్యదర్శి సహా ఉన్నత ప్రభుత్వాధికారులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు, దౌత్యవేత్తలు, మీడియా దాదాలు అంతా ఉండేది అక్కడే. వారు తమ కలుషితమైన గాలి, మరణిస్తున్న నదులు, కాలుష్యంతో నురగలు కక్కుతున్న సరస్సులు, కూలుతున్న పర్వతాల సమస్యనే పరిష్కరించుకోలేకపోతే... ఇక మిగతా దేశం గురించి ఏమైనా చేసే అవకాశం ఏం ఉంటుంది? వారంతా ఏమీ ప్రయ త్నించడం లేదని కాదు. కాకపోతే, మా చిన్నారి లాసాలాగా ఆ ఎలుక కోసం వంటగదిలో వెతకడం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనమంతా నవ్వు కోవాల్సి వస్తోంది. ఇకపోతే గౌరవనీయులైన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉంది. వారు ఢిల్లీ నగరం పట్ల చూపుతున్న ఉద్వేగాన్ని, దాని కోసం చేస్తున్న కృషిని, నగర కాలుష్యంపై ప్రదర్శిస్తున్న ఆగ్రహాన్ని చూస్తుంటే... దాని పేరును దేశ రాజధాని ప్రాంత హరిత ట్రిబ్యునల్‌గా మారిస్తే బావుంటుందని మనవి చేసుకుంటున్నాను. అది భారీ ఎత్తున జారీ చేసే ఫర్మానాలను (ఆదేశాలు) చూసి తుగ్లక్ ఎంతగానో గర్విస్తాడు. కాబట్టి ఆ సంస్థకు ఓ భవనాన్ని కేటాయించి, దానికి తుగ్లక్ భవన్ అని పేరు పెట్టాలని సూచిస్తున్నాను. ప్రజల అసమ్మతి ప్రాంతంగా ఉండే జంతర్ మంతర్‌లోని ఓ చిన్న ప్రాంతాన్ని.. పాలకుల చెవులకు మీ గోల విన రాకుండా, సుదూరంలోని మరో ప్రాంతానికి తరలించాలని అది తాజాగా మరో ఫర్మానాను జారీ చేసింది. నిరసన తెలపడం ఉద్దేశమే పాలకులకు మీ మాట వినిపించేట్టు చేయడం. అయితేనేం, ఢిల్లీ నగరంలోని ఆ సామ్రాజ్యాధికారానికి వ్యతిరేకంగా వాదించే వారు, ప్రత్యేకించి సదుద్దేశాలతో వాదించే వారు ఎవరున్నారు? ఢిల్లీలో భవన నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ ఎన్జీటీ తాజాగా పతాక శీర్షికలకు ఎక్కింది. మంచి ఆలోచన అంటారు మీరు. ఆర్థిక కార్య కలాపాల్ని నిలిపివేయడం కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడే పద్ధతి కాలేదు నిజమే. పైగా, ఈ ఆదేశం వల్ల నిర్మాణ పనులు ఆగిపోతాయిగానీ, కాంట్రా క్టర్లు కార్మికులకు వేతనాలను చెల్లిస్తూనే ఉండాలి. ఈ ఆదేశాన్ని అమలుపరచే ఒక్క కాంట్రాక్టర్‌ను చూపండి, ఎన్జీటీ అంతకు ముందు ఆదేశించినట్టు గడ్డిని కాల్చడం ఆపేసిన రైతును చూపిస్తా. జాతీయ మానవ హక్కుల కమి షన్ సైతం బోలెడు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ సహకారంతో దుష్కృ త్యాలకు పాల్పడుతున్న గో రక్షకుల వెంట పడటం కంటే ఈ పని సురక్షిత మైనది. ఇకపోతే సుప్రీం కోర్టు, ఢిల్లీ వాయు నాణ్యత అధ్వానంగా మార డంతో ఆ సమస్య పరిష్కారానికి భూరేలాల్ కమిషన్‌ను నియమించింది. ఆ కమిటీ తొలి రోజుల్లో గణనీయమైన తేడాను తేగలిగింది. రాజధానిలోని ప్రజా రవాణా వ్యవస్థను అది సీఎన్జీకి పరివర్తన చెందించింది. కాలుష్యానికి ప్రధాన కారణమైన డీజెల్పైనా, ట్రక్కులపైనా కూడా పడతారని ఆశించారు. కానీ ఇçప్పుడున్న ఉపద్రవకరమైన పరిస్థితుల్లో సైతం ప్రతి ప్రముఖ వ్యక్తి వంటింట్లోనూ ఎలుక (డీజెల్ వాహనాలు) ఉంది. కాబట్టి అది జరగలేదు. పరిష్కారాలు లేకపోలేదు కానీ... రంకెలు వేయడం పరిష్కారం కాదు. కానీ కొన్ని పరిష్కారాలు లేక పోలేదు. కాకపోతే, దీపావళి నుంచి మొదలయ్యే రెండు నెలల పతాక శీర్షికల కాలాన్ని వదులుకోవాలి. మిగతా పది నెలలపై దృష్టిని కేంద్రీకరించాలి. ఒకటి, అసలు సమస్యంటూ గుర్తించాలి. రెండు, రాజకీయవేత్తలు, న్యాయమూర్తులు, కార్య కర్తలు ఇలా ప్రతి ఒక్కరు ప్రయత్నించిన పరిష్కారాలూ పని చేయడం లేదు. మూడు, వెక్కిరింతలకు లేదా రాజకీయం చేయడానికి దిగకూడదు. అప్పుడు వాస్తవాలను తిరగేయండి. వాటిలో మొదటిది ఆప్ నేత అతిషి మార్లెనా తయారు చేసిన ఉత్తర భారత కాలుష్యపు పొగ మేఘాల మ్యాప్. దాన్ని పరి శీలిస్తే ఇది కేవలం ఢిల్లీ సమస్య మాత్రమే కాదని, మొత్తం ఆ ప్రాంతమంతా కాలుష్యంతో ఊపిరి సలపకుండా ఉందని అర్థమౌతుంది. ఈ కాలుష్యం పొగ కాలంలో వెలువడ్డ మొట్టమొదటి అర్థవంతమైన ప్రకటన ఇది. ఈ మ్యాప్‌ను మీరు మరింత పశ్చిమానికి విస్తరిస్తే, పాకిస్తాన్‌లోని విశాల ప్రాంతాలు కూడా అలాగే కనిపిస్తాయి. కశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు పాకిస్తాన్ విషయంలో ఏమీ చేయలేని మాట నిజమే. కానీ ఈ సమస్యతో సంబంధం ఉన్న ఢిల్లీ, హరి యాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ముఖ్యమంత్రులు నలుగురితో సమావేశాన్ని ఏర్పాటు చేయమని ప్రధానిని కోరవచ్చు. బాధ్యతను వేరొకరి మీదకు నెట్టే యడం అనే వెటకారాన్ని ఇక మర్చిపోండి. వరి గడ్డి చెత్తను కాలబెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని చెల్లించే మార్గాన్ని అన్వేషించండి. సుప్రీంకోర్టు, ఎన్జీటీల ఆదేశాల ప్రకారం డీజిల్, ట్రక్కుల మీద వందల కోట్ల సెస్‌ను వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న నిధులలో కొంత భాగాన్ని ఇందుకు మళ్లించేలా అంతా కూర్చుని నిర్ణయం చేయవచ్చు. బ్రాంకి యోటిస్ వల్ల వచ్చే దగ్గు తెరలకు పరిష్కారంగా మింట్ మాత్రలను చప్పరించడం లేదా అగర్బత్తీలను వెలిగించుకోవడం.. అవి పతంజలి తయారీవే అయినా.. ఎలాగో, అలాగే ఢిల్లీ కాలుష్యపు పొగలను తమాషాలతో పోరాడాలని అను కోవడం కూడా అంతే భ్రమాత్మకమైనది. ఇప్పుడిక సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడ్డ ఈపీసీఏ నివేదికలను చూడండి. ఢిల్లీలోని కాలుష్యపు తెరలకు దుమ్ము 38 శాతం కారణం. పై నుంచి నీళ్లు చల్లడం లేదా ఫైర్ బ్రిగేడ్లతో చెట్లకు స్నానం చేయించడంలాంటి వెర్రి ఆలోచనలను మరచిపోండి. 2016లో వాగ్దానం చేసినట్టుగా ఢిల్లీ రోడ్లను శుభ్రం చేయడానికి వాక్యూం స్వీపింగ్ మిషన్లను కొనమని ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయండి. కనీసం వందల కొద్దీ మరణావస్థలో ఉన్న పాత డీటీసీ బస్సుల స్థానంలో కొత్త వాటిని కొనమనండి. ప్రభుత్వం వద్ద డబ్బు లేదం టారా? ఢిల్లీ ఓటర్లకు సబ్సిడీకి విద్యుత్తును, ఉచితంగా తాగునీటిని పంచి పెట్టడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉండాల్సింది. ఈ చర్యలేవీ, బేసి–సరి పద్ధతి కంటే లేదా నిషేధాల కంటే ఆకర్షణీ యమైనవిగా ఉండవు. కానీ ఉపయోగపడేవి. ఈ పొగ కాలంలో చేసిన మిగతా పనులన్నీ హాస్యాస్పదమైనవి మాత్రమే కాదు. మనలో కోట్లాదిమం దిని సామూహికంగా వంచించి చేసిన అఘాయిత్యం. సినిమా వాళ్లకు ఉండే స్వాతంత్య్రం పాత్రికేయులకు ఉండదు. కాబట్టి, ఇష్కియా సినిమాలో విద్యా బాలన్ అతి తరచుగా వాడిన మూర్ఖత్వం అనే అర్థాన్నిచ్చే ఆ ముతక మాటను వాడలేను. కాబట్టి దీన్ని సరి–బేసి గంధక ధూమం అంటాను. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
పొరపాటు చేశాను.. సరిదిద్దుకుంటా: సీఎం
న్యూఢిల్లీ: వరుస ఓటములతో ఢీలాపడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన పొరపాట్లను అంగీకరించారు. పరాజయాలపై ఆత్మపరిశీలన చేసుకుని, తప్పులను సరిదిద్దుకుంటానని కేజ్రీవాల్ అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేయడం వల్లే ఆప్ ఓటమి చవిచూసిందని ఆయన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికలో ఆప్ పరాజయం పాలైంది. తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆప్‌కు ఓటమి తప్పలేదు. ఎంసీడీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల తర్వాత కేజ్రీవాల్ ఓటమిని అంగీకరిస్తున్నట్టు చెప్పారు. 'గత రెండు రోజులుగా ఆప్ కార్యకర్తలు, ఓటర్లతో మాట్లాడాను. వాస్తవమేంటన్నది తేలింది. మనం కొన్ని పొరపాట్లు చేశాం. ఆత్మపరిశీలన చేసుకుని, తప్పులను సరిదిద్దుకోవాలి. మూలాల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఆషామాషీగా తీసుకోరాదు. ఓటర్లకు, కార్యకర్తలకు రుణపడి ఉన్నాం' అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మహానగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 270 సీట్లకు గాను బీజేపీ 181 గెల్చుకోగా, ఆప్ 48, కాంగ్రెస్ 30 సీట్లతో సరిపెట్టుకున్నాయి. -
జనంలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
-
పాక్ ట్రెండింగ్స్ లో కేజ్రీవాల్ టాప్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం పాకిస్తాన్ ట్విట్టర్ ట్రెండింగ్స్ లో మొదటి స్ధానంలో నిలిచారు. సర్జికల్ స్ట్రైక్ జరిగినట్లు ఆధారాలు చూపించాలని కేజ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన కొందరు ఆయనపై ఇంకు చల్లారు. ఇదే సమయంలో పాకిస్తాన్ సోషల్ మీడియా కేజ్రీకు అండగా నిలిచింది. ఈ రోజు కేజ్రీవాల్ పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారని యూజర్లు కామెంట్లు పెట్టారు. సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని ముక్త కంఠంతో వాదిస్తున్న పాక్ మీడియా కూడా కేజ్రీకు బాసటగా నిలిచింది. ఆధారాలు అడిగినందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఇంకు చల్లారు అంటూ డావ్న్ పత్రిక ప్రచురించింది. మరో వ్యక్తి భారత్ లో కేజ్రీవాల్ ఒక్కరే నిజాయితీపరుడని ట్వీట్ చేశాడు. If elections are held today, In Pakistan.. pic.twitter.com/4BMPogidfQ — Mayank (@SinghMayank_) 5 October 2016 Sir @ArvindKejriwal is the only one honest leader in India #PakStandsWithKejriwal pic.twitter.com/lRLecyVCa7 — Waheed Gul (@waheedgul) 6 October 2016 -
ఢిల్లీకి ‘రాష్ట్ర’ హోదా కోసం రెఫరెండం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ త్వరలో తామూ రెఫరెండం నిర్వహిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. బ్రెగ్జిట్ రెఫరెండంపై స్పందిస్తూ ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. ‘ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభిస్తే.. పోలీసు, భూమి, పురపాలక సంస్థలు, బ్యూరోక్రసీ తదితరాలు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి వస్తాయి’ అని ఆప్ సీనియర్ నేత ఆశిశ్ ఖేతన్ తెలిపారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ గత నెల ముసాయిదా బిల్లును రూపొందించిన ఆప్ ప్రభుత్వం.. జూన్ 30 వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. కాగా భారత్‌కు సభ్యత్వంపై నిర్ణయం తీసుకోకుండానే ఎన్ఎస్జీ ప్లీనరీ ముగియటంపై కేజ్రీ స్పందించారు. విదేశాంగ విధానంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని, విదేశీ పర్యటన్లో ఏం సాధించారన్నారు. -
కేజ్రీవాల్‌పై బూటు దాడి
‘సరి-బేసి’పై విలేకరుల భేటీలో.. కేజ్రీకి కొద్ది దూరంలో పడ్డ బూటు న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరోమారు దాడి జరిగింది. శనివారం ఢిల్లీ సెక్రెటేరియట్‌లో ‘సరి-బేసి’పై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓ వ్యక్తి కేజ్రీవాల్‌పై బూటు దాడి చేశాడు. అయితే బూటు కేజ్రీవాల్‌కు తాకలేదు. పక్కనే ఉన్న ఓ అధికారి వెంటనే స్పందించి కేజ్రీవాల్‌కు బూటు తాకకుండా అడ్డుకున్నారు. బూటు విసిరిన వ్యక్తిని వేద్ ప్రకాశ్‌గా పోలీసులు గుర్తించారు. ‘అరవింద్ గారు ఒక్క నిమిషం. సీఎన్జీ స్టిక్కర్ కుంభకోణంపై నేను ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాను. ఒక్కో స్టిక్కర్‌ను రూ.1,000కి పంపిణీ చేశారు. ఎందుకిలా చేస్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోరు’ అని బూటు, సీడీ విసరడానికి ముందు ప్రకాశ్ ప్రశ్నించాడు. తర్వాత తాను ఆమ్ ఆద్మీ సేనకు చెందిన వ్యక్తిగా ప్రకటించుకున్నాడు. దాడి జరిగిన వెంటనే వేద్‌ను ఆప్ కార్యకర్తలు పక్కకు తోసేశారు. పోలీసులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. తర్వాత సమావేశాన్ని కేజ్రీవాల్ కొనసాగించారు. దీనిపై స్పందించిన ఢిల్లీ పర్యాటక మంత్రి కపిల్ శర్మ.. దాడి వెనక ఢిల్లీ బీజేపీ నేత హస్తముందని ఆరోపించారు. ప్రకాశ్ కాల్‌డేటాపై విచారణ చేపట్టాలని ట్వీట్ చేశారు. దాడిని ఖండించిన బీజేపీ.. ఇలాంటి ఘటనలు పదేపదే ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఎక్కువ దాడులు కేజ్రీపైనే.. ► రాజకీయాల్లోకి వచ్చినప్పట్నుంచి కేజ్రీవాల్‌పై దాడులు సాగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆయనపై దాడులు.. ► 2013 నవంబర్‌లో హజారే మద్దతుదారుడినని ప్రకటించుకున్న ఓ వ్యక్తి.. కేజ్రీవాల్, ఆప్ కార్యకర్తలపై సిరా దాడి చేశాడు. ►2014 మార్చిలో వారణాసిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌పై కొందరు వ్యక్తులు గుడ్లు, సిరాతో దాడి చేశారు. ►2014 ఏప్రిల్‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వీపుపై ఓ వ్యక్తి కొట్టాడు. నాలుగు రోజుల తర్వాత సుల్తాన్‌పురిలో ఓ రిక్షావాలా కేజ్రీ చెంపపై కొట్టాడు. ► గత జనవరిలో ‘సరి-బేసి’ తొలి దశ విజయోత్సవ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ సేన కార్యకర్త భావన అరోరా.. సిరా దాడి చేశారు. -
సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట కలిగింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఆయనకు ఢిల్లీ కిందిస్థాయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం కేజ్రీవాల్ తోపాటు మరో ఐదుగురు ఆప్ నేతలకు కూడా గురువారం బెయిలిచ్చింది. తన పరువుకు నష్టం కలిగేలా అవాస్తవాలతో కూడిన ప్రకటనలను సీఎం కేజ్రీవాల్ ఆయన పార్టీ నేతలు విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజ్పేయ్లపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి వారిని ఈ రోజు(ఏప్రిల్ 7న) కోర్టుకు హాజరుకావాల్సిందిగా కిందిస్థాయి కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే వారికి బెయిల్ మంజూరు చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌కు పార్టీ సలహాదారు,ఎమ్మెల్యే గోపాల్ మోహన్ జామీనుగా ఉండగా ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ అశుతోష్‌కు నరేశ్ బాల్యాన్ సంజయ్ సింగ్ కు, నితిన్ త్యాగి కుమార్ విశ్వాస్‌కు జామీన్లుఆ ఉన్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.20 వేల పూచికత్తు కోర్టుకు సమర్పించారు. ఈ కేసు విచారణ సందర్బంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడా కోర్టుకు హాజరయ్యారు. -
ఆటోవాలాలతో సీఎం హోలీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రంగుల పండుగ సంబరాలను ఆటోరిక్షా డ్రైవర్లతో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, ఆటో రిక్షా డ్రైవర్లతో కలిపి హోలీ పర్వదినాన్ని ఎంజాయ్ చేసినట్టు సీఎం ట్విట్టర్ లో తెలిపారు. తన అధికారిక నివాసంలో ఆటో వాలాలు, కుటుంబ సభ్యులు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు, నా ప్రియమైన జుంటా తో హోలీ జరుపుకున్నానంటూ ట్విట్ చేశారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు తమ సంబరాల ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు సందడి చేశారు. Played holi wid my family, volunteers, ministers, MLAs, officers, autowallas n my dear junta. Happy Holi pic.twitter.com/yBlXKfOAT1 — Arvind Kejriwal (@ArvindKejriwal) March 24, 2016 -
ప్రధానికి ఢిల్లీ సీఎం నాలుగు సలహాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోదీకి సలహాలు ఇచ్చారు. జేఎన్‌యూ వివాదం సర్దుమణిగేందుకు నాలుగు సలహాలు ప్రధానికి సూచించారు. వాటిని అమలుచేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయన చెప్పారు. దేశద్రోహం ఆరోపణలతో జేఎన్‌యూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి కన్హయ్య కుమార్ అరెస్టు నేపథ్యంలో జేఎన్‌యూ ప్రాంగణం వివాదాలకు నిలయమైన విషయం తెలిసిందే. కన్నయ్యను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కోర్టు ప్రాంగణం రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం పేరిట కేజ్రీవాల్ నాలుగు సూచనలు ప్రధానికి తెలియజేస్తూ ఓ లేఖ రాశారు. అందులో ఏం పేర్కొన్నారంటే 1. విద్యార్థిపై దాడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మను అరెస్టు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి. 2. అరెస్టుచేసిన విద్యార్థి నాయకుడుకన్హయ్యకుమార్ ను వెంటనే విడుదల చేయాలి. 3. జేఎన్‌యూలో రాజకీయ జోక్యాన్ని నిలిపేయాలి. 4. ప్రజలకు ఢిల్లీ పోలీసులపై నమ్మకం కలిగించే చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా జేఎన్‌యూ వివాదం సర్దుమణుగుతుందని చెప్పారు. ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నందున జేఎన్‌యూ వివాదం విషయంలో పోలీసులు విఫలమయ్యారని, వారి విఫలం కేంద్ర వైఫల్యంగానే భావిస్తున్నానని అందులో చెప్పారు. -
వారిని శిక్షించి ఉంటే ‘దాద్రి’లు ఉండేవి కాదు
1984 సిక్కుల ఊచకోతపై కేజ్రీవాల న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం చోటుచేసుకున్న 1984 సిక్కుల ఊచకోత బాధ్యులను శిక్షించి ఉంటే గుజరాత్ అల్లర్లు, దాద్రీ వంటి ఘటనలు లు జరిగుండేవి కావన్నారు. సిక్కుల ఊచకోత జరిగి 31 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 1,332 సిక్కు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించారు. ‘ఈ నరమేధంపై అన్ని పార్టీలూ ఆందోళన వ్యక్తం చేశాయి గానీ... 31 ఏళ్లయినా అందుకు కారకులైన ఏ ఒక్కరికీ శిక్ష పడలేదు. సిక్కుల ఊచకోతపై ప్రత్యేక విచారణ వేసే అధికారం తన ప్రభుత్వానికి ఉంటే ఆ దిశగా చర్యలు తీసుకుంటా’ అన్నారు. -
రేప్‌లపై ప్రధాని, గవర్నర్ ఏం చేస్తున్నారు?
- దేశరాజధానిలో చిన్నారులపై వరుస అఘాయిత్యాలు సిగ్గుచేటు - ఢిల్లీ పోలీసులు, ప్రధాని మోదీ, ఎల్జే నజీబ్ జంగ్ల తీరుపై సీఎం కేజ్రీవాల్ మండిపాటు న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో చిన్నారులపై అత్యాచారాలు తరచూ జరుగుతుండటం సిగ్గుచేటని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సామూహిక అత్యాచారానికిగురై ప్రస్తుతం జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాళ్లను ఆయన పరామర్శించారు.ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా ఆయన వెంట వచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు, ప్రధాని నరేంద్ర మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ లపై కేజ్రీవాల్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆడపిల్లలను కాపాడుకోవటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రధాని, లెఫ్టినెంట్ గవర్నర్ లు ఏం చేస్తున్నట్లు?' అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఢిల్లీలో పోలీసులపై పెత్తనం కేంద్రం చేతుల్లో ఉండటంవల్లే తాము అనుకున్న రీతిలో దుండగులను దండించే వీలు లేకుండా పోతోందని కేజ్రీవాల్ గతంలోనూ చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. పశ్చిమఢిల్లీలో ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నర ఏళ్ల పాపను దుండగులు అపహరించి, గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె ఇంటి సమీపంలోని పార్కు దగ్గర తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ చిన్నారిని ఇరుగుపొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. తూర్పు ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో జరిగిన మరో సంఘటనలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐదేళ్ల పాపను పొరుగున ఉండే వ్యక్తి కిడ్నాప్ చేసి, స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. Repeated rape of minors is shameful and worrying. Delhi police has completely failed to provide safety. What are PM n his LG doing? — Arvind Kejriwal (@ArvindKejriwal) October 17, 2015 Am on my way to hospitals to meet rape victims — Arvind Kejriwal (@ArvindKejriwal) October 17, 2015 -
ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు శుక్రవారం ఢిల్లీ సచివాలయానికి ఆయన వచ్చారు. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆయనకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్...కేజ్రీవాల్‌తో కలిసి భోజనం కూడా చేశారు. ఆ తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు విలేకరులతో మాట్లాడారు. అయితే తమ చర్చల వివరాలను మాత్రం వారు బయటపెట్టలేదు. చారిత్రక విజయం సాధించిన ందుకు ఆప్ నేత కేజ్రీవాల్‌ను తాను అభినందించానని, ఇతర విషయాలేవీ మాట్లాడలేదని నితీష్ కుమార్ చెప్పారు. కేజ్రీవాల్ కూడా ఈ విషయమే చెబుతూ ఢిల్లీ ఎన్నికలలో తమ విజయాన్ని అభినందించడానికే బిహార్ ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చారని తెలిపారు. రాజకీయాల్లో కలిసి పనిచేయడంపై తమ మధ్య చర్చలేవీ జరగలేదని అర్వింద్ చెప్పారు. ఈ సందర్భంగా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్‌కు నితీష్ కుమార్ మద్దతు ప్రకటించారు. అంతకముందు ఇద్దరు సీఎంల భేటీ విషయంపై జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఆప్‌కు తమ పార్టీ మద్దతిచ్చినందువల్ల నితీష్‌ను కేజ్రీవాల్ భోజనానికి ఆహ్వానించారని, వారు రాజకీయాలను కూడా చర్చిస్తారని త్యాగి తెలిపారు. ఈ సంవత్సరం బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున ఇరువురు నేతల సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఢిల్లీకి ఆవల పార్టీని విస్తరించడానికి ఆమ్ఆద్మీ ఇటీవల సంసిద్ధతను ప్రకటించింది. గతంలో కూడా కేజ్రీవాల్, నితీష్‌కుమార్ కలిశారు. మోదీ ప్రధాని అయిన తరువాత వారిద్దరు తొలిసారి కలిశారు. -
కేంద్రంతో ఆప్ ‘ఢీ’!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నియామక అంశంలో కేంద్ర ప్రభుత్వంతో ఆప్ కయ్యానికి కాలు దువ్వుతోంది. బ్యూరోక్రాట్లకు సంబంధించి అత్యున్నత పదవి అయిన సీఎస్ ఎంపిక కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. వారలో నుంచి ఒకరిని ఎంచుకొని సీఎస్‌గా నియమించుకోవాలని సూచించింది. అయితే, కేంద్రం పంపిన ప్యానల్లో ఢిల్లీ సర్కారు సూచించిన ఆర్.ఎస్.నేగీ పేరు లేదు. దీంతో కేంద్రం పంపిన ఈ ప్యానల్‌ను తిరస్కరించాలనే నిర్ణయానికి ఆప్ సర్కారు వచ్చింది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 1984 బ్యాచ్‌కి చెందిన ఆర్.ఎస్.నేగీని సీఎస్‌గా నియమించాలని ప్రభుత్వం గట్టిగా పట్టుబడుతోంది. సీఎస్‌గా నేగీ పేరును ఖరారు చేయించడం కోసం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని గురువారం సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కలిశారు. నేగీ గతంలో ఢిల్లీ ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారని రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ జల్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశారని, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై అతనికి మంచి అవగాహన ఉందని చెప్పారు. తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని రాజ్‌నాథ్‌ని కోరారు. కానీ రాజ్‌నాథ్ అందుకు అంగీకరించకుండా, వారి విజ్ఞప్తిని తిరస్కరించారు. అతన్ని నియమించడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటని కేంద్రాన్ని ఆప్ ప్రశ్నిస్తోంది. ఐఏఎస్ రేసులో ఉన్న ఇతర అధికారులతో పోలిస్తే నేగీ చాలా జూనియర్ అని, అతని నియమించడం సర్వీస్ రూల్స్‌కి విరుద్ధం అని కేంద్రం వాదిస్తోంది. వివిధ స్థానాల్లో అతని కంటే సీనియర్లైన ఏజీఎంటీయూ కేడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారులు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో నేగీని నియమించడం సరికాదని ఢిల్లీ సర్కారుకి కేంద్రం వివరించింది. కాగా, ఆప్ మాత్రం కేంద్రం వాదనను వ్యతిరేకిస్తోంది. మరి అలాంటి జూనియర్ అధికారిని అరుణాచల్‌ప్రదేశ్ వంటి సమస్యాత్మక ప్రాంతానికి సీఎస్‌గా నియమించారని ప్రశ్నిస్తోంది. కేంద్రం సహకరించాలి.. ప్రజలు తమ ప్రభుత్వంపై చాలా అంచనాలను పెట్టుకున్నారని, వారి కోసం రూపొందించే పథకాల అమలులో కేంద్రం తప్పక సహకారం అందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కోరింది.