ఢిల్లీకి ‘రాష్ట్ర’ హోదా కోసం రెఫరెండం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ త్వరలో తామూ రెఫరెండం నిర్వహిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. బ్రెగ్జిట్ రెఫరెండంపై స్పందిస్తూ ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. ‘ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభిస్తే.. పోలీసు, భూమి, పురపాలక సంస్థలు, బ్యూరోక్రసీ తదితరాలు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి వస్తాయి’ అని ఆప్ సీనియర్ నేత ఆశిశ్ ఖేతన్ తెలిపారు.
ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ గత నెల ముసాయిదా బిల్లును రూపొందించిన ఆప్ ప్రభుత్వం.. జూన్ 30 వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. కాగా భారత్‌కు సభ్యత్వంపై నిర్ణయం తీసుకోకుండానే ఎన్‌ఎస్‌జీ ప్లీనరీ ముగియటంపై కేజ్రీ స్పందించారు. విదేశాంగ విధానంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని, విదేశీ పర్యటన్లో ఏం సాధించారన్నారు.