వారిని శిక్షించి ఉంటే ‘దాద్రి’లు ఉండేవి కాదు
1984 సిక్కుల ఊచకోతపై కేజ్రీవాల
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం చోటుచేసుకున్న 1984 సిక్కుల ఊచకోత బాధ్యులను శిక్షించి ఉంటే గుజరాత్ అల్లర్లు, దాద్రీ వంటి ఘటనలు లు జరిగుండేవి కావన్నారు. సిక్కుల ఊచకోత జరిగి 31 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 1,332 సిక్కు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించారు.
‘ఈ నరమేధంపై అన్ని పార్టీలూ ఆందోళన వ్యక్తం చేశాయి గానీ... 31 ఏళ్లయినా అందుకు కారకులైన ఏ ఒక్కరికీ శిక్ష పడలేదు. సిక్కుల ఊచకోతపై ప్రత్యేక విచారణ వేసే అధికారం తన ప్రభుత్వానికి ఉంటే ఆ దిశగా చర్యలు తీసుకుంటా’ అన్నారు.