పాక్ ట్రెండింగ్స్ లో కేజ్రీవాల్ టాప్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం పాకిస్తాన్ ట్విట్టర్ ట్రెండింగ్స్ లో మొదటి స్ధానంలో నిలిచారు. సర్జికల్ స్ట్రైక్ జరిగినట్లు ఆధారాలు చూపించాలని కేజ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఆగ్రహించిన కొందరు ఆయనపై ఇంకు చల్లారు. ఇదే సమయంలో పాకిస్తాన్ సోషల్ మీడియా కేజ్రీకు అండగా నిలిచింది. ఈ రోజు కేజ్రీవాల్ పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారని యూజర్లు కామెంట్లు పెట్టారు. సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని ముక్త కంఠంతో వాదిస్తున్న పాక్ మీడియా కూడా కేజ్రీకు బాసటగా నిలిచింది. ఆధారాలు అడిగినందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఇంకు చల్లారు అంటూ డావ్న్ పత్రిక ప్రచురించింది. మరో వ్యక్తి భారత్ లో కేజ్రీవాల్ ఒక్కరే నిజాయితీపరుడని ట్వీట్ చేశాడు.
If elections are held today, In Pakistan.. pic.twitter.com/4BMPogidfQ
— Mayank (@SinghMayank_) 5 October 2016
Sir @ArvindKejriwal is the only one honest leader in India #PakStandsWithKejriwal pic.twitter.com/lRLecyVCa7
— Waheed Gul (@waheedgul) 6 October 2016