న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రంగుల పండుగ సంబరాలను ఆటోరిక్షా డ్రైవర్లతో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, ఆటో రిక్షా డ్రైవర్లతో కలిపి హోలీ పర్వదినాన్ని ఎంజాయ్ చేసినట్టు సీఎం ట్విట్టర్ లో తెలిపారు.
తన అధికారిక నివాసంలో ఆటో వాలాలు, కుటుంబ సభ్యులు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు, నా ప్రియమైన జుంటా తో హోలీ జరుపుకున్నానంటూ ట్విట్ చేశారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు తమ సంబరాల ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు సందడి చేశారు.
Played holi wid my family, volunteers, ministers, MLAs, officers, autowallas n my dear junta. Happy Holi pic.twitter.com/yBlXKfOAT1
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 24, 2016