న్యూఢిల్లీ: 1999లో సంచలనం సృష్టించిన మోడల్ జెస్సికాలాల్ హత్య కేసులో దోషిగా యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్న మనుశర్మను ముందుగానే విడుదల చేసేందుకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మంగళవారం ఆమోదం తెలిపారు. మనుశర్మను ముందే విడుదల చేయాలని ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ అధ్యక్షతన మే 11న జరిగిన భేటీలో ‘ఢిల్లీ సెంటెన్స్ రివ్యూ బోర్డ్’ సిఫారసు చేసింది. మను శర్మ మాజీ కేంద్ర మంత్రి వినోద్ శర్మ కొడుకు. దక్షిణ ఢిల్లీలో ఉన్న టామరిండ్ కోర్ట్ రెస్టారెంట్‌లో మద్యం అందించేందుకు నిరాకరించిందన్న కారణంతో మోడల్ జెస్సికా లాల్‌ను మనుశర్మ తుపాకీతో కాల్చి చంపేశాడు. 1999 ఏప్రిల్ 30న ఈ ఘటన జరిగింది. ట్రయల్ కోర్టు మనుశర్మను నిర్దోషిగా తేల్చింది. హైకోర్టు 2006 డిసెంబర్‌లో మనుశర్మకు యావజ్జీవ ఖైదు విధించింది. ఆ తరువాత 2010లో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.
Comments
Please login to add a commentAdd a comment