model Jessica Lal murder
-
‘మనుశర్మకు ఈ శిక్ష సరిపోదు’
సాక్షి, ముంబై: సంచలనం సృష్టించిన మోడల్ జెస్సికా లాల్ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న మనుశర్మ విడుదలకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై బాలీవుడ్ నటి విద్యా బాలన్ స్పందించారు. ‘ఈ వ్యాఖ్యలు పూర్తిగా నా వ్యక్తిగతం. మనుశర్మకి, అతనిలాంటి నేరాలు చేసే వ్యక్తులకు ఎంత కాలం శిక్ష వేసినా సరిపోదు. దీని గురించే నా మనసులో మెదులుతూ ఉంటుంది. ఏమో తను మంచిగా మారాడేమో.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. తను మంచిగా మారాడనే ఆశిస్తున్నాను’ అన్నారు. జెస్సికా హత్య ఆధారంగా బాలీవుడ్లో ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2011లో వచ్చిన ఈ సినిమాలో విద్యాబాలన్ జెస్సికా సోదరి సబ్రినా లాల్ పాత్రలో నటించారు.(కథ వింటారా?) దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలిలోని టామరిండ్ కోర్టు రెస్టారెంట్ బార్లో పనిచేస్తున్న జెస్సికా లాల్‌ను 1999లో మను శర్మ అత్యంత దారుణంగా హత్య చేశాడు. సమయం మించిపోయిన కారణంగా మద్యం సర్వ్ చేయడానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన మనుశర్మ ఆమెను పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు మను శర్మ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. హైకోర్టు 2006 డిసెంబర్లో మనుశర్మకు యావజ్జీవ ఖైదు విధించింది. ఆ తరువాత 2010లో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. -
జెస్సికాలాల్ హంతకుడి విడుదలకు ఢిల్లీ ఎల్జీ ఓకే
న్యూఢిల్లీ: 1999లో సంచలనం సృష్టించిన మోడల్ జెస్సికాలాల్ హత్య కేసులో దోషిగా యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్న మనుశర్మను ముందుగానే విడుదల చేసేందుకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మంగళవారం ఆమోదం తెలిపారు. మనుశర్మను ముందే విడుదల చేయాలని ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ అధ్యక్షతన మే 11న జరిగిన భేటీలో ‘ఢిల్లీ సెంటెన్స్ రివ్యూ బోర్డ్’ సిఫారసు చేసింది. మను శర్మ మాజీ కేంద్ర మంత్రి వినోద్ శర్మ కొడుకు. దక్షిణ ఢిల్లీలో ఉన్న టామరిండ్ కోర్ట్ రెస్టారెంట్లో మద్యం అందించేందుకు నిరాకరించిందన్న కారణంతో మోడల్ జెస్సికా లాల్‌ను మనుశర్మ తుపాకీతో కాల్చి చంపేశాడు. 1999 ఏప్రిల్ 30న ఈ ఘటన జరిగింది. ట్రయల్ కోర్టు మనుశర్మను నిర్దోషిగా తేల్చింది. హైకోర్టు 2006 డిసెంబర్లో మనుశర్మకు యావజ్జీవ ఖైదు విధించింది. ఆ తరువాత 2010లో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. -
మనుశర్మకు పెరోల్
న్యూఢిల్లీ: మోడల్ జెసికాలాల్ హత్య కేసులో నింది తుడు మనుశర్మకు ఢిల్లీ హైకోర్టు 15 రోజులపాటు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుగ్రాడ్యుయేట్ పరీక్షలకు హాజరు కావడానికి పెరోల్ ఇవ్వాలన్న అతని విజ్ఞప్తిని అంగీకరించింది. ఇందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరు రూ.50 వేల వ్యక్తిగత బాండు సమర్పించాలని ఆదేశించింది. పెరోల్ సమయంలో ఢిల్లీని విడిచి వెళ ్లకూడదని షరతు విధించింది. జెసికా నివాసం, వాళ్ల కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని కూడా స్పష్టం చేసింది. తాను ఈ నెల 19 నుంచి 24 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ హ్యూమన్‌రైట్స్‌లో పరీక్షలు రాయాల్సి ఉందని శర్మ కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నాడు. దీనికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు కూడా ఉందని తెలిపాడు. జైలులో శర్మ ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని, ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ కూడా ధ్రువీకరించారని ఇతని న్యాయవాదులు అర్పితా బాత్రా, ఎస్.నంద్రజోగ్ కోర్టుకు విన్నవించారు. ఖైదీల చిన్నారులకు చదువు చెప్పించేందుకు శర్మ తన స్వచ్ఛందసంస్థ సిద్ధార్థ్ వశిష్ట్ చారిటబుల్ ట్రస్ట ద్వారా ఎంతో కృషి చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ప్రశంసలు అందుకున్నాడని వివరించారు. అయితే 2009లో శర్మకు పెరోల్ ఇచ్చినప్పుడు ఇతని ప్రవర్తన సక్రమంగా లేనందున, ఈసారి మంజూరు చేయవద్దని పోలీసులు కోరారు. మాజీ కేంద్రమంత్రి వినోద్‌శర్మ కొడుకు అయిన మనుశర్మ 1999లో జెసికాలాల్ను రెస్టారెంటులో కాల్చిచంపాడు. దీంతో ఇతనికి యావజ్జీవ శిక్ష విధించారు.