ఇఫ్తార్‌కు ఎల్జీని పిలవని స్పీకర్‌ | Delhi Speaker hosts grand party, but doesn't invite Lt Governor Anil Baijal | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌కు ఎల్జీని పిలవని స్పీకర్‌

Published Sun, Jun 10 2018 5:22 AM | Last Updated on Sun, Jun 10 2018 5:22 AM

Delhi Speaker hosts grand party, but doesn't invite Lt Governor Anil Baijal - Sakshi

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌నివాస్‌  లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) అనిల్‌ బైజల్‌కు షాకిచ్చారు. ఢిల్లీ∙అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు బైజల్‌కు ఆహ్వానం పంపలేదు. గతేడాది ఇఫ్తార్‌ విందుకు ఆహ్వానించినప్పటికీ ఎల్‌జీ రాలేదనీ, అందుకు ఎలాంటి కారణం చెప్పలేదని, అందుకే ఈసారి ఆయనకు ఆహ్వానం పంపలేదని స్పీకర్‌ చెప్పారు. విందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్, సామాజిక సంక్షేమ మంత్రి రాజేంద్రపాల్‌ గౌతమ్, పర్యావరణ మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్, ఆప్‌ శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ ఇఫ్తార్‌ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement