No invitation
-
G20 Summit: జీ20కి పిలవకుండా ఎలా వెళ్లాలి?: ఖర్గే
బనశంకరి: ఢిల్లీలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని, అలాంటప్పుడు ఎలా వెళ్లాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఇంతవరకు ఇలాంటి రాజకీయాలు చేయలేదని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జీ20 సదస్సుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలకు ఆహా్వనం ఇవ్వకపోవడం వంటి పనికిమాలిన రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ పొత్తుపై పత్రికల్లో చూశానని, దేవెగౌడ, నరేంద్ర మోదీ చేతులు కలపడం చూశానని అన్నారు. ఇద్దరూ ఒకటి కావడానికి ప్రయతి్నస్తున్నారని, వారి మధ్య సీట్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. కానీ, వారు కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరని చెప్పారు. సనాతన ధర్మం విషయంలో రాజకీయాలు తీసుకురాకూడదని, అందరూ ఒక్కటే అనే భావనతో వెళ్లాలని సూచించారు. -
ఇఫ్తార్‌కు ఎల్జీని పిలవని స్పీకర్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్‌కు షాకిచ్చారు. ఢిల్లీ∙అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు బైజల్‌కు ఆహ్వానం పంపలేదు. గతేడాది ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినప్పటికీ ఎల్జీ రాలేదనీ, అందుకు ఎలాంటి కారణం చెప్పలేదని, అందుకే ఈసారి ఆయనకు ఆహ్వానం పంపలేదని స్పీకర్ చెప్పారు. విందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్, సామాజిక సంక్షేమ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్, పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్, ఆప్ శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు రాలేదు. -
పాపం కోదండరామ్!
-
కోదండరాంకు అందని కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖలను ఆహ్వానించారు. రాజభవన్ లో జరిగే ప్రమాణా స్వీకారానికి అమరవీరుల కుటుంబ సభ్యులను కేసీఆర్ ఆహ్వనించారు. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సైనా నెహ్వల్ , గోపీచంద్ తోపాటు సిఐఐ వంటి రంగాలకు చెందిన వారికి కేసీఆర్ ఆహ్వనం పంపారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. కోదండరాంను ఆహ్వానించకపోవడం వివాదస్పదమైంది. కేసీఆర్, కోదండరాంల మధ్య విభేదాలు నెలకొన్నాయనే వార్తలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూరుస్తోంది.