Ramnivas
-
ఆరుసార్లు ఎమ్మెల్యే.. 15 నిమిషాల్లో రెండుసార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సోమవారం మంత్రివర్గ మినీ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రభుత్వంలో ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామ్ నివాస్ రావత్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ మంగూభాయ్ సీ పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే తొలుత రామ్ నివాస్ తప్పుగా ప్రమాణం చేశారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉండగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం తన తప్పును గ్రహించడంతో 15 నిమిషాల తరువాత కేబినెట్ మంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది.రావత్ గ్వాలియర్-చంబల్ ప్రాంతానికి చెందిన శక్తివంతమైన ఓబీసీ నేత. లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు. షియోపూర్ జిల్లాలోని విజయ్‌పూర్ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రావత్‌కు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవి, ప్రతిపక్ష నేత వంటి కీలక పదవులు అప్పజెప్పనందుకు అసంతృప్తి చెంది పార్టీ మారారు. రావత్ బీజేపీలో చేరిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ మోరెనా సీటు గెలవడంలో కృషి చేశారు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా కుటుంబానికి విధేయుడిగా ఉన్న రావత్.. 2020 మార్చిలో 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి సింధియా పార్టీని వీడి బీజేపీలో చేరిప్పటికీ రావత్ కాంగ్రెస్‌లోనే కొనసాగారు.ప్రస్తుతం సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మినహా 30 మంది మంత్రులు ఉన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 18 మంది కేబినెట్ మంత్రులు, 10 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అంతేగాక అతని ప్రభుత్వంలో 3 ఖాళీలు ఉన్నాయి. -
ఇఫ్తార్‌కు ఎల్జీని పిలవని స్పీకర్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్‌కు షాకిచ్చారు. ఢిల్లీ∙అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు బైజల్‌కు ఆహ్వానం పంపలేదు. గతేడాది ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినప్పటికీ ఎల్జీ రాలేదనీ, అందుకు ఎలాంటి కారణం చెప్పలేదని, అందుకే ఈసారి ఆయనకు ఆహ్వానం పంపలేదని స్పీకర్ చెప్పారు. విందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్, సామాజిక సంక్షేమ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్, పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్, ఆప్ శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు రాలేదు. -
హెడ్ కానిస్టేబుల్ హత్య కేసులో రామ్నివాస్ అరెస్టు
న్యూఢిల్లీ: 23 కేసులతోపాటు హెడ్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్నివాస్ను ఔటర్ ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆదివారం అరెస్టు చేశారు. నీతూ దభోడా గ్యాంగ్‌కు చెందిన రామ్నివాస్ తన సహచరులను కలిసేందుకు రోహిణి ప్రాంతానికి వచ్చి దొరికిపోయాడని పోలీసులు తెలిపారు. అతని నుంచి ఓ పిస్తోలును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ రామ్‌కిషన్ హత్య కేసులో నివాస్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడన్నారు. రామ్నివాస్ పట్టుబడ డంతో అతనిపై నమోదైన 23 కేసులు విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశముందన్నారు. అంతేకాక నీతూ దభోడా గ్యాంగ్‌కు చెందిన మరింత మంది పట్టుబడే అకాశముందన్నారు.