హెడ్ కానిస్టేబుల్ హత్య కేసులో రామ్‌నివాస్ అరెస్టు | arrested in head constable murder case | Sakshi
Sakshi News home page

హెడ్ కానిస్టేబుల్ హత్య కేసులో రామ్‌నివాస్ అరెస్టు

Published Sun, Sep 22 2013 11:56 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

arrested in head constable murder case

న్యూఢిల్లీ: 23 కేసులతోపాటు హెడ్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్‌నివాస్‌ను ఔటర్ ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆదివారం అరెస్టు చేశారు. నీతూ దభోడా గ్యాంగ్‌కు చెందిన రామ్‌నివాస్ తన సహచరులను కలిసేందుకు రోహిణి ప్రాంతానికి  వచ్చి దొరికిపోయాడని పోలీసులు తెలిపారు. అతని నుంచి ఓ పిస్తోలును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ రామ్‌కిషన్ హత్య కేసులో నివాస్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడన్నారు. రామ్‌నివాస్ పట్టుబడ డంతో అతనిపై నమోదైన 23 కేసులు విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశముందన్నారు. అంతేకాక నీతూ దభోడా గ్యాంగ్‌కు చెందిన మరింత మంది పట్టుబడే అకాశముందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement