Delhi Assembly Speaker
-
సంచలనం : ఢిల్లీ స్పీకర్‌కు ఆరు నెలల జైలు
న్యూఢిల్లీ : ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్, అతని కుమారుడు సుమిత్ గోయెల్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జైలు శిక్షతో పాటు చెరో వెయ్యి రూపాయల జరిమానా విధించింది. వివరాలు.. 2015 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శాదర నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రామ్ నివాస్ గోయెల్ పోటీ చేశారు. ప్రత్యర్థి తరపున ఓటర్లకు మద్యం, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారనే అనుమానంతో వివేక్ విహార్‌లోని మనీశ్ ఘాయి అనే స్థానిక బిల్డర్ ఇంట్లోకి తన అనుచరులతో కలిసి అక్రమంగా చొరబడి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇంట్లోని పర్నీచర్ను ధ్వంసం చేయడంతో పాటు అడ్డొచ్చిన పని మనుషులపై దాడి చేశారు. దీంతో బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రామ్ నివాస్‌పై సెక్షన్ 448 కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం 2017 సెప్టెంబర్‌లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు ఏడుగురిని దోషులుగా తేల్చింది. తాజాగా ఇప్పుడు శిక్ష ఖరారైంది. అయితే సెక్షన్ 448 ప్రకారం గరిష్టంగా ఏడాది మాత్రమే శిక్ష విధించాలి. దీంతో రాజ్యాంగబద్ధంగా స్పీకర్ అనర్హత వేటుకి గురికారు. అయితే, గతంలో ఈ ఆరోపణలను రామ్ నివాస్ గోయెల్ ఖండించారు. ఘటనకు ముందు ప్రైవేట్ ఫిర్యాదునిచ్చి పోలీసుల సహాయంతోనే మనీశ్ ఘాయి ఇంటికి వెళ్లామనడం గమనార్హం. -
ఇఫ్తార్‌కు ఎల్జీని పిలవని స్పీకర్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్‌కు షాకిచ్చారు. ఢిల్లీ∙అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు బైజల్‌కు ఆహ్వానం పంపలేదు. గతేడాది ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినప్పటికీ ఎల్జీ రాలేదనీ, అందుకు ఎలాంటి కారణం చెప్పలేదని, అందుకే ఈసారి ఆయనకు ఆహ్వానం పంపలేదని స్పీకర్ చెప్పారు. విందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్, సామాజిక సంక్షేమ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్, పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్, ఆప్ శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు రాలేదు. -
అసెంబ్లీ స్పీకర్‌కు బెయిలబుల్ వారెంట్
న్యూఢిల్లీ: అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు స్థానిక కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2008లో అప్పటి బీజేపీ నేత అయిన గోయల్ అప్పడు జరిగిన నిరసన కార్య క్రమంలో భాగంగా ఢిల్లీలోని సీపీఐ(ఎమ్) కార్యాలయం ఆస్తుల ధ్వంసం కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ వారెంటు జారీ చేశారు. ఈ అల్లర్లుకు సంబంధించి పోలీసులు గోయల్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తోపాటు 21 మంది పేర్లు పేర్కొంటూ చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై కోర్టులో హాజరుకావాల్సిందిగా గోయల్‌ను జడ్జీ ఆదేశించినా గైర్హాజరవడంతో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శర్మ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణ మే 30కి వాయిదా వేశారు. -
నేడు స్పీకర్ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ జగ్దీశ్ ముఖిని బరిలోకి దింపడంతో స్పీకర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక శుక్రవారం జరుగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జంగ్‌పురా ఎమ్మెల్యే ఎం.ఎస్. ధీర్, బీజేపీ తరఫున జగ్దీశ్ ముఖి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో మైనారిటీ ప్రభుత్వం కొనసాగుతున్నందువల్ల అసెంబ్లీ స్పీకర్ పదవి ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ పదవిని దక్కించుకుని అసెంబ్లీలో తమది పైచేయి చేసుకోవడానికి పోటీపడుతున్నాయి. ఆప్‌కి బయటి నుంచి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఎన్నికపై తన వైఖరిని స్పష్టం చేయలేదు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరితేనే స్పీకర్ ఎన్నికలో ఆప్‌కి మద్దతు ఇస్తానని ఆ పార్టీ అంటోంది.