న్యూఢిల్లీ: అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు స్థానిక కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2008లో అప్పటి బీజేపీ నేత అయిన గోయల్ అప్పడు జరిగిన నిరసన కార్య క్రమంలో భాగంగా ఢిల్లీలోని సీపీఐ(ఎమ్) కార్యాలయం ఆస్తుల ధ్వంసం కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ వారెంటు జారీ చేశారు. ఈ అల్లర్లుకు సంబంధించి పోలీసులు గోయల్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తోపాటు 21 మంది పేర్లు పేర్కొంటూ చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై కోర్టులో హాజరుకావాల్సిందిగా గోయల్‌ను జడ్జీ ఆదేశించినా గైర్హాజరవడంతో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శర్మ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణ మే 30కి వాయిదా వేశారు.
అసెంబ్లీ స్పీకర్‌కు బెయిలబుల్ వారెంట్
Published Sat, Mar 21 2015 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement