bailable warrant
-
మాజీ సీఎస్ సోమేశ్కు బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఒక ప్లాట్‌కు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టుకు హాజరుకావాలని పలుమార్లు ఆదేశించినా.. రాకపోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది. హౌసింగ్ సొసైటీ వ్యవహారంలో కోర్టు తీర్పు అమలు చేయనందుకు సోమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖపట్నంకు చెందిన జయరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మాజీ సీఎస్‌కు బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. -
సల్మాన్ ఖాన్‌పై వారెంట్.. కొట్టివేత
సాక్షి, ముంబై : బాలీవుడ్ సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో దాఖలు చేసిన వారెంట్‌ను ముంబై సెషన్స్ కోర్టు శనివారం కొట్టేసింది. ఈ కేసులో బాంబే హైకోర్టు ఆదేశాలనుసారం సల్మాన్ వ్యవహరించకపోవటంతో ఈ నెల 4వ తేదీన కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. అయితే శనివారం కోర్టుకు హాజరైన సల్మాన్.. ఆ ప్రక్రియను పూర్తి చేశారు. షూరిటీ ప్రక్రియ.. హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు వెలువరించే సమయంలో నిందితుడు షూరిటీని సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మరో కొత్త షూరిటీ పేరుతో రెన్యువల్ చేయాల్సి ఉంది. దీంతో సల్మాన్ తన బాడీగార్డ్ గుర్మీత్‌సింగ్ జోలీ అలియాస్ షేరా పేరును కోర్టుకు సమర్పించాడు. అయితే అందుకు సంబంధించిన అధికార ప్రక్రియను మాత్రం సల్మాన్ పూర్తి చేయలేదు. దీంతో ఏప్రిల్ 4న సెషన్స్ కోర్టు సల్మాన్‌కు బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. దీనిపై సల్మాన్ కోర్టును అభ్యర్థించటంతో ఏప్రిల్ 11న దానిపై స్టే విధిస్తూ.. షూరిటీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏప్రిల్ 25వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం కోర్టుకు హాజరైన సల్మాన్.. షేరాతో ఆ ఫామ్‌లపై సంతకాలు చేయించాడు. దీంతో కోర్టు వారెంట్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. హిట్ అండ్ రన్ కేసు నేపథ్యం... 2002లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై నుంచి సల్మాన్ తన కారును పోనివ్వటంతో ఒకరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 13 ఏళ్ల విచారణ తర్వాత బాంబే సెషన్స్ కోర్టు సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ మే 2015లో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ సల్మాన్ హైకోర్టును ఆశ్రయించగా.. డిసెంబర్ 2015లో కోర్టు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... అది పెండింగ్‌లో ఉంది. -
సుప్రీం కోర్టుపై హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
-
సుప్రీం కోర్టుపై హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్.. సుప్రీం కోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు లేదని అన్నారు. సుప్రీం కోర్టు సుప్రీమేమీ కాదని వ్యాఖ్యానించారు. తాను దళితుడు కాబట్టే టార్గెట్ చేశారని, తన జీవితాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. శుక్రవారం కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు అరెస్ట్ వారెంట్ చేయడంపై జస్టిస్ కర్ణన్ స్పందించారు. మీడియాతో జస్టిస్ కర్ణన్ మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయమూర్తులు పనివాళ్లు కాదని అన్నారు. 8 ఏళ్ల క్రితం తాను అవినీతి జడ్జిలపై ఫిర్యాదు చేశానని, హైకోర్టులో ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. ప్రస్తుత, మాజీ జడ్జిలు కొందరు అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. జస్టిస్ కర్ణన్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేశారని మద్రాస్ హైకోర్టు జడ్జి భార్య గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణకు హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించగా.. జస్టిస్ కర్ణన్ వెళ్లలేదు. దేశ న్యాయచరిత్రలో ఓ హైకోర్టు జడ్జికి కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేయడం ఇదే తొలిసారి. మద్రాస్ హైకోర్టు జడ్జిలు జస్టిస్ కర్ణన్‌కు వ్యతిరేకంగా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడంతో ఆయన్ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీ చేశారు. కోల్‌కతా హైకోర్టు జడ్జికి అరెస్ట్ వారెంట్ -
కోల్‌కతా హైకోర్టు జడ్జికి అరెస్ట్ వారెంట్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు విచారణకు హాజరు కానందుకు సుప్రీం కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణన్‌కు వారెంట్ అందజేయాలని పశ్చిమబెంగాల్ డీజీపీని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నెల 31న కోర్టుకు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. -
ఎన్నికలయ్యాక హాజరవుతా.. సుప్రీంతో ఆజంఖాన్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ వివాదాస్పద మంత్రి ఆజం ఖాన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. తనకు అలహాబాద్ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఉన్నత న్యాయ స్థానం ఆశ్రయించారు. రాష్ట్రానికి చెందిన జల్ నిఘం సంస్థకు గతంలో ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా వ్యవహరించిన ఆజం ఖాన్‌పై అక్రమాల కేసు నమోదైంది. దీనికి సంబంధించి కోర్టుకు హాజరుకాకపోవడంతో అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనకు బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. దీంతో ఆజం ఖాన్ తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంలో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ బెంచ్‌కు తన పిటిషన్ ఇస్తూ మార్చి 11నాటికి తన క్లెయింట్(ఆజం ఖాన్) హైకోర్టుకు హాజరవుతారని, ప్రస్తుతం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అనుమతివ్వాలని అందులో కోరారు. దీనిపై ఈ రోజు మధ్యాహ్నం 2గంటల తర్వాత కోర్టు నిర్ణయం వెలువరించనుంది. -
అసెంబ్లీ స్పీకర్‌కు బెయిలబుల్ వారెంట్
న్యూఢిల్లీ: అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు స్థానిక కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2008లో అప్పటి బీజేపీ నేత అయిన గోయల్ అప్పడు జరిగిన నిరసన కార్య క్రమంలో భాగంగా ఢిల్లీలోని సీపీఐ(ఎమ్) కార్యాలయం ఆస్తుల ధ్వంసం కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ వారెంటు జారీ చేశారు. ఈ అల్లర్లుకు సంబంధించి పోలీసులు గోయల్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తోపాటు 21 మంది పేర్లు పేర్కొంటూ చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై కోర్టులో హాజరుకావాల్సిందిగా గోయల్‌ను జడ్జీ ఆదేశించినా గైర్హాజరవడంతో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శర్మ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణ మే 30కి వాయిదా వేశారు. -
హర్షకుమార్కు నాన్ బెయిలబుల్ వారంట్
విశాఖ: కులంపేరుతో దూషించిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కు కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 2004లో ఓ వేడుక కార్యక్రమం లో స్వరూప్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించినట్లు ఆయనపై త్రీటౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న విచారణకు హర్షకుమార్గానీ, ఆయన న్యాయవాదిగానీ హాజ రుకాలేదు. దీంతో హర్షకుమార్కు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీచేశారు.