కేజ్రీవాల్‌పై మరో అవినీతి పిడుగు! | subramanian swamy letter to delhi lg on Kejriwal corruption | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌పై మరో అవినీతి పిడుగు!

Published Tue, May 9 2017 9:03 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

కేజ్రీవాల్‌పై మరో అవినీతి పిడుగు!

కేజ్రీవాల్‌పై మరో అవినీతి పిడుగు!

న్యూఢిల్లీ: ఆప్‌ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తన కళ్లముందు మంత్రి సత్యేంద్రజైన్ నుంచి రూ.2 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించి తిరుగుబాటు చేయగా.. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరో అవినీతి ఆరోపణను తెరపైకి తెచ్చారు. కేజ్రీవాల్ ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి రెండు కోట్లు లంచం తీసుకున్నారని సుబ్రమణ్యస్వామి అన్నారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్ లంచం తీసుకున్నారని, ఆయన అవినీతిపై విచారణ చేపట్టాలని తన లేఖలో స్వామి డిమాండ్ చేశారు.

రూ.50 లక్షల చొప్పున నాలుగు దఫాలుగా కేజ్రీవాల్ ఆ నగదును తీసుకున్నారని 'క్విడ్ ప్రొకో'లో భాగంగా అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. గతంలోనే ఢిల్లీ ఎల్జీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లానని, విచారణకు ఆదేశించని కారణంగా ఈసారి లేఖాస్త్రం సంధించినట్లు వివరించారు. కేజ్రీవాల్‌పై చేసిన ఆరోపణలకుగానూ తనవద్ద సాక్ష్యాలు ఉన్నాయని, ఎల్జీ విచారణకు ఆదేశిస్తారని సుబ్రమణ్యస్వామి ఆశాభవం వ్యక్తంచేశారు. ఇప్పటికే కపిల్ మిశ్రా ఆరోపణలపై దర్యాప్తు జరిపి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఏసీబీని ఎల్జీ బైజల్ ఆదేశించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement