![Delhi Schools to Reopen Remaining Classes in Phased Manner From November - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/30/Delhi-Schools.jpg.webp?itok=h-bVY9rq)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నియంత్రణలో ఉన్నందున, దశల వారీగా మిగిలిన తరగతుల కోసం పాఠశాలలను తిరిగి తెరవాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నిర్ణయించింది. బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన జరిగిన డీడీఎంఏ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నర్సరీ నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలను నవంబర్ మొదటి వారంలో తిరిగి తెరవనున్నారు. దీపావళి పండుగ తర్వాత అధికార యంత్రాంగం దశలవారీగా పునః ప్రారంభించే విధానాలను నిర్ణయిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు సెప్టెంబర్ 1 నుంచి దశలవారీగా తెరుచుకున్నాయి. విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్ల వాడకం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి అన్ని కోవిడ్–19 ప్రోటోకాల్‌లను పాటిస్తూ తరగతులు జరుగుతున్నాయి. దీనితో పాటు రాంలీలా, దసరా, దుర్గాపూజ పండుగలను సైతం సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని సూచించారు. అంతేగాక కోవిడ్ ప్రోటోకాల్స్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని ఢిల్లీ పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. (చదవండి: జండర్ న్యూట్రల్ వ్యాక్సిన్ వచ్చేసింది)
Comments
Please login to add a commentAdd a comment