
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడి చర్యలపై ఢిల్లీ సర్కార్ తీరును సర్వోన్నత న్యాయస్ధానం తీవ్రంగా తప్పుపట్టింది. ఆస్పత్రుల్లో కోవిడ్-19 రోగులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తూ ఢిల్లీ ప్రభుత్వ నిర్వాకం పట్ల సుప్రీంకోర్టు మండిపడింది. కరోనా రోగులకు సరైన చికిత్స ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చర్యల్లో వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం కరోనా టెస్టుల సంఖ్య తగ్గించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే కరోనా పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచాలని ఆదేశించింది.
ఇక మహమ్మారి బారినపడి మరణించిన వారి మృతదేహాల నిర్వహణ అమానుషంగా ఉందని వ్యాఖ్యానించింది. కరోనా కట్టడి చర్యలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. చదవండి : షాకిచ్చిన కోర్టు.. ఐదు లక్షల ఫైన్
Comments
Please login to add a commentAdd a comment