* వీవీఐపీలు, మహిళలకు మినహాయింపు
* నేటినుంచి ఢిల్లీలో ‘సరి-బేసి’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటైన ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘సరి-బేసి’పథకం నేటినుంచి మొదలుకానుంది. వాహనాల నెంబరు చివరన ఉన్న సంఖ్య ఆధారంగా సరి తేదీల్లో (2,4,6,8,0) సరిసంఖ్య వాహనాలను, బేసీ తేదీల్లో బేసీ సంఖ్య(1,3,5,7,9) వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తారు. మొదటిరోజైన శుక్రవారం బేసి సంఖ్య వాహనాలు మాత్రమే రోడ్లపైకి రానున్నాయి. ద్విచక్రవాహనాలు, మహిళలకు, వీవీఐపీలు, సీఎన్‌జీ వాహనాలకు ఈ విధానం నుంచి సర్కారు మినహాయింపు ఇచ్చింది.
దీనిపై ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించేంతవరకు మాత్రమే ఈ విధానం అమలుచేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ పథకం అమలు వల్ల ఢిల్లీలో 10 శాతం కాలుష్యం తగ్గుతుందని అంచనా. కాలుష్యానికి కారణమైన ట్రక్కుల (వీటికారణంగానే 46 శాతం కాలుష్యం)పైనే సర్కారు దృష్టిపెట్టింది.
ప్రత్యామ్నాయం రెడీ
ప్రజా రవాణాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెట్రో రైలు, డీటీసీ బస్సుల సేవలను విస్తృత పరిచింది. శుక్రవారం నుంచి మెట్రోరైళ్లను అదనంగా 365 ట్రిప్పులు నడుపుతున్నారు. అదనంగా 3వేల బస్సులు రోడ్డుక్కెతున్నాయి. కాగా, ఈ పరిస్థితితో తమ పంట పండినట్లేనని ఆటోవాలాలు సంబరపడుతున్నారు. అయితే ఒక కారును కేవలం 15 రోజులు మాత్రమే రోడ్లపైకి రావటం వల్ల టాక్సీ డ్రైవర్ల కుటుంబాలు వీధినపడనున్నాయి.
అయితే.. ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్రప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. తరచూ కేంద్రంతో ఘర్షణకు దిగుతున్న కేజ్రీవాల్‌కు పోలీసులు ఏ మేరకు సహకరిస్తారనేది అనుమానమే. దీంతోపాటు.. వాహనదారులు కూడా ఈ విధానంపై ఓ అవగాహనకు రాలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేజ్రీవాల్ ప్రయోగం సక్సెస్ అవుతుందా అనేది అనుమానంగా మారింది.
‘బేసి’తో మొదలు
Published Fri, Jan 1 2016 3:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM
Advertisement
Advertisement