న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఆశాకిరణ్ షెల్టర్‌హోమ్‌లో స్వల్ప వ్యవధిలో 14 మంది మృతి చెందడం యాదృచ్ఛికం కాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. షెల్టర్‌హోమ్‌లో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది.
జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్‌రావ్ గేదెలతో కూడిన ధర్మాసనం ఈ కేసును సోమవారం(ఆగస్టు5) విచారించింది. ఈ సందర్భంగా బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. షెల్టర్ హోమ్‌లో ఉండాల్సినదాని కంటే ఎక్కువ మంది ఉంటే కొందరిని అక్కడి నుంచి తరలించాలని సూచించింది.
షెల్టర్‌హోమ్‌లోని మంచినీటి పైపులైన్‌లతో పాటు డ్రైనేజీ పైపులైన్‌లను పరిశీలించాలని, అక్కడి తాగునీటి నాణ్యతను పరీక్షించాలని ఢిల్లీ జల్‌బోర్డును ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి షెల్టర్‌హోమ్‌లో మొత్తం 25 మంది చనిపోగా కేవలం జులైలోనే 14మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment