మోదీపైకి తూటాలు ఎక్కుపెట్టిన 'ఏకే'!
'టాక్ టు ఏకే'.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రశ్న-జవాబుల రూపంలో ప్రజలకు తెలియజేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన 'వెబ్ టాక్ షో' ఇది. ఆదివారం లైవ్ వెబ్ ప్రసారంలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఊహించినట్టే ఢిల్లీ వాసుల నుంచి భారీ స్పందన వచ్చింది.
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై మరోసారి ఘాటైన విమర్శలతో విరుచుకుపడటానికి ఈ టాక్ షోను కేజ్రీవాల్ వేదికగా చేసుకున్నారు. మోదీ సర్కారు హస్తినలో భారత్-పాకిస్థాన్ లాంటి పరిస్థితిని సృష్టిస్తున్నదని మండిపడ్డారు. కేజ్రీవాల్ టాక్ షోలోని హైలెట్స్ ఇవే..
-
ఢిల్లీలో పరిపాలన స్తంభింపజేయాలని మోదీ సర్కారు భావిస్తోంది. మేం నిజాయితీగా, నిర్భీతిగా ఉండటం మోదీ సర్కారుకు ఇబ్బందిగా మారినట్టుంది. అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆప్ ఎమ్మెల్యేలకు చెప్పాను.
-
గుజరాత్ లో ఆప్ కు భారీ స్పందన లభిస్తోంది. ప్రజలు డిమాండ్ చేస్తే వచ్చే ఏడాది గుజరాత్ లో జరిగే ఎన్నికల్లో మేం పోటీ చేస్తాం.
- ఈ ఏడాది శీతాకాలంలో మళ్లీ ఢిల్లీలో 'సరి-బేసి' నంబర్ ప్లేట్ల విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నాం.