![ఏసీబీ చీఫ్ అధికారాల్లో కోత! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71435484373_625x300_0.jpg.webp?itok=jh-urF8-)
ఏసీబీ చీఫ్ అధికారాల్లో కోత!
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అండతో వచ్చిన ఏసీబీ చీఫ్ ఎంకే మీనా అధికారాలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కోత పెట్టింది. ప్రస్తుతానికి కేవలం శిక్షణ వ్యవహారాలు మాత్రమే చూసుకోవాలని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల విచారణను మాత్రం నియామకం వ్యవహారాన్ని హైకోర్టు నిర్ధారించేవరకు ఆపాలని తెలిపింది.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ అండదండలు ఉన్న ఏసీబీ అదనపు కమిషనర్ ఎస్ఎస్ యాదవ్ కేసుల పర్యవేక్షణను చూసుకోవాలని చెప్పింది. మీనాను ఆఫీసులోకి రానివ్వకుండా అడ్డుకోవాలని ఢిల్లీ సర్కారు కోరినా.. అలా ఉత్తర్వులు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. యాదవ్ నేరుగా తనకే రిపోర్ట్ చేయాలని విజిలెన్స్ డైరెక్టర్ సుకేష్ కుమార్ జైన్ కూడా చెప్పారు. విజిలెన్స్ శాఖ డైరెక్టరే ఏసీబీకి కూడా అధినేతగా ఉంటారని ఢిల్లీ సర్కారు చెబుతోంది.