Mk Meena
-
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. 3,500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో అర్థరాత్రి 2 గంటలకు పూర్తైందన్నారు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు భద్రపరిచినట్లుచెప్పారు.రాష్ట్రంలో తుదిపోలింగ్ శాతం వివరాలను ఏపీ సీఈవో బుధవారం వెల్లడించారు. అయితే అసెంబ్లీకి ఓటేసి కొందరు లోక్‌సభకు ఓటేయలేదని తెలిపారు ఎంకే మీనా. పార్లమెంట్‌కు 3 కోట్ల 33 లక్షల 4560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. దర్శిలో అత్యధికంగా 90.91 శాతం.. తిరుపతిలో అత్యల్పంగా 63.32 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం జరిగిందని.. నాలుగు దశల్లో ఏ రాష్ట్రంలోనూ ఇంత పోలింగ్ జరగలేదని అన్నారు.‘కుప్పంలో 89.88 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్ నమోదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.20 శాతం నమోదు. 2014 ఎన్నికల్లో 78.41 శాతం. 2019 ఎన్నికల్లో 79.77శాతం పోలింగ్ నమోదు. అత్యల్పంగా విశాఖ లోక్‌సభ స్థానంలో 71.11 శాతం పోలింగ్. గత ఎన్నికలతో పోలిస్తే 2.09శాతం పోలింగ్ పెరిగిందినాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. అల్లర్లు సృష్టించిన నిందితులను ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు. ఈవీలఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తాం. 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చు’ అని పేర్కొన్నారు. -
ఉప ముఖ్యమంత్రికీ నోటీసులిస్తాం: ఏసీబీ
ఢిల్లీ మహిళ కమిషన్‌లో ఇష్టం వచ్చినట్లు అక్రమంగా నియామకాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌పై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ఈ విషయంలో తాము దర్యాప్తు చేస్తున్నామని, దీంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తామని ఏసీబీ చీఫ్ ఎంకే మీనా తెలిపారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు కూడా ఈ కేసులో నోటీసులు ఇస్తామని చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (డి), ఐపీసీలోని 409, 120బి, సెక్షన్ల కింద స్వాతి మలివాల్‌పై కేసులు నమోదు చేసినట్లు మరో అధికారి వెల్లడించారు. స్వాతిని ఏసీబీ అధికారులు సోమవారం ఉదయం దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు. దాంతోపాటు మరో్ 27 ప్రశ్నలు చేతికిచ్చి, వాటికి వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని తెలిపారు. ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ చేసిన ఫిర్యాదుతో ఏసీబీ స్పందించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో మహిళా కమిషన్‌ను నింపేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. తగిన అర్హతలు లేకుండా కమిషన్‌లో చేరిన 85 మంది పేర్లను కూడా ఆమె జత చేశారు. మహిళా కమిషన్‌లో అంతమందిని ఎలా నియమించారంటూ తనను వాళ్లు ప్రశ్నించారని స్వాతి మలివాల్ చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన నవీన్ జైహింద్ భార్యే స్వాతి. ఇటీవలి కాలంలో మహిళా భద్రతపై తాము పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నామని, తమ నోరు మూయించడానికే ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. -
ఏసీబీ చీఫ్ అధికారాల్లో కోత!
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అండతో వచ్చిన ఏసీబీ చీఫ్ ఎంకే మీనా అధికారాలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కోత పెట్టింది. ప్రస్తుతానికి కేవలం శిక్షణ వ్యవహారాలు మాత్రమే చూసుకోవాలని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల విచారణను మాత్రం నియామకం వ్యవహారాన్ని హైకోర్టు నిర్ధారించేవరకు ఆపాలని తెలిపింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అండదండలు ఉన్న ఏసీబీ అదనపు కమిషనర్ ఎస్ఎస్ యాదవ్ కేసుల పర్యవేక్షణను చూసుకోవాలని చెప్పింది. మీనాను ఆఫీసులోకి రానివ్వకుండా అడ్డుకోవాలని ఢిల్లీ సర్కారు కోరినా.. అలా ఉత్తర్వులు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. యాదవ్ నేరుగా తనకే రిపోర్ట్ చేయాలని విజిలెన్స్ డైరెక్టర్ సుకేష్ కుమార్ జైన్ కూడా చెప్పారు. విజిలెన్స్ శాఖ డైరెక్టరే ఏసీబీకి కూడా అధినేతగా ఉంటారని ఢిల్లీ సర్కారు చెబుతోంది. -
‘మీనాను ఏసీబీ కార్యాలయానికి రానివ్వొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) చీఫ్‌గా ఎంకే మీనాను నియమించడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు ఢిల్లీ హైకోర్టులో శనివారం సవాలు చేసింది. మీనాను ఏసీబీ కార్యాలయానికి రాకుండా, ఆ సంస్థ విధుల్లో జోక్యం చేసుకోకుండా నిలువరిస్తూ ఆదేశాలివ్వాలని మధ్యంతర పిటిషన్ వేసింది. మీనా తనను బెదిరిస్తున్నారని ఆప్ ప్రభుత్వం ద్వారా ఏసీబీగా నియమితులైన ఎస్ఎస్ యాదవ్ ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ‘రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఏసీబీ చీఫ్‌ను నియమించే అధికారం మాకే ఉంది. ఏసీబీలో జాయింట్ కమిషనర్ పోస్టే లేదు. అలాంటప్పుడు ఆ హోదా ఉన్న మీనాను సంస్థ చీఫ్‌గా నియమించడం సరికాదు’ అని వివరించింది. మీనా ఏసీబీ, విజిలెన్స్ అధికారులను బెదిరిస్తున్నారని, పోలీసుల ప్రమేయమున్న అవినీతి కేసులను ఏసీబీ నుంచి ఢిల్లీ పోలీసు విభాగానికి బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. హవాలా కేసులో మీనాపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా, ఆయనను ఆ సంస్థ చీఫ్‌గా నియమించడం సరికాదని పేర్కొంది. కాగా, తాను రూపొందించిన ఆప్ లోగోను అధికారిక కార్యక్రమాల నుంచి ఉపసంహరించుకోవాలని ఆప్ మాజీ కార్యకర్త సునీల్ లాల్.. ఢిల్లీ సీఎం, ఆప్ నేత కేజ్రీవాల్‌కు నోటీసు పంపారు.