సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. 3,500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో అర్థరాత్రి 2 గంటలకు పూర్తైందన్నారు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు భద్రపరిచినట్లుచెప్పారు.
రాష్ట్రంలో తుదిపోలింగ్ శాతం వివరాలను ఏపీ సీఈవో బుధవారం వెల్లడించారు. అయితే అసెంబ్లీకి ఓటేసి కొందరు లోక్‌సభకు ఓటేయలేదని తెలిపారు ఎంకే మీనా. పార్లమెంట్‌కు 3 కోట్ల 33 లక్షల 4560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. దర్శిలో అత్యధికంగా 90.91 శాతం.. తిరుపతిలో అత్యల్పంగా 63.32 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం జరిగిందని.. నాలుగు దశల్లో ఏ రాష్ట్రంలోనూ ఇంత పోలింగ్ జరగలేదని అన్నారు.
‘కుప్పంలో 89.88 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్ నమోదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.20 శాతం నమోదు. 2014 ఎన్నికల్లో 78.41 శాతం. 2019 ఎన్నికల్లో 79.77శాతం పోలింగ్ నమోదు. అత్యల్పంగా విశాఖ లోక్‌సభ స్థానంలో 71.11 శాతం పోలింగ్. గత ఎన్నికలతో పోలిస్తే 2.09శాతం పోలింగ్ పెరిగింది
నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. అల్లర్లు సృష్టించిన నిందితులను ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు. ఈవీలఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తాం. 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment