కేజ్రీవాల్‌‌ ప్రభుత్వం కీలక నిర్ణయం | Delhi Govt Cancels All State University Exams Amid Corona Virus Crisis | Sakshi
Sakshi News home page

కరోనా: కేజ్రీవాల్‌‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

Published Sat, Jul 11 2020 4:44 PM | Last Updated on Sat, Jul 11 2020 4:53 PM

Delhi Govt Cancels All State University Exams Amid Corona Virus Crisis - Sakshi

మనీష్‌ సిసోడియా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ స్టేట్ యూనివర్సిటీల పరిధిలోని వివిధ కోర్సులలో చివరి సంవత్సరం సహా అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేజ్రీవాల్‌ ప్రభుత్వం తెలిపింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఢిల్లీలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పరీక్షలు ఉండవని, గత పరీక్షల మూల్యాంకనం ఆధారంగా విద్యార్థుల ఫలితాలను సిద్ధం చేస్తామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పరీక్షలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేజ్రీవాల్‌ లేఖ రాశారు. అయితే ఈ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో నిర్వహించే పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

చదవండి: నేనేమీ రిమోట్ కంట్రోల్‌ని కాదు: శ‌ర‌ద్ ప‌వార్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement