exam cancelled
-
యూజీ నీట్ అభ్యర్థులకు కోచింగ్ సెంటర్ల వల!
సాక్షి, హైదరాబాద్: ‘యూజీ నీట్ పరీక్ష రద్దు అవుతుంది. కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించనుంది. అందుకే షార్ట్‌టర్మ్ కోర్సు ప్రారంభించాం. మీ అమ్మాయిని వెంటనే చేరి్పస్తే ఫీజు కూడా రాయితీ ఇస్తాం’ రెండ్రోజుల కిందట ఓ ప్రముఖ నీట్ కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థి తండ్రికి వచి్చన ఫోన్‌కాల్ ఇది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి యూజీ నీట్ ప్రవేశాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. నీట్ పరీక్షలో కొందరు అదనపు మార్కుల ప్రయోజనం, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, టాప్ ర్యాంకులపై రగడ తదితర అంశాలతో దేశవ్యాప్తంగా తీవ్ర అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ పరిస్థితిని కొన్ని కోచింగ్ సెంటర్లు క్యాష్ చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. నీట్ పరీక్ష రద్దు కానుందని, మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారానికి ఊపందిస్తూ షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభిస్తున్నాయి. నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులను ఈ కోర్సుల్లో చేరాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు, ఎస్ఎంఎస్ల ద్వారా ఫీజు తక్కువంటూ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మే 5న జరిగిన యూజీ నీట్–2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 571 నగరాల్లో 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో రాష్ట్రం నుంచి 1.05 లక్షల మంది పరీక్ష రాసినట్లు అంచనా. రూ.25 వేల నుంచి రూ.30 వేల ఫీజు యూజీ నీట్–2024 ప్రవేశాల ప్రక్రియ జూలై 6 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. కానీ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై తీవ్ర దుమారం కావడం, ప్రతిపక్షాల నిరసన ఏకంగా పార్లమెంటును స్తంభించే పరిస్థితి నెలకొనడంతో అన్ని వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజురోజుకు తీగలాగితే డొంక కదిలినట్లు కనిపిస్తుండటంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తారా? లేదా కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా? అనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు. మరో వారం రోజుల్లో నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంకా రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు మెరుగైన మార్కులు వచ్చినప్పటికీ విద్యార్థులకు లక్షల్లో ర్యాంకులు రావడంతో సీటు వస్తుందా? రాదా? అంచనా వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో అప్పటివరకు ఖాళీగా ఉండలేక షార్ట్‌టర్మ్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. షార్ట్‌టర్మ్ కోర్సు కోసం ఒక్కో కోచింగ్ సెంటర్ రూ.25 వేల చొప్పున వసూలు చేస్తుండగా.. కొన్నిమాత్రం రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కోర్సుల్లో చేరి డబ్బులు వృథా చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. -
యూజీసీ–నెట్ రద్దు
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన నీట్ పరీక్షలో బయల్పడిన అవకతవకల నీలినీడలు యూజీసీ–నెట్ పరీక్ష పైనా పడ్డాయి. దీంతో మంగళవారం నిర్వహించిన యూజీసీ–నెట్ పరీక్షను రద్దుచేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కరోజులోనే ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్(ఓఎంఆర్) విధానంలో దేశవ్యాప్తంగా 317 నగరాలు, పట్టణాల్లోని 1,205 పరీక్షా కేంద్రాల్లో యూజీసీ–నెట్ పరీక్ష మంగళవారం జరిగిన విషయం తెల్సిందే. త్వరలో మళ్లీ నెట్ పరీక్షను నిర్వహిస్తారని, త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ నెట్ పరీక్ష విధానంలో అత్యంత పారదర్శకత, సమగ్రత, గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. పరీక్షలో అక్రమాలు జరిగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం మేరకు ‘యూజీసీ–నెట్ జూన్ 2024’ను రద్దుచేస్తున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. ఈ ఏడాది నెట్ పరీక్షకు 11,21,225 మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం పూర్తయిన ఈ పరీక్షను 9,08,580 మంది అభ్యర్థులు రాశారు. నెట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నెట్ పరీక్షలో అక్రమాలు జరిగి ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కు ప్రభుత్వ సైబర్ నిఘా సంస్థల సమాచారం అందడంతో ఆ మేరకు పరీక్షకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ఈ వివరాలను యూజీసీకి పంపింది. ఐ4సీలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలైటిక్స్ విభాగం సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించి యూజీసీకి అందజేసింది. ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల దాడులపై సమాచారం ఇవ్వడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తుంది. ఐ4సీ అనేది కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది పరీక్షల సంబంధ వ్యవహారాలను చూస్తుంది. నీట్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే ఈ నెట్ పరీక్షనూ చేపట్టింది. యూజీసీ–నెట్ ఎందుకు రాస్తారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్– నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్( యూజీసీ–నెట్) పరీక్షలో ఉత్తీర్ణులైతే సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనకు అవకాశం లభిస్తుంది. పరిశోధన వైపు వెళ్లొచ్చు లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధనారంగం వైపూ వెళ్లొచ్చు. దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరొచ్చు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో నడిచే ప్రయోగ, పరిశోధనాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరొచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది. ఇలా శాస్త్రవేత్తగా ఎదగొచ్చు. పీహెచ్డీ చేసేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వరంగ ఓఎన్జీసీ వంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. నెట్‌కు క్వాలిఫై అయిన వారికి విదేశాల్లోనూ చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. 80కిపైగా సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు. -
గ్రూప్–1 అభ్యర్థుల్లో గుబులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దుకావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓసారి రద్దుకావడంతో రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలంటే ఎలాగని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కష్టపడి చదివామని, వేలు, లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకున్నామని.. ఇప్పుడంతా వృధా అయినట్లే అని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించినా అది ఎప్పుడు ఉంటుందో, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వాపోతున్నారు. లీకేజీతో ఓసారి.. నిర్లక్ష్యంతో మరోసారి వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీకాగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కానీ టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం బయటపడటంతో గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అందరికీ తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి ప్రిలిమ్స్‌కు 3,09,323 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా.. 2,33,248 మంది పరీక్ష రాశారు. ఈసారి ప్రిలిమ్స్ నిర్వహణ లోపభూయిష్టంగా, అక్రమాలకు తావిచ్చేలా ఉందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రెండో ప్రిలిమ్స్‌నూ రద్దు చేయాలని సర్కారును ఆదేశించింది. రద్దయితే వచ్చే ఏడాదే? గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే తర్వాత రెండు నెలల పాటు అధికార యంత్రాంగం ఎన్నికల పనిలోనే బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలూ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మే వరకు గ్రూప్–1 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఆగమాగం గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతోనే లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవడంపై దృష్టిపెట్టారు. చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నవారు అది మానేసి, కొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టి పరీక్ష కోసం శిక్షణ తీసుకున్నారు. దీనికితోడు ఏళ్లుగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు మరింత ఫోకస్ పెట్టారు. పకడ్బందీగా చదువుకుని ప్రిలిమ్స్ పరీక్షలు రాశారు. కానీ లీకేజీ వ్యవహారంతో పరీక్ష రద్దుకావడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అయితే టీఎస్పీఎస్సీ వేగంగా చర్యలు చేపట్టి, తిరిగి ప్రిలిమ్స్ నిర్వహించే తేదీని ప్రకటించడంతో.. అభ్యర్థులంతా ఎంతో ఆశతో రెండోసారి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అలా ఈ ఏడాది జూన్ 11న పరీక్ష రాశారు. ఫలితాల విడుదల, మెయిన్స్‌కు 1ః50 నిష్పత్తిలో ఎంపిక జాబితా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. తాజాగా హైకోర్టు తీర్పుతో దిక్కుతోచని స్థితి లో పడ్డారు. మూడోసారి పరీక్ష కోసం చదవాల్సి రావడమేంటన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే భయంగా ఉంది గ్రూప్–1 ఉద్యోగం సాధించాలని రెండేళ్లుగా సన్నద్ధమవుతున్నాను. ప్రిలిమ్స్ రద్దు తో సమయం, డబ్బు వృథా అయ్యాయి. మరోసారి పరీక్ష రాయాలంటేనే భయం వేస్తోంది. పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి లీకేజీ, మరోసారి నిర్వహణ లోపాలతో రద్దు చేశారు. మొదటిసారి ప్రశ్నపత్రంలో 5 ప్రశ్నలు, రెండోసారి 7 ప్రశ్నలు తొలగించారు. ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? – బి.అనిల్ కుమార్, హనుమకొండ -
విద్యాసంస్థలకు సెలవులు.. పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలు పడుతుండటంతో ప్రభుత్వం గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వానలు తగ్గకపోతే శనివారం కూడా సెలవు ఇవ్వాలని క్షేత్రస్థాయిలో అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన పలు పరీక్షలను రద్దు చేశారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేశారు. వీటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. ఇక ఇంజనీరింగ్ సహా వివిధ రకాల కౌన్సెలింగ్‌ల తేదీలను మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు. అకస్మాత్తుగా సెలవు నిర్ణయంతో.. రెండు రోజులుగా వానలు పడుతుండటంతో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలన్న విజ్ఞప్తులు వచ్చాయి. కానీ దీనిపై బుధవారం రాత్రి వరకు కూడా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్టుగా గురువారం ఉదయం ప్రకటించారు. ఇది కూడా జిల్లా అధికారులకు మెసేజీల ద్వారా తెలిపారు. మీడియాకు సమాచారం ఇవ్వలేదు. దీనితో సెలవుల విషయం తెలిసేసరికే విద్యార్థులంతా వానలో ఇబ్బందిపడుతూనే స్కూళ్లకు చేరారు. కొన్నిచోట్ల అప్పటికప్పుడే విద్యార్థులను తిప్పి పంపేయగా.. మరికొన్ని విద్యా సంస్థలు ఒంటి గంట వరకు ఇళ్లకు పంపించాయి. ఆటోల్లో, సైకిళ్లపై, నడుచుకుంటూ బడులకు వచ్చే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సెలవు విషయం తెలియడంతో తల్లిదండ్రులు హడావుడిగా స్కూళ్ల వద్దకు వచ్చి పిల్లలను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంటర్నెట్ ఇబ్బందితో.. ఎంసెట్ తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఇటీవలే మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. ఈ నెల 22 నాటికల్లా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. రెండు రోజులుగా వానలతో పలుచోట్ల విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడింది. దీనితో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నామని, సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉన్నత విద్యా మండలి అధికారి ఒకరు తెలిపారు. ఇక గురువారం జరగాల్సిన టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. హాస్టళ్ల నుంచి ఇళ్లకు.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. చాలాచోట్ల హాస్టళ్ల చుట్టూ నీరు చేరడం, పలుచోట్ల పైకప్పుల నుంచి నీరు కారడంతో ఇబ్బందిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో శుక్ర, శనివారాలు సెలవు ఎడతెరిపిలేని వానల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్నిరకాల విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. వైద్యం, పాల సరఫరా వంటి అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపింది. ప్రైవేటు సంస్థలు కూడా వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖను ఆదేశించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి జీహెచ్ఎంసీ పరిధిలో విద్యాసంస్థలు, ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలకు రెండు రోజుల సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పేపర్ లీక్ కలకలం: మిగతా పరీక్షల రద్దుపై టీఎస్పీఎస్సీ ఏం చేప్తోంది!
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఇంజనీర్ అర్హత పరీక్షను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మిగతా పరీక్షలను కూడా రద్దు చేయాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు ఆ తర్వాత నిర్వహించిన పలు పరీక్షల ప్రశ్నపత్రాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయంటూ అభ్యర్థులతో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళనలు ఉదృతం చేస్తున్నాయి. ఈ దిశగా కమిషన్ కార్యాలయం వద్ద, జిల్లాల్లోనూ తీవ్రస్థాయిలో నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. అయితే టీఎస్పీఎస్సీ మాత్రం దీనిపై స్పష్టమైన వైఖరితోనే ఉంది. సరైన ఆధారాలు ఉంటే పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆదరబాదరా నిర్ణయం తీసుకోలేమని, తొందరపడి, ఒత్తిడికి గురై నిర్ణయాలు తీసుకుంటే అభ్యర్థుల భవిష్యత్తు తీవ్ర గందరగోళంలో పడుతుందని చెబుతున్నాయి. ఇప్పటివరకు కేవలం అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నపత్రం మాత్రమే లీకైనట్లు తేలడంతో, లోతుగా చర్చించి అభ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆ పరీక్షను రద్దు చేసినట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. సిట్ విచారణలో తేలాకే.. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, కంప్యూటర్ల నుంచి సమాచారం తస్కరణపై నమోదైన కేసులపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) దర్యాప్తు ముమ్మరం చేసింది. గత రెండ్రోజులుగా సిట్ సభ్యులు కమిషన్ కార్యాలయంలోని అధికారులను, ఉద్యోగులు, సిబ్బందిని పలు దఫాలుగా విచారిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ విచారణ అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిట్ పరిశీలనలో తేలిన అంశాలు, నిందితుల ఫోన్లు, పెన్‌డ్రైవ్‌ల్లోని సమాచారం తదితరాలపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. ఏఈ పరీక్షను రద్దు చేసిన అధికారులు..మిగతా పరీక్షలకు సంబంధించిన వ్యవహారాన్ని పూర్తిగా నిగ్గుతేలి్చన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. -
పేపర్ లీక్.. పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రద్దు..
జైపూర్: రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. కాగా మే 14వ తేదీన రెండో షిప్టుకు సంబంధించిన ప్రశ్నాపత్నం పరీక్షలకు కొంత సమయం ముందే జొత్వారా పట్టణంలోని ఎగ్జామ్ సెంటర్ నుంచి లీక్ అయింది. దీనిని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మే 14న పరీక్ష రెండవ షిఫ్ట్ సమయంలో జైపూర్‌లోని దివాకర్ పబ్లిక్ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ సమయానికి ముందే పేపర్ కవరు తెరిచారు. దీంతో ఈ షిష్ట్‌లో జరిగన పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించనున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పేపర్ లీక్‌పై కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా రాజస్థాన్ పోలీసులు మే 13 నుంచి మే 16 వరకు కానిస్టేబుల్ పోస్టు కోసం రాత పరీక్షను నిర్వహించారు. చదవండి: ఉచిత ప్రయాణానికి చెల్లు.. 1 నుంచి బస్సుల్లో పోలీసులకూ టికెట్ -
ఎస్ఐ స్కాం: ఆధారాలు దొరక్కుండా చేసేందుకు మొబైల్ ముక్కలు!
బనశంకరి: రాష్ట్ర సర్కారుకు సంకటంగా మారిన ఎస్ఐ పోస్టుల పరీక్షల స్కాంలో అరెస్టయిన దివ్య హగరగి అరెస్టు కావడంతో విచారణ వేగమందుకుంది. ఆమెను శనివారం కూడా సీఐడీ అధికారులు విచారించారు. తన మొబైల్‌ఫోన్ దొరకరాదని పరారీలో ఉన్నప్పుడే బద్దలు కొట్టినట్లు తెలిసింది. కొద్దిరోజుల కిందటే సీఐడీ అధికారులు దివ్య హగరగిని పూణేలో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో మొబైల్ గురించి విచారించగా ఆమె నోరు మెదపలేదు. శనివారం కలబురిగిలో జరిపిన విచారణలో, ఫోన్‌ను పగలగొట్టినట్లు చెప్పింది. మొబైల్లో ఉన్న సాక్ష్యాధారాలు నాశనం చేయడానికే ఇలా చేసినట్లు తెలిసింది. మిగిలిన నిందితుల మొబైల్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిలో సాక్ష్యాధారాల కోసం శోధిస్తున్నారు. అవసరమైతే దివ్యని మళ్లీ పూణే కు తీసుకెళ్లే అవకాశం ఉంది. 18 రోజులూ దేవస్థానాల యాత్ర దివ్య హగరగి దైవ భక్తురాలు. పరారీలో ఉన్న 18 రోజులు ప్రముఖ ఆలయాలను సందర్శించి పూజలు చేసినట్లు తెలిసింది. ఎస్ఐ పరీక్షల్లో అక్రమాలు వెలుగులోకి రాగానే ఏప్రిల్ 10వ తేదీన మధ్యాహ్నం కలబురిగిలో ఇల్లు విడిచిపెట్టింది. అఫ్జలపుర మీదుగా మహారాష్ట్ర సొల్లాపురకు చేరుకుని అక్కడ మొబైల్ స్విచ్చాఫ్ చేసుకుంది. తరువాత ఆన్ చేయలేదు. పారిశ్రామికవేత్త సురేశ్ కాటిగావ సహాయం తీసుకుని ఒక ఫాంహౌస్‌లో రెండురోజులు మకాం వేసింది. సిద్దరామేశ్వర ఆలయం దర్శించి పూణెకి వెళ్లి 5 రోజులు పాటు అక్కడే మకాం వేసింది. తరువాత గుజరాత్‌కు వెళ్లి అక్కడ మూడురోజుల పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసింది. 22వ తేదీ మళ్లీ పుణే కు చేరుకుని అరెస్టయ్యే వరకు రింగ్‌రోడ్డులోని ఒక ఇంట్లో తలదాచుకుంది. పరీక్ష రద్దుపై కాంగ్రెస్ నేతల భగ్గు ఈ కుంభకోణంలో బీజేపీ నేతలు భాగస్వాములుగా ఉన్నారని, వారిని కాపాడటానికి విచారణ నివేదికకు ముందే పరీక్షను రద్దు చేశారని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. బెంగళూరులో మాట్లాడుతూ దివ్య హగరగిని అరెస్ట్ చేసి తీసుకువస్తుండగానే పరీక్ష రద్దును హోంమంత్రి ప్రకటించారన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ పరీక్షలో ఉత్తీర్ణులై పోస్టు కోసం వేచిచూస్తున్న అభ్యర్థులు డీకేని కలిశారు. నిజాయితీగా పరీక్ష రాసి ఉత్తీర్ణులైన తమకు ఎందుకు శిక్ష అని వాపోయారు. ఫ్రీడంపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. మళ్లీ ఎస్ఐ పరీక్ష జరపాలని ప్రభుత్వం ఏ ఆధారంతో నిర్ణయించిందని సీఎల్పీ నేత సిద్దరామయ్య ప్రశ్నించారు. హోంమంత్రి ని తొలగించాలని డిమాండ్ చేశారు. కింగ్‌పిన్ దివ్యహగరగి అరెస్టైన తక్షణం పరీక్ష రద్దు నిర్ణయం తీసుకోవడం వెనుక రహస్యమేమిటన్నారు. నిజాయితీగా పరీక్ష రాసినవారికి న్యాయం చేయాలన్నారు. ఎస్ఐ స్కాంలో హోంమంత్రి అరగజ్ఞానేంద్ర పాత్ర ఉందని కాంగ్రెస్ నేత దినేశ్‌గుండూరావ్ ఆరోపించారు. రూ.3 లక్షలతో ఇంటి నుంచి పరారు పారిపోయే ముందు రూ.3 లక్షలు తీసుకుని వెళ్లిన దివ్య ఎక్కడా ఏటీఎంలో నగదు డ్రా చేయలేదు. ఇలా దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. దివ్య కుటుంబ నేపథ్యం గమనిస్తే చాలా శ్రీమంతులు. అనేక స్కూళ్లు, కాలేజీలు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కలబురిగి చుట్టుపక్కల కోట్లాదిరూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు. రాజకీయంగా మంచి పేరు కలిగి ఉంది. డబ్బు సంపాదనకు, పలుకుబడిని చాటుకోవడానికి ఎస్ఐ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిందని అనుమానాలున్నాయి. (చదవండి: ఎస్ఐ పరీక్షలో అక్రమాలు.. హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు) -
ఎస్ఐ పరీక్షలో అక్రమాలు.. మళ్లీ ఎగ్జామ్
బనశంకరి: ఎస్ఐ పరీక్షల్లో అక్రమాలు వెలుగు చూడటంతో ఆ పరీక్షను రద్దు చేసినట్లు హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ మొత్తం 545 ఎస్ఐ పోస్టులకు 2021 ఆగష్టు 3న రాత పరీక్ష నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా 54,289 మంది అభ్యర్దులు హాజరైనట్లు తెలిపారు. అక్రమాలు చోటుచేసుకున్నట్లు విచారణలో వెలుగుచూడటంతో పరీక్షను రద్దు చేశామన్నారు. కొత్తగా పరీక్ష నిర్వహిస్తామని త్వరలో తేదీ ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే ఎంపికైన వారు కూడా పరీక్ష రాయాలన్నారు. ఎస్ఐ పరీక్షలో కుమ్మక్కైన వారికి మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం ఇచ్చేదిలేదన్నారు. ఇకపై పరీక్షల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బ్లూటూత్ వినియోగించి అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ విచారణలో నిర్ధారణ అయ్యిందని, ఇందులో ఎవరు భాగస్వాములైనప్పటికీ విడిచిపెట్టేదిలేదన్నారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది : ప్రియాంక ఖర్గే దివ్యహాగరగి అరెస్ట్‌పై మాజీమంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఎస్ఐ అభ్యర్థుల నుంచి వసూలు చేసిన కోట్లాదిరూపాయల డబ్బు ఎక్కడికి వెళ్లిందనే దానిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఐడీ బృందం పుణెలో దివ్య హాగరగితో సహా ఆరుగురిని అరెస్ట్‌చేయడాన్ని ప్రియాంక్ ఖర్గే స్వాగతించారు. పరీక్ష కేంద్రాలు కేటాయించడం, డబ్బు ఇచ్చిన అభ్యర్థులకు నిర్దిష్టమైన పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే సదుపాయం కల్పించడం లాంటి పనులు చేపట్టడం వెనుక ప్రముఖులు ఉన్నారని, వారిపై సీఐడీ విచారణ చేపట్టలేదన్నారు. అసలైన తిమింగలాలను పట్టుకోవాలన్నారు. కింగ్‌పిన్ దివ్య అరెస్ట్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాల కేసులో ప్రధాన సూత్రధారి దివ్య హాగరగి, కలబురిగి జ్ఞానజ్యోతి విద్యాసంస్థ ప్రిన్సిపాల్ కాశీనాథ్, ఇని్వజిలేటర్లు అర్చన, సునంద, ఎస్ఐ అభ్యర్థిని శాంతాబాయి, వీరికి ఆశ్రయమిచ్చిన పారిశ్రామికవేత్త సురేశ్‌ను సీఐడీ ఎస్పీ రాఘవేంద్ర నేతృత్వంలోని బృందం గురువారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని పుణెలో అరెస్ట్ చేసింది. వీరిని శుక్రవారం కలబురిగి సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. గురువారం ఈ కేసులో అరెస్ట్ అయిన జ్యోతి పాటిల్‌ను విచారణ చేపట్టగా దివ్య హాగరగితో పాటు ఐదుగురు పుణెలో తలదాచుకున్నట్లు సమాచారం అందించారు. గురువారం రాత్రి సీఐడీ బృందం మహారాష్ట్రకు వెళ్లి ఐదుగురిని అరెస్ట్ చేసింది. కస్టడీకి నిందితులు.. దివ్యతోసహా ఆరుగురిని వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం కలబురిగి ఒకటవ అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 11 రోజుల కస్టడీకి అనుమతించింది. ఇక, దివ్య హాగరగితోసహా ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయంపై రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌సూద్ సీఎం బసవరాజ బొమ్మైకి సమాచారం అందించారు. ఆర్టీ.నగరలో ఉన్న సీఎం నివాసానికి ప్రవీణ్‌సూద్ విచ్చేసి వివరాలు తెలియజేశారు. ఈ కేసులో ఎవరు భాగస్వాములైనప్పటికీ చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. -
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంటర్ సెకండియర్‌కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను ప్రకటిస్తారు. ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: Telangana: లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు -
12వ తరగతి ఫలితాల నిర్ధారణపై కమిటీ
న్యూఢిల్లీ: 12వ తరగతి పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఆ తరగతి విద్యార్థుల ఫలితాలను నిర్ధారించే విధానాన్ని రూపొందించడానికి 13 మంది సభ్యులతో ఒక కమిటీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఏర్పాటు చేసిం ది. ఆ కమిటీ 10 రోజుల్లోగా నివేదిక సమర్పించనుందని శుక్రవారం సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. కమిటీలో తనతో పాటు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి విపిన్ కుమార్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కమిషనర్ నిధి పాండే, నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ వినాయక్ గార్గ్, సీబీఎస్ఈ డైరెక్టర్(ఐటీ) అంత్రిక్ష జోహ్రి, సీబీఎస్ఈ డైరెక్టర్(అకడమిక్) జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ తదితరులు సభ్యులుగా ఉంటారన్నారు. ఒకవేళ ఎవరైనా విద్యా ర్థుల పరీక్ష రాయాలనుకుంటే వారికి కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలను నిర్వహించాల ని కూడా ఆ సమావేశంలో నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ ఇప్పటికే రద్దు చేసి, విద్యార్థుల మార్కుల నిర్ధారణకు ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. -
Narendra Modi: పరీక్షల రద్దుతో హ్యాపీనా?
న్యూఢిల్లీ: పరీక్షలు రద్దు అయిన నేపథ్యంలో ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సీబీఎస్ఈ 12వ విద్యార్థులకు ఉద్బోధించారు. ‘పరీక్షలు రద్దు అయినందుకు చాలా సంతోషిస్తున్నట్లు కనిపిస్తోంది’ అంటూ వారితో చమత్కరించారు. పరీక్షల గురించి ఎప్పుడూ టెన్షన్ పడవద్దని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో గురువారం కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన ఒక ఆన్లైన్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో ప్రధాని అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానందాలకు గురి చేశారు. ‘పరీక్షలను రద్దు చేయడంతో మీ ఆనందానికి హద్దులు లేనట్లు కనిపిస్తోంది’ అన్నారు. పరీక్షలు జరుగుతాయేమోనని ఆందోళన పడ్డారా? అన్న ప్రధాని ప్రశ్నకు విద్యార్థులు అవునని సమాధానమివ్వడంతో.. ‘అయితే పరీక్షలంటే ఆందోళన వద్దు అంటూ నేను రాసిన ఎగ్జామ్ వారియర్ పుస్తకం సత్ఫలితాలను ఇవ్వలేదన్నమాట’ అని వ్యాఖ్యానించారు. పరీక్షలు రద్దవడంతో ఈ ఖాళీ సమయాన్ని ఎలా గడపాలనుకుంటున్నారని విద్యార్థులను ప్రశ్నించారు. ‘ఐపీ ఎల్, చాంపియన్స్ లీగ్ చూస్తారా? ఒలింపిక్స్ కోసం ఎదురు చూస్తున్నారా?’ అని ప్రశ్నించారు. ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మం త్రాన్ని సదా గుర్తుంచుకోవాలన్నారు. పరీక్షల రద్దు నిర్ణయంతో ఊరట పొందామని పలువురు విద్యార్థులు ప్రధానికి తెలిపారు. ‘రద్దు నిర్ణయం వెలువడే వరకు ప్రిపరేషన్‌తో బిజీబిజీగా ఉండి ఉంటారు కదా!’ అన్న ప్రధాని మాటకు.. గువాహటికి చెందిన ఒక విద్యార్థి స్పందిస్తూ.. ‘పరీక్షలను పండుగలా భావించాలని గతంలో మీరు చెప్పిన విషయం గుర్తుంది’ అని చెప్పాడు. టాపర్‌గా ఉండాలనుకుని కష్టపడి చదివానని మరో విద్యార్థి తెలిపాడు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించామని ప్రధాని తెలిపారు. 75 ఏళ్ల భారత స్వాతంత్య్రంపై ఒక వ్యాసం రాయమని ప్రధాని విద్యార్థులకు సూచించారు. పలువురు తల్లిదండ్రులు ప్రధానితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘పిల్లలు చాలా ఒత్తిడితో ఉన్నారు. పరీక్షల రద్దు సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణ యం’ అని ఒక పేరెంట్ వ్యాఖ్యానించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏ ప్రక్రియను అనుసరిస్తారు..? రెండు వారాల్లో తెలపండి: సుప్రీంకోర్టు 12వ తరగతి ఫలితాల వెల్లడికి ఏవిధమైన ప్రక్రియను అవలంబిస్తారో రెండు వారాల్లో తెలపాలని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలను సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయవాది మమత శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించి, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
-
ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుందా.. ఉండదా?
సాక్షి, హైదరాబాద్: లక్షల మంది నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామకాలు రాష్ట్రంలో ఇప్పట్లో జరిగేనా? అంటే స్పష్టమైన సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించిన 50 వేల ఉద్యోగాల్లో 10 వేల వరకు టీచర్ పోస్టులున్నాయి. అయితే వాటి భర్తీ విధానమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను నాలుగేళ్లుగా నిర్వహించకుండా, ఉపాధ్యాయ నియామకాలను పట్టించుకోకుండా పక్కన పడేసిన విద్యాశాఖ.. ఇప్పుడు టెట్ నిర్వహిస్తుందా.. లేదా? అన్నది గందరగోళంగా మారింది. ఓవైపు ఒకే పరీక్ష ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెబుతూనే మరోవైపు టెట్ నిర్వహిస్తామని సమాధానమిస్తోంది. దీంతో టెట్ పరిస్థితేంటి? టీచర్ల నియామకాలు ఎలా చేపడతారన్న దానిపై గందరగోళం నెలకొంది. మంత్రిది ఓ మాట.. విద్యాశాఖది మరో మాట టెట్, టీఆర్టీల విషయంలో ప్రభుత్వ వర్గాల నుంచే భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ నియామకాలను పాత పద్ధతిలో ఒకే పరీక్ష ద్వారా చేపడతామని అసెంబ్లీలోనే వెల్లడించారు. అంటే టెట్ ఉండదా? లేదంటే టెట్‌ను కలుపుకొని టెట్ కమ్ టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు) నిర్వహిస్తారా అన్న స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయాన్ని మంత్రి ప్రకటించి 15 రోజులు గడిచినా దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని గవర్నింగ్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దానిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ రాష్ట్రంలో టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు టెట్ వ్యాలిడిటీ విషయంలో ఎన్సీటీఈ తుది నిర్ణయం తీసుకున్నాక రాష్ట్రంలో టెట్ నిర్వహిస్తామని విద్యా శాఖ వెల్లడించింది. ఈ లెక్కన టెట్ ఉంటుందా.. ఉండదా? లేదంటే టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. టెట్ లేదా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే.. రాష్ట్రంలో 2017లో టెట్ నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ టెట్ నిర్వహించలేదు. దీంతో గతంలో టెట్‌లో అర్హత సాధించినా, ఆ తర్వాత ఏడేళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన వారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. ఈ నాలుగేళ్లలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసుకొని టెట్ రాసేందుకు ఎదురుచూస్తున్న వారు మరో 2 లక్షల మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం టెట్ కమ్ టీఆర్టీని నిర్వహించే అంశంపై ఆలోచనలు చేస్తోంది. అది నిర్వహిస్తే పాత టెట్లలో అర్హత సాధించి ఇప్పటికీ వ్యాలిడిటీ కలిగిన 3 లక్షల మంది విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలక అంశం. మరోవైపు పాత టెట్లలో అర్హత సాధించి ఏడేళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన మరో 3 లక్షల మంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదీ ప్రధానమే. వ్యాలిడిటీ కోల్పోయిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకుని విధానపర నిర్ణయం ప్రకటిస్తామని ఎన్సీటీఈ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. ఏపీలో నిర్వహించినా.. ఆంధ్రప్రదేశ్‌లో టెట్ కమ్ టీఆర్టీ కలిపి నిర్వహించారు. అయితే ఆ నియామకాల్లో గతంలో టెట్‌లో అర్హత సాధించిన వారి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. టెట్ కమ్ టీఆర్టీలో భాగంగా 50 మార్కులకు నిర్వహించిన టెట్‌కు సంబంధించిన పార్ట్–ఏలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని, లేదంటే పాత టెట్‌లో ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేపట్టారు. ఇక గతంలో టెట్‌లో అర్హ్హత సాధించని వారి విషయంలో మాత్రం టెట్ కమ్ టీఆర్టీలోని పార్ట్–ఏలో అర్హత సాధిస్తే టీఆర్టీకి సంబంధించిన పేపరును మూల్యాంకనం చేసి నియాకమల్లో పరిగణనలోకి తీసుకున్నారు. దీనివల్ల కొంత గందరగోళం నెలకొంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలన్నా టెట్‌లో అర్హత సాధించి ఉండాలని ఎన్సీటీఈ స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే ప్రైవేటు టీచర్లకు టెట్ ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు జాతీయ స్థాయిలో రెండూ కలిపి నిర్వహించిన సందర్భమూ లేదు. ఈ గందరగోళం నేపథ్యంలో టెట్‌ను వేరుగానే నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం గత నెల 17న జీవో 23ని జారీ చేసింది. సెంట్రల్ స్కూళ్లకు టెట్ తప్పనిసరి జాతీయ స్థాయిలో కేంద్రం ఏటా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (సీటెట్) నిర్వహిస్తోంది. అందులో అర్హత సాధించిన వారిని మాత్రమే సీబీఎస్ఈ స్కూళ్లు, ఇతర కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో ఇంతవరకు టెట్‌ను, ఉపాధ్యాయ నియామక పరీక్షను కలిపి నిర్వహించే ఆలోచన చేయలేదు. రెండింటినీ వేర్వేరుగానే చూస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఉపాధ్యాయ నియామకాలు ఎప్పుడు చేపడుతుందో వేచి చూడాల్సిందే. వివాదాల్లోకి వెళ్లొద్దు.. టెట్ నిర్వహించాలి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగంగా జరగాలంటే ప్రభుత్వం వివాదాల్లోకి వెళ్లొద్దు. వెంటనే టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆ పరీక్ష అయిన 15 రోజుల్లో టీఆర్టీ పరీక్ష నిర్వహించినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించే వీలున్నా వివాదాలు చుట్టుముట్టే ఆస్కారం ఉంది. 2017 వరకు నిర్వహించిన టెట్లలో అర్హత సాధించిన వారి విషయంలో వెయిటేజీ ఇవ్వడం, లేదా పాత, కొత్త టెట్లలో ఎందులో ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదీ సమస్యాత్మకమే. మరోవైపు ప్రైవేటు టీచర్‌గా పని చేయాలన్నా టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే. కాబట్టి వారికోసం టెట్‌ను నిర్వహించక తప్పదు. ఇలాంటప్పుడు సులభ విధానాన్నే ప్రభుత్వం ఎంచుకుంటే సమస్య ఉండదు. - పి.శంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యా విభాగం సామర్థ్యాలను నిర్ణయించేదెలా? రెండున్నర గంటల్లో టెట్ కమ్ టీఆర్టీ పరీక్ష నిర్వహించి 30 ఏళ్ల పాటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడి సామర్థ్యాలను నిర్ణయించడం సాధ్యమా? టెట్ వేరు. టీఆర్టీ వేరు. ఉపాధ్యాయుడు కావాల్సిన అర్హతలు ఉన్నాయా? లేదా? నిర్ణయించేందుకు నిర్వహించేది టెట్. ఉపాధ్యాయులుగా నియమించేందుకు నిర్వహించేది టీఆర్టీ. అలాంటప్పుడు రెండింటినీ కలిపి ఎలా నిర్వహిస్తారు. కోచింగ్ తీసుకొని, బిట్స్ బట్టీ పట్టి వచ్చే వారికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి వారు విద్యార్థులను ఎలా తీర్చిదిద్దుతారు. అందుకే టెట్ వేరుగానే ఉండాలి. నియామక పరీక్షను కఠినతరం చేయాలి. డిస్క్రిప్టివ్ విధానం ఉండాలి. క్లాస్‌రూం డెమాన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూ పద్ధతిలో టీచర్లను నియమించాలి. అప్పుడే వారికి సామర్థ్యాలు ఉన్నాయా.. లేదా? తెలుస్తాయి. - ఉపేందర్‌రెడ్డి, ఎస్సీఈఆర్టీ రిటైర్డ్ ప్రొఫెసర్ చదవండి: ఆదమరిస్తే అంతే! -
నో ఎగ్జామ్స్.. వారంతా మళ్లీ పాస్!
చెన్నె: కరోనా మహమ్మారిపై పోరు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9, 10, 11వ తరగతి విద్యార్థుల పరీక్షలు రద్దు చేసి వారిని ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం పరీక్షలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా రెండో దశ ప్రారంభమైనట్టు వైద్య నిపుణులు కొందరు చెప్తున్నారు. ప్రతిరోజూ అక్కడ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల పరీక్షలు రద్దు చేయాలని ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వ నిర్ణయంతో గతేడాదిలాగే ఈ ఏడాది కూడా విద్యార్థులు పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ కానున్నారు. కాగా, ఆయా రాష్ట్రాల్లో ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, కేరళలో కూడా హైస్కూల్ పరీక్షలు రద్దు చేసే అవకాశం ఉంది. -
ఫైనలియర్ పరీక్షలు రాయాల్సిందే: సుప్రీం
-
ఫైనలియర్ పరీక్షలు రాయాల్సిందే: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఫైనలియర్ పరీక్షల రద్దుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టేసింది. పరీక్షలు రాయకుండా ఎవరినీ ప్రమోట్ చేయవద్దని కోర్టు సూచించింది. సెప్టెంబర్ 30న యథాతథంగా యూజీసీ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. యూజీసీ గైడ్‌లైన్స్‌ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఫైనలియర్ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా ఆదిత్య ఠాక్రేకు చెందిన యువసేనతో సహ పలు సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూసి వేశారని.. ఇలాంటి పరిస్థితులోల పరీక్షలు పెడితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పిటిషన్‌దారులు కోర్టుకు తెలిపారు. (చదవండి: నీట్, జేఈఈల వాయిదా ఉండదు!) దీన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్‌దారులు కోర్టును కోరారు. ఇప్పటికే విద్యార్థులు ఐదు సెమిస్టర్లు పూర్తి చేశారని.. వాటిలో సాధించిన మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలన్నారు. ఈ పిటిషన్లను నేడు విచారించిన సుప్రీం కోర్టు యూజీసీ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. పరీక్షలు లేకుండా విద్యార్థులను ప్రమోట్ చేయడాన్ని ప్రోత్సాహించదని కోర్టు రాష్ట్రాలను కోరింది. -
కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ స్టేట్ యూనివర్సిటీల పరిధిలోని వివిధ కోర్సులలో చివరి సంవత్సరం సహా అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం తెలిపింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఢిల్లీలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పరీక్షలు ఉండవని, గత పరీక్షల మూల్యాంకనం ఆధారంగా విద్యార్థుల ఫలితాలను సిద్ధం చేస్తామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పరీక్షలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. అయితే ఈ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో నిర్వహించే పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చదవండి: నేనేమీ రిమోట్ కంట్రోల్‌ని కాదు: శరద్ పవార్ -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఈ ఏడాది సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు ఊరట కలగనుంది. ఈ మేరకు ఫెయిల్ అయిన విద్యార్థులను కంపార్ట్మెంట్ పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. (డిగ్రీ,పీజీ పరీక్షలపై హైకోర్టు విచారణ) ‘ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 1.47 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన వారిని కూడా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోమని చెప్పాం. అందుకు దాదాపు 73 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆ ప్రక్రియ కూడా 10 రోజుల్లో పూర్తి అవుతుంది. ఆ తర్వాత వారి రిజల్ట్స్‌ను ప్రకటిస్తాం. సెకండియర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులను కంపార్టమెంట్ పాస్ చేస్తున్నాం. జూలై 31 తర్వాత వారి మార్కుల మెమోలు సంబంధిత కళాశాలల్లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల పైచదువులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. -
ఈ ఏడాది డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు
జైపూర్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ ఏడాది అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న కాలేజీల్లో జరగవల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేసింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కరోనా వైరస్ కారణంగా రాష్ట్రం ప్రభుత్వం ఈ ఏడాది డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేస్తుందని సీఎం అశోక్ గెహ్లాట్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం అన్ని యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలతోపాటు టెక్నికల్ ఇన్స్టిట్యూట్లకు కూడా వర్తిస్తుందని తెలిపారు. (ఏడాది పాటు మాస్క్‌లు తప్పవు) ఇక విద్యార్థులందరూ పరీక్షలు లేకుండా వచ్చే సంవత్సరానికి ప్రమోట్ అవుతారని అన్నారు. విద్యార్థుల మార్కులకు సంబంధించి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరి కొద్ది రోజుల్లో జారీ చేయాల్సిన మార్గదర్శకాలను అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇటీవల రాజస్థాన్ విశ్వవిద్యాలయం యూజీ, పీజీ పరీక్షలను జూలై 15 నుంచి ఆగస్టు 18 వరకు నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. (వెంటిలేటర్ల ఎగుమతికి సిద్ధం : డీఆర్డీఓ) -
సీబీఎస్ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా జూలైలో జరగాల్సిన పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మిగిలిన పేపర్లకు మార్కులు వేసే సీబీఎస్ఈ నాలుగు అంశాల ఫార్ములాకు కూడా న్యాయస్థానం ఆమోదం తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున జూలై 1నుంచి 15వ తేదీల మధ్యన జరగాల్సిన సీబీఎస్ఈ పెండింగ్ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజయ్ ఖన్నాల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్రం, సీబీఎస్ఈ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున 10, 12వ తరగతి పెండింగ్ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ నిర్ణయించాయన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు బోర్డు పరీక్షలు నిర్వహించలేమంటూ అశక్తత వ్యక్తం చేశాయని ఆయన ధర్మాసనానికి తెలిపారు. 10, 12వ తరగతి విద్యార్థులు ఇప్పటికే నిర్వహించిన పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు. జూలై 15వ తేదీ నాటికి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. మిగిలి ఉన్న పరీక్షలకు హాజరు కావడమా లేక ఇప్పటికే హాజరైన పరీక్షల్లో చూపిన ప్రతిభను బట్టి వేసే మార్కులకు అంగీకరించడమా అనే ఆప్షన్‌ను 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నామన్నారు. సీబీఎస్ఈ విధానాన్నే అటూఇటుగా తామూ అనుసరిస్తామని ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ) ధర్మాసనానికి నివేదించింది. 10,12వ తరగతి పరీక్షల ఫలితాలను జూలై 15వ తేదీకల్లా ప్రకటిస్తామని ఐసీఎస్ఈ తెలిపింది. 10, 12వ తరగతులకు గత పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే ఫలితాలు ప్రకటిస్తామని ఐసీఎస్ఈ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి భయంతో సీబీఎస్ఈ పరీక్షలు అర్థంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అత్యుత్తమ సరాసరి మార్కులే ఆధారం 10, 12వ తరగతి విద్యార్థి ఇప్పటికే రాసిన పరీక్షల్లో చూపిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగానే రద్దయిన పరీక్షల సబ్జెక్టులకు మార్కులు నిర్ణయిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల పరీక్షలు రాసిన వారికి, మూడు పరీక్షల్లో సాధించిన అత్యుత్తమ మార్కుల సరాసరిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. మూడు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికైతే రెండు సబ్జెక్టుల్లో మార్కులను బట్టి మార్కులు వేస్తాయనుంది. ఢిల్లీలో అల్లర్ల కారణంగా 12వ తరగతి ఒకటి, రెండు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికి... రాసిన సబ్జెక్టులు, ఇంటర్నల్/ప్రాక్టికల్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను నిర్ణయిస్తారు. -
ఓయూ డిగ్రీ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఈ నెల 19 నుంచి ప్రారంభమవ్వాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ గురువారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ డిగ్రీ కోర్సుల 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలను వివిధ కారణాల వల్ల అధికారులు రెండోసారి వాయిదా వేశారు. ఓయూ పరిధిలోని ప్రైవేటు కాలేజీల నిర్వాహకులు సకాలంలో పరీక్ష ఫీజు పత్రాలు సమర్పించకపోవడంతో వారి విజ్ఞప్తి మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఈనెల 13న జరగాల్సిన పరీక్షలను తొలుత 19కి వాయిదా పడగా.. ప్రైవేటు కాలేజీల యజమానుల వినతితో ఇప్పుడు 22వ తేదీ వరకు వాయిదా వేశారు. -
కాళోజి హెల్త్ యూనివర్సిటీ పరీక్షలో గందరగోళం
సాక్షి, వరంగల్: కాళోజి హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో గందరగోళం చోటుచేసుకుంది. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల రాసిన పరీక్షను రద్దు చేశారు. టెక్నికల్ కారణాల వల్ల పరీక్ష రద్దు చేసినట్టు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెళితే. సోమవారం నుంచి యూనివర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే నేడు ఉదయం విద్యార్థులు ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహించారు. తీరా ఎగ్జామ్ పూర్తయిన కొద్దిసేపటికి పరీక్ష రద్దు చేసినట్టు యూనివర్సిటీ నుంచి విద్యార్థుల ఫోన్లకు అధికారులు సందేశాలు పంపించారు. మరోసారి షెడ్యూల్ ఖరారు చేసి పరీక్ష నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు ఆ సందేశంలో పేర్కొన్నారు. పరీక్ష జరిగిన రెండు సెంటర్లలో ఒక కోడ్‌కు బదులు.. మరో కోడ్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసి పరీక్ష నిర్వహించనందువల్ల.. పరీక్ష రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రాసిన పరీక్ష రద్దు చేసి.. మళ్లీ పరీక్ష నిర్వహిస్తామంటు అధికారులు ప్రకటించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ పరీక్షలంటే ఇంత నిర్లక్ష్యమా అని యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. పరీక్ష నిర్వహణ సిబ్బంది తీరును తప్పుబట్టిన విద్యార్థులు.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
కాళోజీ హెల్త్ యూనివర్శిటీ పరిక్షలు రద్దు
-
ముచ్చటగా మూడో‘సారీ’
సాక్షి, విశాఖపట్నం : జూనియర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం స్టీల్‌ప్లాంట్ గత నెలలో నిర్వహించిన పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు యాజమాన్యం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఏడాదిలో మూడు సార్లు పరీక్షలను రద్దు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం గతేడాది జూన్‌లో 645 జూనియర్ ట్రైనీ, 91 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ ట్రైనీ పోస్టులకు సుమారు 78 వేల మంది, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సుమారు 56 వేల మంది దరఖాస్తు చేశారు. వీటికి సంబందించి గతేడాది జూలైలో రాత పరీక్షకు సిద్ధం కాగా.. ప్రశ్నపత్రాలు సకాలంలో చేరకపోవడంతో పరీక్షలను రద్దు చేశారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షను పక్కన పెట్టి జూనియర్ ట్రైనీ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడానికి సన్నద్ధమయ్యారు. అయితే నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో అఖరు నిమిషంలో ఆ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని ఎట్టకేలకు గత నెల 9 నుంచి 14 వరకు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సుమారు 40 వేల మంది మాత్రమే హాజరయ్యారు. అయితే ఈసారి జరిగిన ఆన్లైన్ పరీక్ష పత్రంలో 2016, 2017లలో జరిగిన ఎస్ఎస్సీ జేఈ పరీక్ష పత్రాలను మక్కిమక్కీగా దించేశారు. దీనిపై అభ్యర్థులు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టడంతో యాజమాన్యం ఇద్దరు ఈడీలతో కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా రద్దుకు సిఫార్సు చేసింది. దీంతో యాజమాన్యం గత్యంతరం లేక ఈ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదిలో మూడు సార్లు ఒక పరీక్షను రద్దు చేసిన ఘనతను మూటగట్టుకుంది. లోపించిన పర్యవేక్షణ స్టీల్‌ప్లాంట్ నియామకాల ప్రక్రియలో వరుసగా జరుగుతున్న తప్పిదాలను గమనిస్తే అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపిక చేసిన ఏజెన్సీ చరిత్ర తెలుసుకోకుండా పరీక్షల నిర్వహిణను అప్పగించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా తరచూ పరీక్షలను రద్దు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడడం తగదని పలువురు సూచిస్తున్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు ప్రభుత్వ రంగ సంస్ధలో ఉద్యోగంపై ఆశతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్ధులు అనేక ఇబ్బందులు పడి ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. చాలా మందికి షెల్టర్ లేకపోవడంతో బస్టాండ్, రైల్వే ఫ్లాట్‌ఫారాల పైన పడుకుని మరునాడు పరీక్షలకు హాజరయ్యేవారు. దీంతో వసతి, భోజనం వంటి వాటి కోసం వేలాది రూపాయలు వ్యయం చేయాల్సి వచ్చింది. ఇలా ప్రతిసారీ రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్మీ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్షలు రద్దు
థానె: ఆర్మీలో పలు ఉద్యోగాల నియామకాలకు ఆదివారం నిర్వహించాల్సిన ప్రశ్నా పత్రం లీక్ అయింది. దీనికి సంబంధించి పుణె, నాగ్‌పూర్, నాసిక్ లకు చెందిన 300 మంది విద్యార్థులను, 18 మంది నిందితులను థానె పోలీసులు అరెస్టు చేశారు. పుణెలో ప్రశ్నా పత్రం లీక్ అయినట్టు గుర్తించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగాల నియామకాల పరీక్షలను రద్దు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున సుమారు 350మంది విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ప్రశ్నాపత్రాన్ని అమ్మాయి. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.2లక్షలు వసూలు చేశారు. పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. పలు కోచింగ్ సెంటర్ల యాజమానులను, ఆర్మీ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు థానె క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నితిన్ ఠాక్రే తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నాపత్రం లీక్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్మీ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసినట్టు పోలీసులు తెలిపారు.