ఓయూ డిగ్రీ పరీక్షలు వాయిదా | Osmania University Degree Exams Postponed | Sakshi
Sakshi News home page

ఓయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

Published Fri, Nov 15 2019 1:27 PM | Last Updated on Fri, Nov 15 2019 1:27 PM

Osmania University Degree Exams Postponed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఈ నెల 19 నుంచి ప్రారంభమవ్వాల్సిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్‌ ప్రొ.శ్రీరామ్‌ వెంకటేష్‌ గురువారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ డిగ్రీ కోర్సుల 1, 3, 5 సెమిస్టర్‌ పరీక్షలను వివిధ కారణాల వల్ల అధికారులు రెండోసారి వాయిదా వేశారు. ఓయూ పరిధిలోని ప్రైవేటు కాలేజీల నిర్వాహకులు సకాలంలో పరీక్ష ఫీజు పత్రాలు సమర్పించకపోవడంతో వారి విజ్ఞప్తి మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఈనెల 13న జరగాల్సిన పరీక్షలను తొలుత 19కి వాయిదా పడగా.. ప్రైవేటు కాలేజీల యజమానుల వినతితో ఇప్పుడు 22వ తేదీ వరకు వాయిదా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement