
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంటర్ సెకండియర్‌కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను ప్రకటిస్తారు. ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment