చెన్నె: కరోనా మహమ్మారిపై పోరు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9, 10, 11వ తరగతి విద్యార్థుల పరీక్షలు రద్దు చేసి వారిని ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం పరీక్షలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా రెండో దశ ప్రారంభమైనట్టు వైద్య నిపుణులు కొందరు చెప్తున్నారు.
ప్రతిరోజూ అక్కడ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల పరీక్షలు రద్దు చేయాలని ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వ నిర్ణయంతో గతేడాదిలాగే ఈ ఏడాది కూడా విద్యార్థులు పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ కానున్నారు. కాగా, ఆయా రాష్ట్రాల్లో ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, కేరళలో కూడా హైస్కూల్ పరీక్షలు రద్దు చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment