promote
-
RBI: బ్యాంకింగ్‌లో కార్పొరేట్లకు నో ఎంట్రీ
ముంబై: బ్యాంకులను ప్రమోట్ చేయడానికి వ్యాపార సంస్థలను అనుమతించే ఆలోచన ఏదీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ చేయడం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బ్యాంకుల ప్రమోట్‌కు కార్పొరేట్ సంస్థలను అనుమతించడం వల్ల వడ్డీ రిస్‌్కలు, సంబంధిత లావాదేవీల్లో పారదర్శకత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందన్నారు. భారతదేశానికి ఇప్పుడు కావలసింది బ్యాంకుల సంఖ్య పెరగడం కాదని పేర్కొంటూ. మంచి, పటిష్ట, సుపరిపాలన ఉన్న బ్యాంకులు ఇప్పు డు కీలకమైన అంశమని వివరించారు. సాంకేతికత ద్వారా దేశవ్యాప్తంగా పొదుపులను సమీకరిస్తుందన్నారు.రుణాలకన్నా... డిపాజిట్ల వెనుకడుగు సరికాదు... డిపాజిట్ల పురోగతికన్నా.. రుణ వృద్ధి పెరగడం సరైంది కాదని పేర్కొంటూ ఇది లిక్విడిటీ సమస్యలకు దారితీస్తుందన్నారు. గృహ పొదుపులు గతం తరహాలోకి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్‌స్ట్రమెంట్ల వైపు మళ్లడం బ్యాంకింగ్ డిపాజిట్లపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారు. డిపాజిట్లు–రుణాల మధ్య సమతౌల్యత ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇక దేశంలో ఆర్థికాభివృద్ధి ఊపందుకుందని పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం ఆందోళనలు ఇంకా పొంచి ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారిస్తుందని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం సుస్థిర ప్రాతిపదికన 4 శాతం వైపునకు దిగివస్తేనే రుణ రేటు వ్యవస్థ మార్పు గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.స్పెక్యులేషన్‌లోకి గృహ పొదుపులుఎఫ్అండ్వో ట్రేడ్ చాలా పెద్ద అంశం సెబీ చైర్పర్సన్ మాధవిపురిఇంటి పొదుపులు స్పెక్యులేషన్ వ్యాపారంలోకి వెళుతున్నాయని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతున్నందున ఎఫ్‌అండ్‌వోలో స్పెక్యులేటివ్ ట్రేడ్లకు వ్యతిరేకంగా ఇన్వెస్టర్లకు గట్టి హెచ్చరిక పంపుతున్నట్టు చెప్పారు. మూలధన ఆస్తి కల్పనకు ఉపయోగపడుతుందన్న అంచనాలను తుంగలో తొక్కుతున్నారని.. యువత పెద్ద మొత్తంలో ఈ ట్రేడ్లపై నష్టపోతున్నట్టు తెలిపారు. ‘‘ఓ చిన్న అంశం కాస్తా.. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే ఈ దిశగా ఇన్వెస్టర్లను ఒత్తిడి చేయాల్సి వస్తోంది’’అని సెబీ చైర్పర్సన్ చెప్పారు. ప్రతి 10 మంది ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) విభాగంలో నష్టపోతున్నట్టు సెబీ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. ట్రేడింగ్ పరిమాణం పెద్ద ఎత్తున పెరగడంతో, ప్రతి ఒక్కరినీ ఈ దిశగా అప్రమ్తతం చేయడం నియంత్రణ సంస్థ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఫిన్ఫ్లూయెన్సర్లు (ఆర్థిక అంశాలు, పెట్టుబడులను ప్రభావితం చేసేవారు) పెట్టుబడుల సలహాదారులుగా సెబీ వద్ద నమోదు చేసుకుని, నియంత్రణల లోపాలను వినియోగించుకుంటున్నారని, దీనిపై త్వరలోనే చర్చా పత్రాన్ని విడుదుల చేస్తామన్నారు. -
మహిళలు ఓటు వేస్తున్నారా..! ఈ ఎన్నికల్లో మీదే కీలక తీర్పు..!
మహిళలే కదా అని తీసిపడేయకండి. వాళ్లకేం తెలుసు రాజకీయాలు అనే పరిస్థితి పోయింది. అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తూ తామేంటో ప్రూవ్ చేస్తున్నారు. ఇంతకమునుపు ఎన్నికల్లో మహిళలు ఓటు వేసింది తక్కువే. అంత అవగాహన, చదువు లేకపోవడం వంటి కారణాలతో ఓటు హక్కు వినియోగించలేకపోయేవారు చాలామంది. కానీ ఇటీవల జరిగిన తెలంగాణ, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మహిళా ఓటర్లే కీలకమని నివేదికలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో కీలక తీర్పే ఇచ్చేది 'ఆమె' అని తేలింది కూడా. ఎందుకంటే మహిళ ఓటర్లే అధికంగా ఉన్నట్లు సర్వేలు కూడా చెబుతున్నాయి. మరీ మహిళలు మీ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారా..!. ఈ రోజు సెలవురోజు అని సెల్ఫోన్లకు, టీవికి అతుక్కుపోవద్దు. ఓటు వేసి కుర్చీ ఎవరికి ఇవ్వాలన్నది నిర్ణయించండి. మహిళలంటే కేవలం ఇంటి భాద్యతలోనే కాదు అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాధికారంలోనూ భాగం అని నిరూపిద్దాం. మార్పులో భాగం అయ్యి, బంగారు భవిష్యత్తుకు బాటలు పరుద్దాం. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో మహిళలు ఓటు హక్కు వినియోగించుకోమని చెబుతూ ఎలా అవగాహన కల్పించారో సవివరంగా చూ ద్దామా!. ఇటీవల కోయంబత్తూరులో వందమందికి పైగా మహిళలు కలిసి బ్రూక్‌ఫీల్డ్స్ మాల్ దగ్గర ఓటు ప్రాధాన్యతను చాటిచెప్పేలా ముగ్గులు వేశారు. అలానే చత్తీస్‌గఢ్‌లోని బాల్రామ్పుర్ జిల్లాలో స్వయం సహాయక మహిళా బృందాలు వినూత్న ప్రచారానికి నాంది పలికారు. ఏకంగా రావి ఆకుల తోపాటు పసుపు కలిపిన బియ్యాన్ని ఇంటింటికీ తిరిగి మరీ పంచిపెట్టి మరీ ఓటు హక్కును వినియోగించుకోమని అభ్యర్థించారు. తాజాగా కర్ణాటకలో మహిళా ఆఫీసర్లు సైతం ఓటింగ్ శాతం పెంచడం కోసం ‘చునావనా పర్వా- దేశదా గర్వ’ అంటే (ఎలక్షన్ పండుగ దేశానికే గర్వం) అని రాసి ఉన్న చీరలను ధరించి మహిళా ఓటర్లలో స్ఫూర్తి నింపారు. మహిళలే కదా వాళ్ల ఓటు హక్కు పడకపోతే ఈ సమాజానికి ఏముందిలే నష్టం అని తీసిపరేయకండి. ఎందుకంటే తాజాగా జరిగిన కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పే కీలమని తేలింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ సగానికి పైగా ఉంది మహిళా ఓటర్లే. అందువల్ల మహిళలు ప్రజాస్వామ్య అతిపెద్ద వేడుకలో భాగమయ్యి..ఒక్క సిరా గీతతో భవిష్యత్తుకు బంగారు బాటలు పరవండి. (చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!) -
భారత్-యూఏఈ ఆర్థిక బంధం మరింత పటిష్టం!
ముంబై: భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)ల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ఈ దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యునైటెడ్ అరబ్ ఎమిరైట్స (యూఏఈ) సెంట్రల్ బ్యాంక్ బుధవారం ఒక పరస్పర అవగాహనా ఒప్పందంపై (ఎంఓయూ) సంతకాలు చేశాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల (సీబీడీసీ) పరస్పర నిర్వహణా (ఇంటర్‌ఆపరేబిలిటీ) విధానాలను అన్వేషిణ సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించ డానికి ఈ ఒప్పందం దోహపడనుంది. (ఇదీ చదవండి: లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు) ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించి రెండు సెంట్రల్ బ్యాంకుల మధ్య పరస్పర సహకారం పెరగనుంది. సీబీడీసీకి సంబంధించి పురోగమించే సహకారం-రెమిటెన్సులు,వాణిజ్యం వివిధ విభాగాల్లో రెండు దేశాల ప్రజలు, సంబంధిత వర్గాల సౌలభ్యతను ఈ ఒప్పందం మరింత మెరుగు పరుస్తుందని అంచనా. ఆర్థికరంగంలో వ్యయ నియంత్రణకు, సామర్థ్యం పెంపుకు దోహదపడుతుందని విశ్లేషిస్తున్నారు. భారత్ ప్రతిష్టాత్మక యూపీఐ వ్యవస్థ అందుబాటులో ఉన్న దేశాల్లో యూఏఈ కూడా ఉండడం గమనార్హం. ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెథర్లాండ్స్, బంగ్లాదేశ్, సింపూర్‌లు ఉన్నాయి. -
అసలు తగ్గేదే లే..! సమంత ఖాతాలో మరో బ్రాండ్..!
భారత్‌లో క్రిప్టోకరెన్సీపై నెలకొన్న ఆదరణను పలు కంపెనీలు క్యాష్ చేసుకునేందుకు సిద్దమైనాయి. వజీర్ఎక్స్, కాయిన్ డీసీఎక్స్, కాయిన్ స్విచ్ కుబేర్ లాంటి క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్ ఇండియన్ క్రిప్టో ఇన్వెస్టర్లకు మరింత దగ్గరవుతున్నాయి. క్రిప్టో నియంత్రణపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొనప్పటికీ ఆయా ఇండియన్ క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫామ్స్ మాత్రం భారతీయుల్లో క్రిప్టో మరింత అవగాహన తెచ్చేందుకు ప్రముఖులతో ప్రమోషన్స్‌ను చేపట్టాయి. తాజాగా కాయిన్‌స్విచ్ కుబేర్ క్రిప్టో యాప్‌కు ప్రచారకర్తగా సమంత మారింది. చిన్న మొత్తాలతో ఇన్వెస్ట్ చేసి భారీగా లాభాలు సంపాదించొచ్చని తెలిపే వీడియోను సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది. రూ. 100తో మొదలు..! పలు క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆయుష్మాన్ ఖురానా, రణ్వీర్ సింగ్ లాంటి దిగ్గజ నటులు భారత్‌లో ప్రచార కర్తలుగా మారారు. క్రిప్టోకరెన్సీ ప్రచారంలో తాజాగా సమంత కూడా వచ్చి చేరింది. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సమంత చేస్తున్న ప్రచారం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాయిన్‌స్విచ్‌కుబేర్ క్రిప్టోపై ఇన్వెస్ట్ చేయడం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినట్లు షేర్ చేసిన వీడియోలో పేర్కొంది. కేవలం రూ.100 నుంచి క్రిప్టోపై ఇన్వెస్ట్ చేయవచ్చునని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీపై సందేహాలను కాయిన్‌స్విచ్ కుబేర్ నివృత్తి చేస్తోందని వీడియోలో తెలిపింది. అసలు తగ్గేదే లే..! ఫ్యామిలీమెన్-2 సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌తో గ్లోబల్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న సమంత తన బిజినెస్‌ని కూడా విస్తరిస్తుంది . వ్యాపార పరంగా తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది సమంత. ఇప్పటికే ఆర్బన్ కిసాన్, సాకీ పలు ఇతర బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా సమంత వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: LIC: ఎల్ఐసీ దూకుడు..తొలి ఆర్నెళ్లలో రాకెట్లా.. -
మంచి మాట.. రేపటి కోసం...
‘ఆకాశవాణి... ఇప్పుడు మీరు వింటున్నది శుభ్ కల్(రేపటి కోసం)’ అని రేడియో నుంచి ఆమె గొంతు వినిపించినప్పుడు ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు తమ రేడియో దగ్గరికి వడివడిగా వస్తారు. రేడియోసౌండ్ పెంచుతారు. గ్రామీణ మహిళలకు చాలా ఇష్టమైన రేడియో కార్యక్రమం ఇది. ‘శుభ్ కల్’లో సినిమా పాటలు, కథలు, నాటికలు వినిపించవు. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలు వినిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు వినడానికి ఆసక్తి చూపేవారు తక్కువగా ఉంటారు. ఆసక్తికరంగా చెబితే ఎలాంటి విషయాలనైనా ఆసక్తికరంగా వింటారని నిరూపించింది 27 సంవత్సరాల వర్షా రైక్వార్. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాకు చెందిన వర్ష ‘బుందెల్‌ఖండ్ 90.4 ఎం.ఎమ్’లో రేడియో జాకీ. వర్ష నాన్న రైతు. ఆయన వరుస కరువులతో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకానొక దశలో ఊరు విడిచి వలస వెళదామని కూడా ఆలోచించాడు. చిన్నప్పుడు తండ్రిని అడిగేది ‘వర్షాలు ఎందుకు రావడం లేదు?’ ‘కరువు ఎందుకు వస్తుంది?’.. ఇలాంటి ప్రశ్నలకు ఆయన చెప్పే జవాబు ఒక్కటే...‘అంతా విధినిర్ణయం తల్లీ. మనమేమీ చేయలేము. మనం మానవమాత్రులం’ అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో...కరువు కాటకాల్లో విధి పాత్ర కంటే మానవతప్పిదాల పాత్రే ఎక్కువ ఉందని గ్రహించింది. తప్పులు మూడు విధాలుగా జరుగుతాయి. తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పులు, తెలిసీ తెలియక చేసే తప్పులు. ఈ మూడు సమూహాలను దృష్టిలో పెట్టుకొని ‘శుభ్ కల్’ కార్యక్రమానికి డిజైన్ చేసింది వర్ష. గంభీరమైన ఉపన్యాసాలు, అంత తేలిగ్గా అర్థం కాని జటిల సాంకేతిక పదజాలం కాకుండా స్థానిక భాష, యాసలతో నవ్వుతూ, నవ్విస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది వర్ష. కొన్ని స్కిట్స్‌లో రెండు పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర పర్యావరణానికి సంబంధించి మంచిపనులు చేస్తుంటుంది. రెండో పాత్ర...ఇదంత వ్యర్థం అనుకుంటుంది. రెండు పాత్రల మధ్య స్థానిక యాసలలో జరిగే సరదా సంభాషణ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటుంది. వాదనలో చివరికి రెండో పాత్ర ఓడిపోతుంది. తన తప్పును తెలుసుకొని ‘ఇలాంటి తప్పు మీరు చేయవద్దు’ అని చెబుతుంది. ఈ కార్యక్రమంతో ప్రభావితం అయిన రాజ్పూర్ గ్రామరైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. ఈ గ్రామాన్ని మిగిలిన గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. కేవలం రేడియో కార్యక్రమానికే పరిమితం కాకుండా ‘పల్లె పల్లెకు’ అంటూ తన బృందంతో కలిసి పల్లెలకు వెళుతుంటుంది వర్ష. ఆమె వెళ్లే పల్లెలలో వాహనాలు వెళ్లలేనివి మాత్రమే కాదు కాలినడకన వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పల్లెలు ఉన్నాయి. రేడియో జాకీగా మంచి పేరు ఉండడంతో ఏ పల్లెకు వెళ్లినా వర్షను గుర్తుపట్టి ఆదరిస్తారు. ఆ ఆదరణతోనే మహిళలతో సమావేశాలు నిర్వహించి చెట్లు పెంచడం వల్ల ఉపయోగాలు, నీటి సంరక్షణ మార్గాలు, సేంద్రియ వ్యవసాయం...ఇలా ఎన్నో విషయాలను చెబుతుంది. ఆ కార్యక్రమాలు ఎంత మంచి ఫలితం ఇచ్చాయంటే మొక్కలు నాటడాన్ని మహిళలు తప్పనిసరి కార్యక్రమం చేసుకున్నారు. నీటి వృథాను ఆరికట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు. కిచెన్ గార్డెన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్య సమితి ‘వి చేంజ్ నౌ’ మూమెంట్ యంగ్క్లైమెట్ లీడర్స్‌లో వర్ష ఒకరు. ‘మన భూమిని మనమే రక్షించుకోవాలి’ అంటుంది వర్ష రైక్వార్. అందరూ వినదగిన మాటే కదా! -
బాలాకోట్ హీరో అభినందన్‌కు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చిన భారత వాయుసేన పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ‘గ్రూప్ కెప్టెన్’ ర్యాంక్ దక్కనుంది. సంబంధిత ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యాక ఆయనకు ఆ ర్యాంక్ ఇవ్వాలని భారత వాయుసేన నిర్ణయించిందని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదుల శిక్షణ శిబిరంపై భారత వాయుసేన విమానాలు మెరుపుదాడి చేసిన సంగతి తెల్సిందే. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 2019 ఫిబ్రవరి 27న భారత దాడి తర్వాతి రోజునే పాకిస్తాన్ తన వాయుసేన దళాలను ప్రతిదాడి కోసం భారత్ వైపునకు పంపింది. వీటిని తిప్పికొట్టేందుకు భారత వాయుసేన బలగాలు గగనతలంలో ముందుకు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తాను నడుపుతున్న మిగ్–21 బైసాన్ వాయుసేన యుద్ధవిమానంతో పాక్ ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు. చదవండి: (చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?) -
1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరూ ప్రమోట్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పాఠశాలలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. 1 తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులుగా మంత్రి సబితా రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఆ తెల్లారే సోమవారం విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేసవి సెలవులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే పదో తరగతి వార్షిక పరీక్షలు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు రద్దు చేయగా తాజాగా ప్రాథమిక నుంచి ఉన్నత విద్య (1నుంచి 9వ తరగతి) విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే విద్యాలయాలన్నీ మూసివేయగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. త్వరలోనే మరిన్ని కరోనా కట్టడి చర్యలు తీసుకునే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు చదవండి: మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్ -
‘1–5’ విద్యార్థులంతా పైతరగతులకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులను ఎగువ తరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు, ఫిబ్రవరి 25 నుంచి 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని, వారిని పైతరగతులకు పంపాలని విద్యాశాఖ నిర్ణయించి నట్లు ప్రభుత్వం పేర్కొంది. సోషియో ఎకనామిక్ ఔట్లుక్ నివేదికలో ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండగా ప్రత్యక్ష బోధన కొనసాగుతున్న పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లోనూ కరోనా బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, 2–3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలోనే చెప్పారు. ఈ మేరకు 6, 7, 8 తరగతుల ప్రత్యక్ష బోధనను నిలిపివేసేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 9వ తరగతి విషయంలోనూ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. బోర్డు ఎగ్జామ్స్ అయినందున పదో తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన కొనసాగించే అవకాశం ఉంది. -
నో ఎగ్జామ్స్.. వారంతా మళ్లీ పాస్!
చెన్నె: కరోనా మహమ్మారిపై పోరు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9, 10, 11వ తరగతి విద్యార్థుల పరీక్షలు రద్దు చేసి వారిని ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం పరీక్షలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా రెండో దశ ప్రారంభమైనట్టు వైద్య నిపుణులు కొందరు చెప్తున్నారు. ప్రతిరోజూ అక్కడ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల పరీక్షలు రద్దు చేయాలని ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వ నిర్ణయంతో గతేడాదిలాగే ఈ ఏడాది కూడా విద్యార్థులు పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ కానున్నారు. కాగా, ఆయా రాష్ట్రాల్లో ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, కేరళలో కూడా హైస్కూల్ పరీక్షలు రద్దు చేసే అవకాశం ఉంది. -
పక్కా పాన్ మసాలా మోసం
పియర్స్ బ్రోస్నన్. మీరు జేమ్స్‌బాండ్ సినిమా అభిమానులైతే ఈయనను తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. ఒకవేళ కాకపోయినా, పాన్ బహర్ అన్న బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, ఒక చిన్న మౌత్‌ఫ్రెష్‌నర్ డబ్బాను చేతిలో పట్టుకొని, ఏదొక పేపర్లో, ఏదొక రోజు కనిపించే ఉంటాడు. పాపం ఆయన అది నిజంగానే ‘కేవలం’ మౌత్‌ఫ్రెష్‌నర్ అనుకొని ప్రమోట్ చేశాడు. అయితే పాన్ బహర్ బిజినెస్ అంతా గుట్కాలని ఆయనకు తెలీదు. పాన్ బహర్‌ను చూడగానే ప్రపంచానికి పాన్, గుట్కాలు తప్ప ఇంకేం గుర్తుకురాదని కూడా ఆయనకు తెలీదు. మొత్తానికి చక్కగా ఇరుక్కున్నాడు. చివరకు అశోక్ అండ్ కో కంపెనీ తనను మోసం చేసిందని విన్నవించుకోవాల్సి వచ్చింది. భారత్‌లో పొగాకు సంబంధిత పదార్థాలు ఏవీ ప్రమోట్ చేయడానికి వీల్లేదు. బ్రోస్నన్ ఇలా పాన్ బహర్‌ను ప్రమోట్ చేసినందుకు ఆయన మన ప్రభుత్వానికి తన బాధను తన లాయర్ల ద్వారా తెలియపర్చుకోవాల్సి వచ్చింది. కేవలం మౌత్ ఫ్రెష్నర్ అన్న పేరుతోనే ప్రమోట్ చేశానని, తనను మోసం చేశారని చెప్పుకొచ్చాడు బ్రోస్నన్. నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాల్లో నటించి బాండ్ అంటే ఇలాగే ఉంటాడు అనిపించుకున్న బ్రోస్నన్ పాన్ బహర్‌ను ప్రమోట్ చేసినప్పుడు ఆయనపై ఇండియన్ సినిమా అభిమానులంతా రకరకాలుగా జోక్స్ చేసుకున్నారు. -
అక్షయ్ @ టాయ్‌లెట్ భారత్!
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అంటే... కడుపు నిండడం కోసం ఏ పనైనా చేయొచ్చని ఓ అర్థం. సినిమా స్టార్స్ ఈ సామెతను తమకు అనుకూలంగా మలుచుకుని పబ్లిసిటీ కోసం కోటి విద్యలు అంటున్నారు. ఇదిగో... హిందీ హీరో అక్షయ్‌కుమార్‌ను చూడండి! శనివారం ఉదయం మధ్యప్రదేశ్‌లో ఓ టాయ్‌లెట్ నిర్మాణానికి పార, పలుగు పట్టుకున్నారు. స్వతహాగా అక్షయ్‌కు సామాజిక స్పృహ ఎక్కువ. సైనికుల కుటుంబాలకు సహాయం చేస్తుంటారు. కానీ, ఈ టాయ్‌లెట్ నిర్మాణానికి సహకరించడం మాత్రం పబ్లిసిటీ స్టంట్. ‘టాయ్‌లెట్ – ఏక్ ప్రేమ్ కథ’ పేరుతో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో ఓ జంట మధ్య టాయ్‌లెట్ ఎలాంటి పాత్ర పోషించిందనే కథతో రూపొందిన ఈ సినిమా పబ్లిసిటీ కోసమే అక్షయ్ ఈ టాయ్‌లెట్ భారత్ పనుల్లో పాల్గొన్నారని ముంబయ్ జనాలు అంటున్నారు. మున్ముందు దీన్నో ఉద్యమంలా మలచినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఆగస్టు 11న ‘టాయ్‌లెట్ – ఏక్ ప్రేమ్ కథ’ను విడుదల చేయాలనుకుంటున్నారు. అంటే... ఐదు నెలల ముందే అక్షయ్ పబ్లిసిటీ ప్రారంభించారన్నమాట. -
షారూఖ్.. చాలా కాలం తరువాత..!
-
కేంద్రం తదుపరి నిర్ణయం వింటే ఇక అంతే!
న్యూఢిల్లీ: అవినీతి నిరోధం, నల్లధనాన్ని అరికట్టడం, దేశంలో నగదు రహిత లావాదేవీలను అమాంతం పెంచేందుకు అనూహ్యంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టబోతోంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఓ ప్యానెల్ నగదు చెల్లింపు లావాదేవీలను తగ్గించే చర్యలకు దిగాలని సూచించినట్లు తెలిసింది. దీంతో నగదు చెల్లింపులను తగ్గించేందుకు ఎవరైతే డబ్బు ద్వారా చెల్లింపులు చేస్తారో వారి నుంచి అదనపు చార్జీలు వసూలు చేసేందుకు సమాయత్తమవనుంది. దీంతో సాధారణంగా ఇప్పటి వరకు ఏటీఎంలు, క్రెడిట్ కార్డుల ద్వారా స్వైపింగ్ చేసినప్పుడు వసూలు చేసి కనీస ఛార్జీలు త్వరలో కార్డులకు కాకుండా ఎవరైతే డబ్బు ద్వారా చెల్లిస్తారో వారి నుంచి అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ పేమెంట్లను రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను చేపట్టే అవకాశం ఉందని, పెద్ద నోట్ల రద్దు అంశం తర్వాత త్వరలో కేంద్రం తీసుకురానున్న మరో మార్పు ఇదేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలుచెబుతున్నాయి. ఆర్ధికశాఖ మాజీ కార్యదర్శి రతన్ వతల్ పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులు తగ్గించేందుకు ఈ సూచనలు చేశారంట. ప్రస్తుతం జీడీపీలో 12శాతం ఉన్నవాటాను 30 నుంచి 90రోజుల మధ్య తగ్గించాలని అనుకుంటున్నారు. -
వ్యర్థాలనుంచి కంపోస్ట్ ప్రచారంలో అమితాబ్
న్యూఢిల్లీః బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ స్వచ్ఛభారత్ మిషన్ ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అభ్యర్థన మేరకు 'వేస్ట్ టు కంపోస్ట్' ( వ్యర్థాలనుంచి ఎరువులు) ప్రచారంలో ప్రధాన పాత్రను పోషించనున్నారు. చెత్తను సేకరించి ఎరువుల కంపెనీలకు అమ్మకాలు చేపట్టడం, వ్యర్థాలనుంచి ఎరువుల తయారీ వంటి విషయాలపపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బిగ్ బీ ముందుకొచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ ప్రచార కార్యక్రమంలో అమితాబచ్చన్ ప్రధాన పాత్ర వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా నగరాల్లో పేరుకునే వ్యర్థాలను ఎరువులుగా మార్చి పొలాలకు ఉపయోగించే ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచనున్నారు. ఈ సందర్భంలో నగరాల్లోని చెత్తను కంపోస్ట్ గా మార్చే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు మీరు అంగీకరించడం ఎంతో ఆనందంగా ఉందని, అందుకు మీకు కృతజ్ఞతలు అంటూ జూన్ 20న పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ బిగ్ బీ కి ప్రత్యేక లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. చెత్తను కంపోస్ట్ గా మార్చి, ఇళ్ళలోని గార్డెన్లలో వినియోగించేందుకు ప్రజలకు, నర్సరీల యజమానులకు, ఉద్యానవన సంస్థలు, ఏజెన్సీలకు రేడియో, టీవీ ప్రకటనలు పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించడంలో వ్యక్తిగతంగానూ, వాయిస్ ద్వారానూ భాగం పంచుకొంటూ.. స్వచ్ఛభారత్ ప్రచారంలో అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ మంత్రిత్వ శాఖ సదరు లేఖలో తెలిపింది. అత్యధిక చెత్త ఏర్పడే అవకాశం ఉన్న హోటల్స్, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటుచేసి సేంద్రీయ వ్యర్థాలను విడివిడిగా వేయాలన్న విజ్ఞప్తుల ద్వారా పౌరులను ప్రోత్సహించడంలోనూ, బహుళ వేదికల ద్వారా సమాచార ప్రచారాన్ని చేరవేయడంలోనూ అమితాబ్ క్రియాశీలక పాత్ర పోషించేందుకు మంత్రిత్వ శాఖ ప్రణాళికలు చేస్తోంది. ఐదేళ్ళ గడువులోగా దేశం మొత్తం పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో 2014 అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ అభియాన్, క్లీన్ ఇండియా మిషన్ కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. -
సోషల్ మీడియా వేదికగా గ్రేటర్ ప్రచారం
-
రుద్రమదేవికి సాయం చేస్తున్నమహేష్..?
-
మార్పుసహజం అంటున్న నయనతార
-
కొచ్చాడయాన్ ప్రమోషన్లో దీపికా
-
‘నమో’ జపంతో ప్రజల్లోకి...
బీజేపీ ఎన్నికల నినాదం ‘ప్రధాని పదవికి మోడీ’ పార్టీ పార్లమెంటరీ బోర్డు, సీఎంల భేటీలో నిర్ణయం 272కుపైగా ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యం కాంగ్రెస్ సీట్లపై గురికి మోడీ సూచన ‘ఒక ఓటు-ఒక నోటు’ కింద విరాళాల సేకరణ సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ న.మో (నరేంద్ర మోడీ) జపంతో ప్రజల్లోకి వెళ్లనుంది. ‘మోడీ ఫర్ పీఎం’ (ప్రధాని పదవికి మోడీ) నినాదంతో ఎన్నికల బరిలోకి దిగనుంది. అలాగే పొత్తులపై ఆధారపడకుండా సొంతంగా 272కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. మంగళవారం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన ఆ పార్టీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంటరీ బోర్డు సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీతోపాటు, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు మనోహర్ పారికర్, వసుంధర రాజె, శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. పార్టీ సీఎంల సమావేశంలో మోడీ మాట్లాడుతూ 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పార్టీ అభ్యర్థులు తలపడి రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. అదేసమయంలో యూపీఏ ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతను ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పోలిస్తే మొత్తంగా 89 లక్షల ఓట్లు పార్టీ వెనకబడిందని...ఆ లోటును పూడ్చుకునే చర్యల్లో భాగంగా గత ఐదేళ్లలో నమోదైన 12 లక్షల మంది కొత్త ఓటర్లను కూడా ఆకర్షించేందుకు ప్రయత్నించాలన్నారు. ఈ సమావేశాల అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ విలేకరులతో మాట్లాడుతూ మోడీ ఫర్ పీఎం (ప్రధాని పదవికి మోడీ) తమ ప్రచార నినాదంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోలేందుకు ఎమర్జెన్సీ సమయంలో(1975) జయప్రకాశ్ నారాయణ సాగించిన ఉద్యమ తీరులోనే తమ ప్రచారం కూడా ఉంటుందని చెప్పారు. 1977లో వాతావరణం పూర్తిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉందని.. ఇప్పుడు కూడా దేశంలో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయన్నారు. తమ పార్టీ ప్రచారంలో భాగంగా కార్యకర్తలు 10 కోట్ల కుటుంబాలను కలసి మోడీని గెలిపించాలని అభ్యర్ధించడంతోపాటు ‘ఒక ఓటు ఒక నోటు’ కార్యక్రమం కింద నిధులను కూడా సేకరిస్తారని తెలిపారు. కనీసం 10 రూపాయలు, గరిష్టంగా 1,000 రూపాయల వరకు విరాళంగా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం దేశవ్యాప్తంగా సుపరిపాలన దివస్ నిర్వహించడానికి పార్టీ పిలుపునిచ్చిందని తెలిపారు. కాగా, మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపీ జాతీయ పదాధికారులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్నికల ఏర్పాట్ల కమిటీలతో జరిగిన భేటీలో శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్ సింగ్, వసుంధర రాజేతోపాటు పార్టీ ఢిల్లీ సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ హర్షవర్ధన్‌ను సత్కరించారు. సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నేతలు బండారు దత్తాత్రేయ, హరిబాబు, రవీంద్రరాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు. భేటీ అనంతరం బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు 120 రోజుల గడవు ఉందని...ఇందులో 60 రోజులు ఏర్పాట్లకు, 60 రోజులు ప్రచారానికి కేటాయించేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు పదేళ్ల చీకటి పాలనపై చార్జీషీట్ రూపొందించడంతోపాటు ఇండియా272.కామ్ పేరుతో వెబ్సైట్ ఏర్పాటు, పార్టీ విజన్ డాక్యుమెంట్, మేనిఫెస్టోలను రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. -
‘అమ్మ’ భాషను ప్రోత్సహించా
కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ దినకర్‌బాబు పిలుపునిచ్చారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అతివేగంగా కనుమరుగవుతున్న భాషలో తెలుగు ఉండటం శోచనీయమన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లభాష ప్రాముఖ్యత పెరుగుతున్నప్పటికీ మాతృ భాషలో విద్యాబోధన చేపట్టడం వల్ల చెప్పాలనుకున్న విషయాన్ని విద్యార్థులకు సులభంగా చెప్పవచ్చన్నారు. తెలుగు భాష సంస్కృతి, గొప్పతనాన్ని పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు బోధించాలన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు గిడుగు రామమూర్తి వంటి కవులు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. తెలుగు భాషలోని కఠిన పదాలను వాడుక భాషలోకి మార్చి అందరికి అర్థమయ్యేలా గిడుగు రామమూర్తి విశేష కృషి చేశారన్నారు. ఏజేసీ మూర్తి మాట్లాడుతూ దేశభాషలందు తెలుగు లెస్స అనే విధంగా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తెలుగు నలుదిశలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు. నన్నయ్య, తిక్కయ్య, ఎర్రప్రగడ వంటి వారు భాషాభివృద్ధికి సాహితీ పరంగ విశేష కృషి చేశారన్నారు. డీఈఓ రమేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాల ప్రకటనలు తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు భాషకు కృషి చేసిన ఉపాధ్యాయులు ఎండీ షరీఫ్, ఉండ్రాల్ల రాజేశం, సంపత్‌కుమార్ తెలుగులో పది పాయింట్లు సాధించిన ప్రత్యుష తండ్రిని కలెక్టర్ సన్మానించారు. సమావేశంలో యువజన సంక్షేమ శాఖాధికారి రాంచంద్రయ్య, ఎంఈఓ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.