
భారత్‌లో క్రిప్టోకరెన్సీపై నెలకొన్న ఆదరణను పలు కంపెనీలు క్యాష్ చేసుకునేందుకు సిద్దమైనాయి. వజీర్‌ఎక్స్, కాయిన్ డీసీఎక్స్, కాయిన్ స్విచ్ కుబేర్ లాంటి క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్ ఇండియన్ క్రిప్టో ఇన్వెస్టర్లకు మరింత దగ్గరవుతున్నాయి. క్రిప్టో నియంత్రణపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొనప్పటికీ ఆయా ఇండియన్ క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫామ్స్ మాత్రం భారతీయుల్లో క్రిప్టో మరింత అవగాహన తెచ్చేందుకు ప్రముఖులతో ప్రమోషన్స్‌ను చేపట్టాయి. తాజాగా కాయిన్‌స్విచ్ కుబేర్ క్రిప్టో యాప్‌కు ప్రచారకర్తగా సమంత మారింది. చిన్న మొత్తాలతో ఇన్వెస్ట్ చేసి భారీగా లాభాలు సంపాదించొచ్చని తెలిపే వీడియోను సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది.
రూ. 100తో మొదలు..!
పలు క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆయుష్మాన్ ఖురానా, రణ్‌వీర్ సింగ్ లాంటి దిగ్గజ నటులు భారత్‌లో ప్రచార కర్తలుగా మారారు. క్రిప్టోకరెన్సీ ప్రచారంలో తాజాగా సమంత కూడా వచ్చి చేరింది. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సమంత చేస్తున్న ప్రచారం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాయిన్‌స్విచ్‌కుబేర్ క్రిప్టోపై ఇన్వెస్ట్ చేయడం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినట్లు షేర్ చేసిన వీడియోలో పేర్కొంది. కేవలం రూ.100 నుంచి క్రిప్టోపై ఇన్వెస్ట్ చేయవచ్చునని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీపై సందేహాలను కాయిన్‌స్విచ్ కుబేర్ నివృత్తి చేస్తోందని వీడియోలో తెలిపింది.
అసలు తగ్గేదే లే..!
ఫ్యామిలీమెన్-2 సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌తో గ్లోబల్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న సమంత తన బిజినెస్‌ని కూడా విస్తరిస్తుంది . వ్యాపార పరంగా తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది సమంత. ఇప్పటికే ఆర్బన్ కిసాన్, సాకీ పలు ఇతర బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా సమంత వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment