
కేంద్రం తదుపరి నిర్ణయం వింటే ఇక అంతే!
దీంతో సాధారణంగా ఇప్పటి వరకు ఏటీఎంలు, క్రెడిట్ కార్డుల ద్వారా స్వైపింగ్ చేసినప్పుడు వసూలు చేసి కనీస ఛార్జీలు త్వరలో కార్డులకు కాకుండా ఎవరైతే డబ్బు ద్వారా చెల్లిస్తారో వారి నుంచి అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ పేమెంట్లను రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను చేపట్టే అవకాశం ఉందని, పెద్ద నోట్ల రద్దు అంశం తర్వాత త్వరలో కేంద్రం తీసుకురానున్న మరో మార్పు ఇదేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలుచెబుతున్నాయి. ఆర్ధికశాఖ మాజీ కార్యదర్శి రతన్ వతల్ పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులు తగ్గించేందుకు ఈ సూచనలు చేశారంట. ప్రస్తుతం జీడీపీలో 12శాతం ఉన్నవాటాను 30 నుంచి 90రోజుల మధ్య తగ్గించాలని అనుకుంటున్నారు.