మహిళలే కదా అని తీసిపడేయకండి. వాళ్లకేం తెలుసు రాజకీయాలు అనే పరిస్థితి పోయింది. అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తూ తామేంటో ప్రూవ్ చేస్తున్నారు. ఇంతకమునుపు ఎన్నికల్లో మహిళలు ఓటు వేసింది తక్కువే. అంత అవగాహన, చదువు లేకపోవడం వంటి కారణాలతో ఓటు హక్కు వినియోగించలేకపోయేవారు చాలామంది. కానీ ఇటీవల జరిగిన తెలంగాణ, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మహిళా ఓటర్లే కీలకమని నివేదికలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో కీలక తీర్పే ఇచ్చేది 'ఆమె' అని తేలింది కూడా. ఎందుకంటే మహిళ ఓటర్లే అధికంగా ఉన్నట్లు సర్వేలు కూడా చెబుతున్నాయి. మరీ మహిళలు మీ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారా..!.
ఈ రోజు సెలవురోజు అని సెల్‌ఫోన్లకు, టీవికి అతుక్కుపోవద్దు. ఓటు వేసి కుర్చీ ఎవరికి ఇవ్వాలన్నది నిర్ణయించండి. మహిళలంటే కేవలం ఇంటి భాద్యతలోనే కాదు అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాధికారంలోనూ భాగం అని నిరూపిద్దాం. మార్పులో భాగం అయ్యి, బంగారు భవిష్యత్తుకు బాటలు పరుద్దాం. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో మహిళలు ఓటు హక్కు వినియోగించుకోమని చెబుతూ ఎలా అవగాహన కల్పించారో సవివరంగా చూ ద్దామా!.
ఇటీవల కోయంబత్తూరులో వందమందికి పైగా మహిళలు కలిసి బ్రూక్‌ఫీల్డ్స్ మాల్ దగ్గర ఓటు ప్రాధాన్యతను చాటిచెప్పేలా ముగ్గులు వేశారు. అలానే చత్తీస్‌గఢ్‌లోని బాల్‌రామ్‌పుర్ జిల్లాలో స్వయం సహాయక మహిళా బృందాలు వినూత్న ప్రచారానికి నాంది పలికారు. ఏకంగా రావి ఆకుల తోపాటు పసుపు కలిపిన బియ్యాన్ని ఇంటింటికీ తిరిగి మరీ పంచిపెట్టి మరీ ఓటు హక్కును వినియోగించుకోమని అభ్యర్థించారు.
తాజాగా కర్ణాటకలో మహిళా ఆఫీసర్లు సైతం ఓటింగ్ శాతం పెంచడం కోసం ‘చునావనా పర్వా- దేశదా గర్వ’ అంటే (ఎలక్షన్ పండుగ దేశానికే గర్వం) అని రాసి ఉన్న చీరలను ధరించి మహిళా ఓటర్లలో స్ఫూర్తి నింపారు. మహిళలే కదా వాళ్ల ఓటు హక్కు పడకపోతే ఈ సమాజానికి ఏముందిలే నష్టం అని తీసిపరేయకండి. ఎందుకంటే తాజాగా జరిగిన కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పే కీలమని తేలింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ సగానికి పైగా ఉంది మహిళా ఓటర్లే. అందువల్ల మహిళలు ప్రజాస్వామ్య అతిపెద్ద వేడుకలో భాగమయ్యి..ఒక్క సిరా గీతతో భవిష్యత్తుకు బంగారు బాటలు పరవండి.
(చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!)
Comments
Please login to add a commentAdd a comment