
జైపూర్: రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. కాగా మే 14వ తేదీన రెండో షిప్టుకు సంబంధించిన ప్రశ్నాపత్నం పరీక్షలకు కొంత సమయం ముందే జొత్వారా పట్టణంలోని ఎగ్జామ్ సెంటర్ నుంచి లీక్ అయింది. దీనిని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మే 14న పరీక్ష రెండవ షిఫ్ట్ సమయంలో జైపూర్‌లోని దివాకర్ పబ్లిక్ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ సమయానికి ముందే పేపర్ కవరు తెరిచారు. దీంతో ఈ షిష్ట్‌లో జరిగన పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించనున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పేపర్ లీక్‌పై కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా రాజస్థాన్ పోలీసులు మే 13 నుంచి మే 16 వరకు కానిస్టేబుల్ పోస్టు కోసం రాత పరీక్షను నిర్వహించారు.
చదవండి: ఉచిత ప్రయాణానికి చెల్లు.. 1 నుంచి బస్సుల్లో పోలీసులకూ టికెట్
Comments
Please login to add a commentAdd a comment