
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఈ ఏడాది సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు ఊరట కలగనుంది. ఈ మేరకు ఫెయిల్ అయిన విద్యార్థులను కంపార్ట్‌మెంట్ పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. (డిగ్రీ,పీజీ పరీక్షలపై హైకోర్టు విచారణ)
‘ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 1.47 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన వారిని కూడా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోమని చెప్పాం. అందుకు దాదాపు 73 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆ ప్రక్రియ కూడా 10 రోజుల్లో పూర్తి అవుతుంది. ఆ తర్వాత వారి రిజల్ట్స్‌ను ప్రకటిస్తాం. సెకండియర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులను కంపార్టమెంట్ పాస్ చేస్తున్నాం. జూలై 31 తర్వాత వారి మార్కుల మెమోలు సంబంధిత కళాశాలల్లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల పైచదువులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment